ప్రమాదాల నివారణకు చర్యలు
ఏలూరు (మెట్రో) : జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న లింకు రోడ్లకు తప్పనిసరిగా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో రవాణా, ఆర్అండ్బీ, పోలీస్, రెవెన్యూ శాఖాధికారులతో కలెక్టర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ సమీక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ గ్రామాల నుంచి జాతీయ రహదారికి కలిసే రోడ్లకు ముందుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించేందుకు మార్గదర్శక నిబంధనలు అమలు చేయాలని చెప్పారు.