breaking news
safdargunj hospital
-
సోనమ్ వాంగ్చుక్కు బిగ్ రిలీఫ్?!
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వ్యక్తమవుతున్న ఆందోళనలను విస్మరించలేమని స్పష్టం చేసిన కోర్టు.. ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన విషయం ఆయన ప్రాణాలను కాపాడటమేనని పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం వాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి మెదాంత ఆసుపత్రికి తరలించే ప్రతిపాదనను పరిశీలించింది.విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షా విధానంలో మార్పులు కోరుతూ జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే తన అనుమతి లేకుండా ఆసుపత్రికి తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపై నమ్మకం లేదని ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను కుటుంబం కోరుకున్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విచారణ సందర్భంగా కోర్టు.. వాంగ్‌చుక్ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆందోళనలు, మెరుగైన వైద్య సదుపాయాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ సందర్భంగా హైకోర్టు.. “ఆయన ప్రాణాలను కాపాడటమే ప్రస్తుతం తొలి ప్రాధాన్యత” అని పేర్కొంది. నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని తెలిపింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించిన కోర్టు.. అందుతున్న చికిత్స వివరాలను కూడా కోరింది.వాంగ్‌చుక్ తన తరలింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తనను కలిసేందుకు పరిమితులు విధించారని, తన పరికరాలను తీసుకున్నారని, కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు.కాగా.. విద్యార్థుల సమస్యలు, పరీక్షా వ్యవస్థలో లోపాలు, విద్యా రంగ సంస్కరణల డిమాండ్లతో వాంగ్‌చుక్ జంతర్ మంతర్‌లో 20 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగించారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అయింది. దీంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.వాంగ్‌చుక్ ఆసుపత్రికి తరలింపు అంశం నేపథ్యంలో కాక్రోచ్ జంతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రభుత్వం వ్యవహరించిన తీరును పార్టీ నేతలు ప్రశ్నిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం వైద్యుల సూచనలు, భద్రతా కారణాల దృష్ట్యానే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం వాంగ్చుక్ను మెదాంత ఆసుపత్రికి తరలించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రం తరఫున న్యాయవాది కూడా మెదాంతకు తరలింపుపై అభ్యంతరం లేదని తెలిపినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా తరలింపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు జోక్యంతో వాంగ్‌చుక్ ఆరోగ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఒకవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి.. మరోవైపు ఆయన డిమాండ్లపై కొనసాగుతున్న ఆందోళనలు ఢిల్లీ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. -
ఆమరణ దీక్షను విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్
విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను విరమించేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సిద్ధమయ్యారు. ఆయన పిలుపు మేరకు మద్దతుదారులు, కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడికి సిద్ధమైన వేళ.. ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అయితే మూడు షరతులు నెరవేరిస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. జూన్ 28న ప్రారంభమైన వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష 23వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న దీక్షను పోలీసులు ఇటీవల తొలగించి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి చేతిరాతతో విడుదల చేసిన ఓ ప్రకటనలో వాంగ్‌చుక్.. దీక్ష ముగించేందుకు మూడు షరతులను వెల్లడించారు. విద్యా వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న వైఫల్యాలు, పేపర్ లీక్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇవ్వాలని కోరారు. అలాకాకుంటే తన ఆరోగ్య పరిస్థితి కారణంగా దీక్ష కొనసాగించడం సాధ్యం కాకపోతే.. ఎంపీలు, రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి ఇదే హామీ ఇస్తే తాను ఉపవాస దీక్షను విరమిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన కదలికలు, మాట్లాడే స్వేచ్ఛ, కమ్యూనికేషన్‌పై ఆంక్షలు ఉన్నాయని వాంగ్‌చుక్ ఆరోపించారు.Activist Sonam Wangchuk tweets, "... I will end my fast on 20th July if:a. If the govt takes accountability of the recent failures in Education system, Paper leaks etc orb. If I and the leadership of CJP reach the doorsteps of Parliament where MPs and leaders of various… pic.twitter.com/XBAgvbkvkw— ANI (@ANI) July 20, 2026భార్య ప్రకటనలో రెండే!ఇదే సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో కూడా ఆయన దీక్ష విరమణపై స్పందించారు. రాజకీయ నేతలు ఆయనను కలసి.. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై పార్లమెంట్లో చర్చకు హామీ ఇస్తే దీక్ష ముగిస్తారని ఆమె తెలిపారు.ఆమె వెల్లడించిన రెండు అంశాల్లో.. ఒకటి రాజకీయ నేతలు వాంగ్చుక్ను కలవడం, రెండోది విద్యా వ్యవస్థలో బాధ్యతపై పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇవ్వడం. అయితే ఆ తర్వాత వాంగ్‌చుక్ స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలను కలిపి మూడు షరతులుగా వివరించారు.ప్రైవేటు ఆసుపత్రికి తరలింపుపై కోర్టు నిరాకరణవాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతరంగా తరలించేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీర్ఘకాల ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య పర్యవేక్షణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, బలవంతపు చర్యలు జరుగుతున్నాయని ప్రాథమికంగా భావించలేమని పేర్కొంది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.నేడు ‘చలో సంసద్’.. ఢిల్లీలో భారీ భద్రతమరోవైపు వాంగ్‌చుక్ మద్దతుదారులు సోమవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న రోజే ఈ కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమతి లేకుండా ఎలాంటి మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ప్రాంతంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు చేశారు. జంతర్‌మంతర్, పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు.వైద్యుల పర్యవేక్షణలో వాంగ్చుక్దాదాపు మూడు వారాలుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్‌చుక్ 10 కేజీల బరువు కోల్పోయారు. బలహీనత, డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. రక్త పరీక్షలు, ఇతర ఆరోగ్య సూచికలను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నీట్ ప్రశ్నపత్రం లీక్ వంటి అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని వాంగ్‌చుక్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమణ ప్రకటన, ‘చలో సంసద్’ కార్యక్రమం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. -
ఆసుపత్రిలోకి నో ఎంట్రీ.. రోడ్డుపైనే మహిళ ప్రసవం.. వీడియో వైరల్!
న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ నడి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానవీయ సంఘటన దిల్లీలోని సఫ్దార్‌గంజ్ ఆసుపత్రి వద్ద మంగళవారం జరిగింది. రోడ్డుపై కొందరు మహిళలు చీరలు అడ్డుపట్టగా.. మహిళకు పురుడు పోసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ సంఘటనపై నివేదిక అందించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీనిపై ఆసుపత్రి సైతం దర్యాప్తు చేపట్టింది. ఆ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు పట్టుకుని గర్భిణీ చుట్టు నిలుచున్నారు. అక్కడ కొందరు నర్సులు సైతం ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఆసుపత్రికి రాగా చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించినట్లు బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. అత్యవసర విభాగం ఎదుటే రాత్రంత ఉన్నామని వాపోయారు. ఈ విషయంపై నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. देश की राजधानी दिल्ली के सफदरजंग अस्पताल में एक गर्भवती महिला ने सफदरजंग अस्पताल के बाहर एक नवजात शिशु को दिया जन्म इस दुर्व्यवहार को क्या कहे दिल्ली व केंद्र सरकार की लचारता कहे यह अस्पताल परिसर स्टाफ की प्रंशसा कहे ?@PMOIndia @ArvindKejriwal pic.twitter.com/smOyRs2KFZ — Ajay kanojiya Hindustani {INC} (@ajayaicc2022) July 19, 2022 గాజియాబాద్‌లోని ఖేరా ప్రాంతానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. ‘ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించటం వల్ల రోడ్డుపైనే పాపకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం శిశువును, మహిళను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఆసుపత్రికి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జులై 25లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదీ చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు -
పోలీసులు-రెడాల మధ్య ఉద్రిక్తత.. వైద్యసేవలు బంద్!
NEET PG Counselling Delay: నీట్ పీజీ అడ్మినిషన్ కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సోమవారం పోలీసులు రెసిడెంట్డాక్టర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పలువురు రెడాలు గాయపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉదయం నుంచీ అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీట్ విషయమై వాదనలు వింటున్న సుప్రీం కోర్టుకు రెడాలు ఎయిమ్స్ పక్కనే ఉన్న సఫ్దార్జంగ్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి మార్చ్ నిర్వహించబోతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు మూసేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక రెడాలపై పోలీసుల తీరును ఖండిస్తూ.. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోషియేషన్(FAIMA) డిసెంబర్ 29, ఉదయం 8గం. నుంచి దేశవ్యాప్తంగా అన్నీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి డిసెంబర్ 2020లో నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడుతూ వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నడుమే ఈ సెప్టెంబర్‌లో నీట్ పరీక్షను నిర్వహించింది ప్రభుత్వం. అయితే అడ్మిషన్ ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ తరుణంలోనే రెసిడెంట్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెడాలపై లాఠీఛార్జ్, అసభ్య పదజాల ప్రయోగం ఆరోపణలను పోలీసులు ఖండించారు. పైగా రెడాలే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. నిరసనకారుల్లో 12 మందిని అరెస్ట్ చేసి.. ఆపై రిలీజ్ చేసినట్లు ప్రకటించారు. సఫ్దార్జంగ్ ఆస్పత్రి నుంచి మార్చ్ నిర్వహించకుండా మాత్రమే అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో నిన్న ఉదయం నుంచే అత్యవసర సేవల్ని మినహాయించి.. అన్ని విభాగాలను రెసిడెంట్ డాక్టర్లు బహిష్కరించారు. కరోనా, ఒమిక్రాన్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు సైతం ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
మోదీ సొంత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్టమైన గుజరాత్లో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 347 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం తాజాగా మరో 92 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య జనవరి నుంచి ఇప్పటివరకు 5715 కు చేరిందని గుజరాత్ ఆరోగ్యశాఖ తెలిపింది. వారిలో ఇప్పటికి 4408 మందికి నయమైందని తెలిపింది. ఒక్క అహ్మదాబాద్ లోనే 1945 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వారిలో జనవరి నుంచి ఇప్పటివరకు 103 మంది మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో గుజరాత్ లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి చెందిన సఫ్దార్ గంజ్ హాస్తిటల్ కు చెందిన డాక్టర్ శివదాస్ చక్రవర్తి, ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ పవన్ తివారీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది.


