saffron dress
-
తిరువళ్లువర్ ‘కాషాయ’ కలకలం
చెన్నై: ప్రాచీన తమిళ మహాకవి, తత్వవేత్త తిరువళ్లువర్ చిత్రపటాన్ని కాషాయ వ్రస్తాల్లో చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. వైకాశి అనుషం వేడుకల సందర్భంగా మే 30వ తేదీన లోక్ భవన్లో కాషాయ వ్రస్తాల్లో ఉన్న తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నివాళులర్పించారు. దీనిపై అధికార తమిళగ వెట్రి కళగం, విపక్ష డీఎంకేసహా పలు పారీ్టలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అధికారికంగా గుర్తించిన తిరువళ్లువర్ చిత్రంలో ఆయన తెల్లని వస్త్రం ధరించి కనిపిస్తారు. దానికి బదులుగా లోక్‌భవన్‌లో నివాళులర్పించిన చిత్రాన్ని తిరువళ్లువర్ కాషాయ రంగు వస్త్రం ధరించినట్లు చిత్రీకరించడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అరుణ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. మహాకవిని కాషాయ వ్రస్తాలలో ప్రదర్శించడాన్ని ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తను ఒక సంకుచిత గుర్తింపులో బంధించే ఏ ప్రయత్నమైనా ఆయన విశ్వ దృష్టిని కించపరచడమేనని పేర్కొన్నారు. తిరువళ్లువర్ ఏ ఒక్క మతానికీ, కులానికీ, జాతికీ, దేశానికీ పరిమితమైన కవి కాదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ నిరంతరం మౌనంగా ఉండటం వల్లే గవర్నర్ కార్యాలయం తిరువళ్లువర్‌కు కాషాయ రంగు వేయడానికి సాహసించిందని డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. లోక్ భవన్‌ను కాషాయమయంగా మార్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరువళ్లువర్‌కు కాషాయ రంగు అద్దడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా తిరువళ్లువర్ దినోత్సవాన్ని జనవరిలో నిర్వహిస్తుందని గుర్తుచేశారు. మరి వైకాశి అనుషం రోజు నిర్వహించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. డీఎంకే పాలనలో అప్పటి గవర్నర్ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. ఇప్పుడు మరోసారి తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ చర్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులు ఖండించారు. -
యూపీ సీఎం కార్యాలయానికి కాషాయం రంగు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ నిత్యం కాషాయ దుస్తులు ధరిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కార్యాలయ భవనానికీ కాషాయ హంగులు అద్దనున్నారు. సీఎం కార్యాలయమున్న లాల్‌బహదూర్ శాస్త్రి భవన్‌కు కాషాయం పెయింట్ వేయాలని నిర్ణయించారు. ఆదిత్యనాథ్ కార్యాలయంలోని టవళ్లు, టేబుల్ కవర్లు కూడా కాషాయ రంగులోనే ఉంటాయి. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల కోసం పలు రంగుల్ని పరిశీలించినప్పటికీ కాషాయమే అత్యుత్తమంగా తేలిందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమర్నాథ్ అగర్వాల్ స్పందిస్తూ..‘ ఏ రంగు కూడా చెడ్డది కాదు. కానీ ప్రభుత్వ కార్యాలయాకు సైతం కాషాయం రంగు వేయడం మొత్తం పరిపాలనా వ్యవస్థను కాషాయీకరణం చేయడమే’ అని మండిపడ్డారు. ఇటీవల యోగి ఆవిష్కరించిన 50 బస్సులకు కూడా కాషాయం రంగు వేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ శిలాఫలకాలను కాషాయ వస్త్రాలతో అలంకరించడంతో పాటు బెలూన్లు కూడా కాషాయ రంగులోని వాటినే వాడారు. చివరికి రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు కాషాయ రంగులో ఉన్న బ్యాగులనే అందజేశారు. అంతేకాకుండా యోగి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా అందించిన బుక్లెట్లను, ప్రభుత్వం అందించిన సమాచార డైరీలను కూడా ఈ రంగుతోనే ముద్రించారు. -
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
-
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
తాను కాషాయ దుస్తులు వేసుకుంటాను కాబట్టి తనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అయితే తాను అన్ని వర్గాలకు చెందినవారి హృదయాలను గెలుచుకుంటానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇన్నాళ్లుగా లౌకికవాదం పేరుతో భారతీయ సంప్రదాయాలను అవమానిస్తున్న వాళ్లు తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత భయపడుతున్నారని చెప్పారు. తాను కాషాయం వేసుకుంటానని, దేశంలో చాలామందికి అసలు కాషాయం అంటే ఇష్టం లేదని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక 'ఆర్గనైజర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తన పనితీరుతో అన్ని వర్గాలను మెప్పిస్తానని, అందరికీ సంతోషం పంచుతానని చెప్పారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ఇంతకుముందులాగే సేవ చేయాలనే వచ్చానని యోగి చెప్పారు. దేశాన్ని కాపాడటమే తన ప్రభుత్వ ప్రధాన ధర్మమని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అవినీతి రహిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అందిస్తామని, సమాజం నుంచి గూండా రాజ్యాన్ని తరిమేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లోనే ప్రభావం స్పష్టం కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెస్తామని, ఏ పరిశ్రమలోనైనా ఇక నుంచి 90 శాతం మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్ వాళ్లే అయ్యేలా చూస్తామని చెప్పారు. చెరుకు రైతుల బకాయిలను 14 రోజుల్లోగా చెల్లిస్తామని, రాబోయే ఆరు నెలల్లో కొత్తగా ఐదారు చక్కెర కర్మాగారాలు నెలకొల్పుతామని అన్నారు.


