breaking news
Salar Jung
-
ఆ 102 ఎకరాలు సర్కారువే.. సాలార్ జంగ్ వారసులకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేలి్చచెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమరి్థంచాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అ«దీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంక్వైరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుస్త్రీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేలి్చనందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేలి్చచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలని స్పష్టం చేసింది. -
కరీంనగర్ ‘సాలార్ జంగ్’కు జాతీయ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: గత 60 ఏళ్లుగా వైద్య వృత్తిలో చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ దారం నాగభూషణంకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రదానం చేసింది. అరుదైన కళాఖండాలతో ఆయన ఒక మ్యూజియంనే ఏర్పాటు చేశారు. దీంతో ఆయన్ను ‘కరీంనగర్ సాలార్ జంగ్’గా పిలుచుకుంటారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘వయో శ్రేష్ట్ సమ్మాన్-2016’ పేరిట ఈ అవార్డును ప్రదానం చేసింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థల కృషిని గుర్తిస్తూ అవార్డులను ప్రదానం చేసింది. శనివారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో వయో వృద్ధులు 10.5 కోట్ల మంది ఉన్నారని, 2026 నాటికి ఈ సంఖ్య 17.2 కోట్లకు చేరుకుంటుందన్నారు. అందువల్ల భవిష్యత్‌లో వృద్ధుల సంక్షేమానికి నిపుణుల సామర్థ్యం, వైద్య సాంకేతికత అవసరమని అభిప్రాయపడ్డారు. వృద్ధుల సమాజ భాగస్వామ్యం, వారి ఆర్థిక స్వేచ్ఛను, హక్కులను రక్షించడానికి మరిన్ని వనరులు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు టావర్‌చంద్ గెహ్లట్, విజయ్ సంప్లా తదితరులు పాల్గొన్నారు. -
బుక్ & క్లిక్
ఓల్డ్ ఈజ్ గోల్డ్. అదేమిటో తెలియాలంటే నాటి వాసనలు నేటికీ పోని పాతబస్తీకి వెళ్లాలి. చరిత్ర చెప్పే చార్మినార్ చూడాలి. కొండంత రాచఠీవీ ఒలకబోసే గోల్కొండ చూడాలి. చౌమహల్లా ప్యాలెస్సూ, నిజాం నగల తేజస్సూ దర్శించాలి. ఈ సిటీ.. కొత్త ఒక వింత. ఇదేమిటో తెలియాలంటే సింగపూర్‌కి సీక్వెల్ లాంటి మాదాపూర్‌కి వెళ్లాలి. హైటెక్ సిటీ దిశగా హైజంప్ చేయాలి. ఐమ్యాక్స్ తెరకు కళ్లప్పగించాలి. ఫిలింనగర్ స్టార్లూ.. ఫైవ్‌స్టార్ బార్లూ.. సాలార్జంగ్ మ్యూజియమ్మూ.. పబ్బుల్లో దమ్మారో దమ్మూ.. ఒకటికి ఒకటి పొసగని జీవనశైలుల వైరుధ్యానికి, సజీవ సంప్రదాయాల సమన్వయానికి ఉదాహరణ ఈ నగరం. కలల నగరం.. కలానికి వరం.. ఇదొక విచిత్రాల ఊరు. తెల్సుకుంటున్న కొద్దీ తెరుచుకునే విశేషాల హోరు. ప్రయాస లేకుండానే ప్రాణం పోసుకునే ప్రాస కవితలా.. అలా అలా తిరుగుతుంటే చాలు సిటీపై ఇష్టం కూడా అనాయాసంగా పుట్టుకొస్తుంది. సిటీలో తిరుగుతున్నకొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ప్రేయసి మీద పెరిగే ప్రేమ అయితే వర్ణిస్తూ ప్రేమలేఖ రాస్తామేమో..! ప్రేమ పునాదిగా పురుడు పోసుకున్న ఈ లవ్లీ సిటీ మీద ఇష్టం పెరుగుతున్న కొద్దీ సిటీ స్పెషల్‌గా ఏదైనా రాయలనిపిస్తోందేమో..! అందుకే ఈ నగరం మీద వచ్చినన్ని పుస్తకాలు బహుశా మరే నగరం గురించీ ఇప్పటిదాకా వచ్చి ఉండకపోవచ్చు. ఇంకా పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉండవచ్చు. ఎన్నెన్నో పుస్తకాలు.. ఫొటోలు.. ‘ఎంత చెప్పినా, ఎంత చూపినా ఇంకా కొంత మిగిలే ఉండే వండర్ మన భాగ్యనగరం’ అంటారు నగరంలో ఫొటోగ్రాఫర్‌గా ప్రసిద్ధుడైన రవీందర్‌రెడ్డి. రచయిత నూపుర్కుమార్తో కలిసి ఆయన భాగ్య నగరంలోని వింతలు విశేషాలతో పోట్రెయిట్ ఆఫ్ ఎ సిటీ పేరుతో పుస్తకం రూపొందించారు. నరేంద్రలూధర్ ఆవిష్కరించిన ‘రాజా దీనదయాళ్’, ‘రాక్ స్పేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’, సయ్యద్ ఇమామ్ రచించిన ‘ది అన్‌టోల్డ్ చార్మినార్’, వనజ బెనజిర్ అందించిన ‘హైదరాబాద్ హజిర్ హై’, మధు వట్టి రచన ‘ఎ గైడ్ టు హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్’, మల్లాది కృష్ణానంద్ రాసిన ‘హెరిటేజ్ హైదరాబాద్’, ఇంకా... ‘హైదరాబాద్ ఎ విజువల్ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ’, ‘ది స్ల్పెండర్స్ ఆఫ్ హైదరాబాద్’, ‘హైదరాబాద్ 400 ఇయర్స్’.. ఇలాంటివెన్నో ఉన్నాయి. నగరం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకాలను తిరగేయడం ఓ మంచి అవకాశం. మరోవైపు ఎంత రాసినా ఇంకా తర‘గని’ విశేషాల గని లాంటి ఈ ఊరు రచయితల కలాలకూ, హైదరాబాద్ ఫొటోగ్రాఫర్ల కెమెరాలకూ పనిపెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. దీంతో సిటీపై బుక్స్ మాత్రమే కాదు డాక్యుమెంటరీలు, షార్ట్ఫిలింస్ వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమాలకైనా, డాక్యుమెంటరీస్కైనా.. సిటీని మించిన ముడిసరుకు ఎక్కడా దొరకదు’ అని చెప్పారు సిటీ బేస్డ్ టూరిస్ట్ ప్లేసెస్‌పై ఇటీవలే ఒక విజయవంతమైన డాక్యుమెంటరీని రూపొందించిన సిటీ యువకుడు రాజ్‌కిషోర్. ..:: ఎస్.సత్యబాబు


