breaking news
Russian government
-
పుతిన్‌పై పోరాటమే..
మాస్కో: రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్‌పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా ప్రతిజ్ఞ చేశారు. సోమవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పలువురు ఈయూ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. భర్త నవాల్నీ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌ను, ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. నవాల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని, సాక్ష్యాలు దొరక్కుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. -
'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్
పాప్ గాయని మడోన్నాకు రష్యా ప్రభుత్వం 10 లక్షల రూపాయల జరిమానా వేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూలకు మద్దతు తెలుపుతూ మాట్లాడినందుకు ప్రభుత్వం 1 మిలియన్ డాలర్ల జరిమానా విధించిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె 2012లో రష్యా టూర్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూల హక్కుల కోసం మాట్లాడారు. వారికి అందరితోపాటు సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించాలని గొంతెత్తి నినదించారు. ఆమె ఉపన్యాసానికి అభిమానుల చప్పట్లతో, ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే రష్యా ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడుపడనట్లుంది. ఫలితంగా ఆమెకు పది లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ రుసుమును కాస్త తగ్గించిందని మడోన్నా తెలిపారు. కానీ తాను మాత్రం ఇప్పటివరకు పైసా కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. తాజాగా ఆనాటి చేదు సంఘటనను అభిమానులతో పంచుకోవడంతోపాటు, "గే"లకోసం మాట్లాడిన వీడియోను సైతం గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) View this post on Instagram 8 years ago. I was fined 1 million dollars by The government for supporting the Gay community. I never paid.................... #freedomofspeech #powertothepeople #mdna A post shared by Madonna (@madonna) on Jul 19, 2020 at 7:42pm PDT -
భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ షాక్
-
భారతీయులకు ట్రంప్ షాక్
- అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను అనుమతించబోమని ప్రకటన వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డాలర్ డ్రీమ్స్‌లో తేలియాడే భారతీయులకు షాక్ ఇచ్చారు. అమెరికన్లను కాదని విదేశీ కార్మికులతో ఉద్యోగాల భర్తీని అంగీకరించబోమని ప్రకటించారు. ఇందుకోసం భారతీయులు ఎక్కువగా వినియోగించే హెచ్1బీ వీసాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడం గమనార్హం. డిస్నీ వరల్డ్ మొదలైన అమెరికా కంపెనీలు అమెరికా కార్మికులను కాదని భారత్ తదితర దేశాల నుంచి వచ్చే హెచ్1బీ వీసా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని అనుమతించేది లేదని చెప్పారు. గురువారం అయోవాలో తన మద్దతుదారులతో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రతి అమెరికన్ జీవితానికీ రక్షణ కల్పించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తాను ఎక్కువగా అమెరికా కార్మికులతో గడిపానని, శిక్షణ కోసం తప్పించి.. వారి స్థానంలో విదేశీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగనీయబోమని చెప్పారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించి తీరుతామని చెప్పారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇది తప్పదన్నారు. ట్రంప్ గెలుపు వెనుక రష్యా హస్తం! అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నిర్ధారించినట్లు మీడియా వెల్లడించింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలుపుకోసం రష్యా ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనాన్ని ప్రచురించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం హిల్లరీ ప్రతిష్టను మసకబార్చి ట్రంప్ అవకాశాల్ని మెరుగుపరచేందుకు రష్యా ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు పనిచేశారని, వీరు హిల్లరీ ప్రచారకమిటీ చైర్మన్‌తో సహా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనేకమంది మెయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వీకీలిక్స్కు అందజేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయంది.