Sakib Hussain
-
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ బౌలర్
సన్‌రైజర్స్ యువ పేసర్ సాకిబ్ హుసేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ కెరీర్ తొలి 10 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిన్న (మే 22) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వికెట్ తీయడంతో సాకిబ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా సాకిబ్‌కు ముందు ఫిల్ఫెన్హాస్ (13 వికెట్లు), ఎంగిడి (13) ఈ ఘనత సాధించిన బౌలర్లు ఉన్నారు. వీరిద్దరూ విదేశీయులే.ఇదే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ బిహారి బాయ్.. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన (4-24) ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న సాకిబ్.. సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. యార్కర్లు, స్లో బాల్స్‌తో చెలరేగిపోయే ఈ నయా పేస్ సెన్సేషన్.. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.కాగా, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ, గుజరాత్‌తో పాటు ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టుకు ఈ విజయం ఎలాంటి అక్కరకు రాలేదు. ఆర్సీబీపై గెలిచినా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైన ఎలిమినేటర్ గండాన్ని దాటాల్సి వచ్చింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్ క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం, ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను ఎదుర్కొనేందుకు నాలుగు జట్లు (రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ) పోటీపడుతున్నాయి. లక్నో, ముంబై, సీఎస్కే ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.భారీ స్కోర్‌టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను హైదరాబాద్‌వైపు తిప్పేశాడు. ట్రవిస్ హెడ్ (26) కూడా వేగంగా ఆడగా.. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51), నితీశ్‌కుమార్ రెడ్డి (29 నాటౌట్) కూడా చెలరేగడంతో చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది.అనంతరం లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ (44) మెరుపులు మెరిపించాడు. కోహ్లి (15) మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్ (21), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్‌కు ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిసల్ బీహార్’తో కూడిన జెర్సీని కెప్టెన్, వైస్ కెప్టెన్ హోదాలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి ఆవిష్కరిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్రత్యక్షమవ్వడం వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (కేకేఆర్), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్హెచ్) కూడా అదే రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ నలుగురు బీహార్ నుంచి వచ్చినవారు కావడంతో సెపరేట్‌గా ఒక ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశం క్రీడల పరంగా బీహార్‌ను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు తర్వాతి తరం క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లాగే బీహార్‌కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బీహార్ గడ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. గోపాల్‌గంజ్‌లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ తన బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ తన డైనమైట్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. వీరందరిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటింగ్‌లో మెరిసిన వాళ్లలో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్‌కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ సీజన్లో వైభవ్ 13 మ్యాచ్‌ల్లో 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 13 మ్యాచ్‌ల్లో 490 పరుగులతో రేసులో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అనిల్ అగర్వాల్ ప్రతిపాదనతో బీహార్ నూతన ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ ఏకీభవించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతో ఒక మిషన్ మోడ్లా పనిచేస్తోంది. మీరు ప్రతిపాదించిన విషయంతో ఏకీభవిస్తూ ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవలే ఆర్సీబీ, రాజస్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధరకు చేతులు మారాయి. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్లో ఫ్రాంచైజీల సంఖ్యను విస్తరించాలనుకుంటే మాత్రం బీహార్‌కు చెందిన అనిల్ అగర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026 आपकी बात से पूर्णतः सहमत हूँ।बिहार के क्रिकेट "इमोशन" के लिए सरकार स्पष्ट "विजन" के साथ "मिशन" मोड में कार्यरत है। आपके सहयोग से निश्चित ही बिहार की क्रिकेट टीम को लेकर सकारात्मक निर्णय लिया जाएगा। https://t.co/Q5xfXYGwiC— Samrat Choudhary (@samrat4bjp) May 22, 2026చదవండి: పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర! -
సన్‌రైజర్స్‌కు వరంలా మారిన సాకిబ్ హుస్సేన్
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడినా, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఎస్ఆర్హెచ్ జోరు చూస్తేంటే ఈ సీజన్ టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.సీజన్ ప్రారంభంలో బౌలింగ్‌లో చాలా ఇబ్బంది పడిన ఈ జట్టు యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ రాకతో ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్‌గా మారిపోయింది. సాకిబ్ తొలి మ్యాచ్‌లోనే అబ్బురపరిచే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సాకిబ్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.అనంతరం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనూ సాకిబ్ సత్తా చాటాడు. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. తాజాగా (ఏప్రిల్ 21) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకిబ్ మరోసారి జూలు విదిల్చాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్ చేసే 21 ఏళ్ల సకీబ్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతూ ఎస్ఆర్హెచ్ పాలిట వరంలా మారాడు. అతను ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 6 వికెట్లు తీసి సన్‌రైజర్స్ గెలుపుయాత్రలో ప్రధాన భాగమయ్యాడు. సాకిబ్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలిచింది. అలాగే సాకిబ్ 3 మ్యాచ్‌లు ఆడినా ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. సకీబ్ ఇప్పటివరకు వేసిన 72 బంతుల్లో కేవలం 85 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పిసినారి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా సకీబ్ రాక సన్‌రైజర్స్ ఫేట్‌ను మార్చేసింది. ఇతను ఇదే జోరును కొనసాగిస్తే, ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ను టైటిల్ గెలవకుండా ఆపడం కష్టం.సకీబ్‌కు మరో యువ పేసర్ ప్రఫుల్ హింగే కూడా తోడయ్యాడు. అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతను సకీబ్ లాగా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో సకిబ్‌తో పాటు అద్భుత ప్రదర్శన (4-34) చేసిన హింగే ఆతర్వాతి మ్యాచ్‌లో ధారాళంగా (1-60) పరుగులు సమర్పించుకున్నాడు. సకీబ్, ప్రఫుల్ మాత్రమే కాకుండా ఈ సీజన్లో మరో ఇద్దరు సన్‌రైజర్స్ బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంకకు చెందిన పేసర్ ఎషాన్ మలింగ, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ అద్భుతంగా రాణిస్తూ సన్‌రైజర్స్ విజయాల్లో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌కు బౌలింగే ప్రధాన సమస్యగా ఉండేది. రెగ్యులర్ కెప్టెన్, జట్టు ప్రధాన పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా సగం సీజన్‌కు దూరమయ్యాడు. సీనియర్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి తరుణంలో ప్రఫుల్, సకీబ్, శివాంగ్ లాంటి దేశీయ బౌలర్లు వచ్చి సన్‌రైజర్స్ ఫేట్‌నే మార్చేశారు. త్వరలో కమిన్స్ కూడా వీరికి జత కలిస్తే సన్‌రైజర్స్‌ను ఆపడం చాలా కష్టమవుతుంది. ఈ జట్టు బ్యాటింగ్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ ఈ జట్టు సొంతం. ఫీల్డింగ్‌లో కాస్త మెరుగుపడితే ఈ సీజన్లో సన్‌రైజర్స్ గెలుపు తధ్యం. -
‘గోపాల్‌గంజ్ కా రబాడ’
సాక్షి క్రీడా విభాగం: రెండేళ్ల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ సీజన్లో జట్టులో భాగంగా ఉన్న పేసర్ సాకిబ్ హుస్సేన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఫైనల్ మ్యాచ్ తర్వాత సాకిబ్ తల్లిదండ్రులు జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన గంభీర్ ‘మీ వాడిలో చాలా ప్రతిభ ఉంది. జట్టు కూర్పులో భాగంగా అవకాశం ఇవ్వలేకపోయాం కానీ మున్ముందు అతను ఐపీఎల్లో తప్పక రాణిస్తాడు’ అని భరోసానిచ్చాడు. తర్వాతి సీజన్లో కేకేఆర్ అతడిని కొనసాగించకపోగా, ఈ ఏడాది సన్‌రైజర్స్ అతడిని ఎంచుకుంది. అతి సాధారణ నేపథ్యం ఉన్నా... కేవలం శ్రమ, పట్టుదలతో దూసుకొచ్చిన సాకిబ్ గాథ స్ఫూర్తిదాయకం. పేదరికం నుంచి వచ్చి... బిహార్‌లో బాగా వెనుకబడిన జిల్లాల్లో గోపాల్‌గంజ్ కూడా ఒకటి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన సాకిబ్‌కు ఎప్పటికైనా ఆర్మీలో చేరాలనేది కోరిక. అందుకే 15 ఏళ్ల వయసులో స్థానిక ఆర్మీ గ్రౌండ్లో రన్నింగ్, ఎక్సర్సైజ్లు అలవాటుగా మార్చుకున్నాడు. అయితే తన స్నేహితుల ద్వారా క్రికెట్‌పై కొంత ఆసక్తి పెంచుకొని టెన్నిస్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన అతను అదే బంతిపై పట్టు పెంచుకొని రాటుదేలాడు. స్థానికంగా జరిగే లేదా దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నాకు వెళ్లి టోర్నీలు ఆడి వచ్చేవాడు. మ్యాచ్ ఆడిన రోజు రూ.500–1000 వరకు లభించేవి.తమ టీమ్‌కు వరుస విజయాలు అందిస్తున్న సాకిబ్ను అంతా ‘గోపాల్‌గంజ్ కా రబాడ’ అని పిలిచేవాళ్లు. మరోవైపు వ్యవసాయదారుడు అయిన తండ్రి ఆదాయం చాలా స్వల్పం. క్రికెటర్‌గా శిక్షణ అందించే స్థాయి లేదు. ఇదే సమయంలో అతనికి మోకాలికి దెబ్బ తగలడంతో వ్యవసాయం కూడా కష్టంగా మారిపోయింది. ఇలాంటి స్థితిలో సాకిబ్ తెచ్చే చిన్న మొత్తం కూడా కుటుంబానికి ఉపయోగపడ్డాయి. క్రికెట్లో ఎదగాలని ప్రయతి్నస్తున్న సమయంలో రూ. 10 వేల విలువైన బౌలింగ్ స్పైక్స్ కొనే స్థోమత లేకపోగా...ఏదైతే అది అవుతుందని తల్లి తన వద్ద ఉన్న కాస్త నగలు అమ్మి స్పైక్స్ కొనిచ్చింది. లోపాలు సరిదిద్దుకొని... సాకిబ్ గురించి బాగా విన్న పట్నాలోని జెన్ నెక్ట్స్ అకాడమీ కోచ్ రాబిన్ సింగ్ ఈ కుర్ర పేసర్‌కు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. కోచ్ మార్గనిర్దేశనంలో అతని బౌలింగ్ ఎంతో మెరుగైంది. ఈ క్రమంలో వరుసగా వేర్వేరు వయో విభాగాల్లో అవకాశాలు వచ్చాయి. అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్న తర్వాతి 18 ఏళ్ల వయసులో ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ తరఫున టి20ల్లో అరంగేట్రం జరిగింది. అయితే నిలకడ లేక జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ ఎరుపు బంతితో మరింత కష్టపడిన సాకిబ్ 2024లో తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.ఇక్కడా కర్ణాటకపై ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 నోబాల్స్ వేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కానీ తన లోపాల నుంచి పాఠాలు నేర్చుకొని అతను ఎంతో మెరుగయ్యాడు. టి20ల్లో బౌలింగ్‌పై మరింత దృష్టి పెట్టిన అతనికి చెన్నై నెట్ బౌలర్‌గా అవకాశం లభించింది. ఆ తర్వాత కోల్‌కతా టీమ్‌లోకి తీసుకుంది. మ్యాచ్ ఆడలేకపోయినా... ఈ అనుభవాలు అతనికి తన ఆటను తీర్చిదిద్దుకునేందుకు పనికొచ్చాయి. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకిబ్ బౌలింగ్‌లో వైవిధ్యం కనిపించింది. ఆరంభంలో, డెత్‌లో కూడా పదునైన బంతులు వేయగల నైపుణ్యాన్ని అతను ప్రదర్శించాడు. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు సాకిబ్‌కు మంచి భవిష్యత్తు ఉండవచ్చు. -
షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే గ్రౌండ్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తే క్రమంలో స్పైక్ షూ ఉంటే మరింత బాగా పరిగెత్తగలవని ఎవరో చెబితే విన్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఎక్కడ క్రికెట్ టోర్నీ జరిగినా అక్కడ వాలిపోయేవాడు. ఎందుకంటే వాళ్లిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు స్పైక్ షూ కొనుగోలుకు ఉపయోగపడుతాయని ఆ కుర్రాడి ఆరాటం. అయితే తల్లికి విషయం తెలిసి తనకున్న నగలు అమ్మి స్పైక్ షూ కొని కొడుకు కోరిక తీర్చింది. ఇలా కష్టాల సుడిగుండాలను చిన్నతనంలోనే అనుభవించి, ఇవాళ వాటిని దాటుకొని ఐపీఎల్లో అవకాశం దక్కించుకొని రైజింగ్ స్టార్ అయ్యాడు సాకిబ్ హుస్సేన్.ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఎస్ఆర్హెచ్ బౌలర్ల ధాటికి 159 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ ఓటమికి ఇద్దరు బౌలర్లు ప్రధాన కారణంగా నిలిచారు. వారిలో ఒకరు ప్రఫుల్ హింగే అయితే.. రెండో వ్యక్తి సాకిబ్ హుస్సేన్. ఇద్దరికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం, ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీయడం విశేషం. అయితే ప్రఫుల్ హింగేతో పోలిస్తే ఎకానమీ పరంగా సాకిబ్ హుస్సేన్ ఒక మెట్టు పైనే ఉంటాడు. జైస్వాల్, ఆర్చర్, ఫెరీరా, బిష్ణోయ్ వికెట్లను ఖాతాలో వేసుకున్న సాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ప్రఫుల్ హింగే 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన ప్రఫుల్ హింగే గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకున్నారు. కానీ అతనితో సమానంగా సాకిబ్ హుస్సేన్ ప్రదర్శనను కూడా గుర్తించాల్సిన అవసరముంది.సైన్యంలో చేరాలనుకొని..బీహార్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్, సుబుక్తారా ఖతాన్ దంపతులకు సాకిబ్ హుస్పేన్ 2004లో జన్మించాడు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే సాకిబ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలని సాకిబ్ పరితపించేవాడు. సైన్యంలో చేరేందుకు సమీప గ్రౌండ్లో రన్నింగ్‌కు వెళ్లేవాడు. అప్పుడే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. రన్నింగ్ బాగా చేయాలంటే స్పైక్ షూ అవసరమని గుర్తించిన సాకిబ్ తన ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉండడంతో ఇంట్లోవాళ్లను అడగడం ఇష్టం లేక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేవాడు. వారిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు దాచుకునేవాడు. తల్లి నగలు అమ్మి..అయితే స్పైక్ షూ కొనడానికి డబ్బులు చాలా కావాలని భావించిన సాకిబ్ తన మనసులోని మాటను కన్నతల్లికి చెప్పడం, ఆ తల్లి తనకున్న కొద్దిపాటి నగలు అమ్మి కొడుకు కోరికను తీర్చింది. ఆ తర్వాత పూర్తిగా క్రికెట్‌పై దృష్టి సారించడంతో సాకిబ్ హుస్సేన్‌కు 17 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అవకాశం లభించింది. 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున రైట్ ఆర్మ్ పేసర్‌గా అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్‌లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి సాకిబ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇక 2025-26 రంజీ సీజన్లో బీహార్ తరఫున ఆడిన సాకిబ్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యచ్‌లో 41 పరుగులకే 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు తొలిసారి సాకిబ్ వేలంలోకి వచ్చినప్పటికీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో 140 ప్లస్‌కు తగ్గకుండా బౌలింగ్ వేస్తున్న విషయాన్ని గుర్తించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని వదిలిపెట్టింది. వరుణ్ ఆరోన్ దృష్టిలో పడి..అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనను తాను మరింత సాన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్‌లో కుర్రాళ్లు కావాలని వరుణ్ ఆరోన్ తన వేటను ప్రారంభించాడు. రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 6 వికెట్ల సంచలన ప్రదర్శన నమోదు చేసిన సాకిబ్ హుస్సేన్ వరుణ్ ఆరోన్‌ను ఆకర్షించాడు. అలా గతేడాది మినీ వేలంలో సాకిబ్ హుస్సేన్‌ను ఎస్ఆర్హెచ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు సాకిబ్ హుస్సేన్.Another debutant making his mark ✅🎥 Glimpses of Sakib Hussain’s 4/24 in his first outing in #TATAIPL 🔥Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @sunrisers pic.twitter.com/ByAMDOgJiB— IndianPremierLeague (@IPL) April 13, 2026A NIGHT FOR THE DEBUTANTS! 🤩Praful Hinge and Sakib Hussain giving #TATAIPL fans a game to remember 🤜🤛Watch Hussain's spell ▶️ https://t.co/pFEeR4dHxD#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/YBpnrflB7o— IndianPremierLeague (@IPL) April 13, 2026చదవండి: తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే!


