భారతీయులకు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌ | Trump shock to the Indians | Sakshi
Sakshi News home page

Dec 11 2016 6:44 AM | Updated on Mar 20 2024 3:43 PM

అమెరికా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ డాలర్‌ డ్రీమ్స్‌లో తేలియాడే భారతీయులకు షాక్‌ ఇచ్చారు. అమెరికన్లను కాదని విదేశీ కార్మికులతో ఉద్యోగాల భర్తీని అంగీకరించబోమని ప్రకటించారు. ఇందుకోసం భారతీయులు ఎక్కువగా వినియోగించే హెచ్‌1బీ వీసాల అంశాన్ని ట్రంప్‌ ప్రస్తావించడం గమనార్హం. డిస్నీ వరల్డ్‌ మొదలైన అమెరికా కంపెనీలు అమెరికా కార్మికులను కాదని భారత్‌ తదితర దేశాల నుంచి వచ్చే హెచ్‌1బీ వీసా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని అనుమతించేది లేదని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement