
బీఏసీ భేటీకి పిలిచి.. అవమానించారు
శాసనసభలో బీఏసీ సమావేశానికి తనను పిలిచి అవమానించారని, దీనికి బాధ్యులైన
అసెంబ్లీ కార్యదర్శి సదారాంపై స్పీకర్‌కు సండ్ర ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో బీఏసీ సమావేశానికి తనను పిలిచి అవమానించారని, దీనికి బాధ్యులైన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఫిర్యాదుచేశారు.
ఈ నెల 15న జరిగిన బీఏసీ సమావేశానికి హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం తనను అధికారికంగా ఆహ్వానించారని, అయితే హాజరైన తనను బడ్జెట్ సమావేశాలు మొత్తానికి సస్పెండైన కారణంగా బీఏసీ సమావేశానికి హాజరు కావొద్దని తిప్పి పంపించారని వివరించారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శిపై శాసనసభ రూల్ 168 ప్రకారం ప్రివిలేజ్ మోషన్ పెట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు.