breaking news
sadaram
-
జోన్ల వారీగా ‘సదరం’ స్లాట్ బుకింగ్
సాక్షి, అమరావతి: ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2026లోని జోన్ల వారీగా సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరు జోన్లుగా సదరం స్లాట్స్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర కారణాలతో సొంత జిల్లాలకు దూరంగా ఉన్నవారు సైతం సులభంగా సదరం స్లాట్స్ పొందేలా గత ప్రభుత్వంలో రాష్ట్రం యూనిట్‌గా స్లాట్స్ జారీ ప్రక్రియను ప్రారంభించారు. సొంత జిల్లాల్లో స్లాట్ దక్కనివారు పక్క జిల్లాల్లో స్లాట్ పొందే వీలు కల్పించారు. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, జోన్ విధానంలో స్లాట్స్ విడుదల చేయనున్నారు. దీంతో ఉపాధి, ఉద్యోగం, ఇతర కారణాలతో సొంత జిల్లాలు వీడి దూర ప్రాంతాల్లో జీవనం సాగించే వారికి ఇక్కట్లు తప్పవు. ఉదాహరణకుఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి వేల మంది విజయవాడలో జీవనం సాగిస్తుంటారు. నూతన నిబంధనల ప్రకారం ఇలాంటి వారు తమ సొంత జిల్లా లేదా పక్క జిల్లాల్లో మాత్రమే సదరం స్క్రీనింగ్‌కు అర్హులు అవుతారు. విజయవాడలో స్లాట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యం కాదు. గతంలో ఏ జిల్లాలోని ఆస్పత్రుల్లో అయినా స్లాట్ పొంది, వైకల్య ధ్రువీకరణపత్రాలు పొందే వీలుండేది. ఇప్పు డా ప్రక్రియను రద్దు చేసి, ఆరు జోన్లుగా చంద్రబాబు ప్రభుత్వం సదరం స్లాట్స్‌ను విడుదల చేయనుంది. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని కూడా రద్దు చేసింది. దీంతో వివిధ ప్రాంతాలకు వలస వచ్చిన దివ్యాంగులకు తిప్పలు తప్పవు. 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ నెల 8న ప్రారంభం కానుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి 13 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు సదరం పోర్టల్‌లో మార్పులు కూడా చేశామని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. సమీప గ్రామ, వార్డు సచివాలయం లేదా ఏపీ సేవా పోర్టల్‌లో సిటిజన్ లాగిన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆరు జోన్లలోని జిల్లాలు ఇలా...జోన్–1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నంజోన్–2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజోన్–3: పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం జోన్–4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజోన్–5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడపజోన్–6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్ బుకింగ్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్లను ఇచ్చింది. -
బీఏసీ భేటీకి పిలిచి.. అవమానించారు
అసెంబ్లీ కార్యదర్శి సదారాంపై స్పీకర్‌కు సండ్ర ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో బీఏసీ సమావేశానికి తనను పిలిచి అవమానించారని, దీనికి బాధ్యులైన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఫిర్యాదుచేశారు. ఈ నెల 15న జరిగిన బీఏసీ సమావేశానికి హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం తనను అధికారికంగా ఆహ్వానించారని, అయితే హాజరైన తనను బడ్జెట్ సమావేశాలు మొత్తానికి సస్పెండైన కారణంగా బీఏసీ సమావేశానికి హాజరు కావొద్దని తిప్పి పంపించారని వివరించారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శిపై శాసనసభ రూల్ 168 ప్రకారం ప్రివిలేజ్ మోషన్ పెట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏడాదైనా అందని ధ్రువీకరణ పత్రం
ఒంగోలు సెంట్రల్: వికలాంగులకు వైకల్య శాతం ఎంత ఉందో ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసిన సదరమ్ నరకంగా మారింది. తిరగలేరని తెలిసినా మానవత్వం లేకుండా ఏళ్ల తరబడి తిప్పుతూనే ఉన్నారు. ఈ కష్టం జిల్లా అధికారులకు తెలిసినా చూసీచూడనట్టుగా ప్రవర్తిస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. సదరమ్ ప్రారంభ ం నుంచి నేటికీ ధ్రువీకరణ పత్రాలు అందని వికలాంగులు జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది ఉన్నారు. వీటిలో ఫొటోలు తప్పుగా ఉన్నవి 262 వరకూ ఉన్నాయి. మరో రెండు వందల వరకూ అప్పట్లో సదరమ్ క్యాంప్‌లలో పాల్గొన్న ఇద్దరు ఆర్ధోపెడిక్ వైద్యులు వికలాంగులపై కనికరించకపోవడంతో సంతకాలు కాలేదు. దీంతో వీరిని మరలా సదరమ్ క్యాంప్‌లో పరీక్షించుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. పేర్లు తప్పు పడినవి 400 వరకూ ఉన్నాయి. మిగిలినవి ఇతర కారణాలతో ఆగిపోయాయి. అయితే వీటిపై అధికారులు దృష్టి కేంద్రీకరించలేదు. మొదటి విడత సదరమ్ శిబిరానికి, రెండోదానికి మధ్య సంవత్సరం గడువున్నా దరఖాస్తులు మాత్రం అలాగే మగ్గిపోతున్నాయి. హామీ ఇలా: వికలాంగులను పరీక్షించే సమయంలో పది రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు నరకం ఎంపీడీఓల ద్వారా మీ మండలాల్లోనే అందజేస్తారని అధికారులు ఇచ్చిన హామీలు ఆచరణలో చతికిలపడ్డాయి. నెలలు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క పత్రం కూడా వికలాంగులకు అందలేదు. సదరం ఉద్దేశ్యమిదీ... వికలాంగులకు వైకల్యశాతం గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడ మే ముఖ్య ఉధ్దేశ్యంగా 2010 జూన్ 2న కోటీ ఏభై లక్షలతో సదరం కార్యాలయాన్ని ఒంగోలులో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వికలాంగులను పరీక్షించిన రోజే సాయంత్రంలోపు ద్రువీకరణ పత్రం అందించాలి. అయితే పరీక్షలు చేయించుకున్న వికలాంగులకు సంవత్సరాలు గడుస్తున్నా ధ్రుపత్రాలు మాత్రం అందడం లేదు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నమోదులో అనేక తప్పులు దొర్లుతున్నాయి. దీంతో వీటిని సరిచేయించుకోవడానికి వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సమస్యల వలయం సదరమ్ కార్యాలయంలో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు అటెండర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ వికలాంగులకు కనీసం సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఫొన్ చేస్తే ఎత్తి పక్కన పెట్టేస్తుంటారు. దీంతో జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా కష్టనష్టాలకు ఓర్చి ఒంగోలుకు వచ్చి పాత రిమ్స్‌లో ఉన్న సదరమ్ కార్యాలయానికి తిరుగుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ధ్రువీకరణ పత్రాలకు జత చేయాల్సిన అనుబంధ పత్రాలు ఒకేసారి చెప్పకపోవడంతో నరకం చవిచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఓ వికలాంగురాలు తన ఇక్కట్లను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి పీఏ సదరమ్ కార్యాలయానికి ఫొన్ చేస్తే సిబ్బందిలో చలనం కలిగి రెండు సంవత్సరాల నుంచి వారి వద్ద మగ్గుతున్న ధ్రువీకరణ పత్రానికి మోక్షం కలిగింది. వసతుల లేమి సదరమ్ తాత్కాలిక శిబిరాన్ని రిమ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పరీక్షల కోసం రోజుకు 500 మందికిపైగా వికలాంగులు జిల్లా నలుమూలల నుంచి వస్తున్నారు. అధికారులు వీరి కోసం ఏర్పాట్లు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. కేవలం ఒకే టెంట్ మాత్రమే వేశారు. దీంతో ఎక్కువ మంది వికలాంగులు ఎండలోనే ఉండాల్సి వస్తోంది. వికలాంగులకు సహాయం చేసేందుకు ఎవరినీ నియమించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ చిన్నారిని చూసైనా కనికరం లేదాయే.. చిలకల రాజేష్ (6). ముండ్లమూరుకు చెందిన చిలకల రాజేష్ అనే బాలుడు పుట్టినప్పటి నుంచి కేవలం రెండున్నర అడుగులు మాత్రమే పొడవు పెరిగాడు. ఈయన తలలోకి నీరు చేరడంతో ఎదుగుదల లేదని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు వెల్లడించారు. అయితే ధ్రువీకరణ పత్రం కోసం ఇప్పటికి నాలుగు సార్లు రిమ్స్‌కు వచ్చినా పని కాలేదని, వచ్చినప్పుడంతా రూ. 500లు ఖర్చు అవుతుందని బిడ్డ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ చిన్నారిని చూసైనా కనికరం లేదాయే పాలకు వక్కయ్య పాలకు వక్కయ్యకు కరెంటు షాక్‌తో రెండు కాళ్లు, చేతులు తీవ్రంగా గాయాలయ్యాయి. పని చేయలేని స్దితిలో ఉన్నాడు. వికలాంగ ధ్రువీకరణ పత్రం ఉంటే పెన్షన్ వస్తుందనే ఆశతో గత సంవత్సరం దర్శిలో జరిగిన క్యాంప్‌లో పాల్గొని పరీక్షించుకున్నా పత్రం రాలేదు. మళ్లీ ఇప్పుడు రిమ్స్‌కు వచ్చినా అదే దుస్థితి నెలకుంది.


