breaking news
repeatedly beat
-
మళ్లీ మళ్లీ వస్తున్నాయి
నా వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మళ్లీ మళ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. డాక్టర్ మందులు ఇస్తే తగ్గుతుంది. కాని, కొంతకాలానికి మళ్లీ వస్తుంది. ఈ మధ్య దగ్గు వచ్చినప్పుడు లేదా బలంగా నవ్వినప్పుడు మూత్రం లీక్ అవుతున్నట్టు అనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి? సరైన పరీక్షలు, చికిత్స ఏమిటో చెప్పండి.– రాధ, అనంతపురం. మీకు తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, ప్రతిసారి ఒకే రకమైన మందులు వాడితే శరీరానికి అవి అలవాటు పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో మందులు తక్కువగా పనిచేయడం, ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సారి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తోంది అనే కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగడం, మలబద్ధకం, దగ్గు ఎక్కువగా ఉండడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం ఇవన్నీ సమస్యను పెంచుతాయి. రోజూ సరిపడా నీరు తాగాలి. మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. మసాలా, కారం ఎక్కువగా ఉన్న ఆహారం, చల్లని పానీయాలు, టీ, కాఫీ తగ్గించాలి. మలబద్ధకం, దగ్గు ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోవాలి.దగ్గు లేదా నవ్వినప్పుడు మూత్రం లీక్ అవడం అనేది మూత్రాశయ కండరాల బలహీనత వల్ల కావచ్చు. దీనివల్ల మూత్రాశయం, మూత్రనాళం సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ద్వారా మూత్రాశయంలో ఒత్తిడి ఎలా ఉంది, కండరాల పని తీరు ఎలా ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షను సాధారణంగా బయట చికిత్స విభాగంలోనే చేస్తారు. పెద్ద నొప్పి ఉండదు, అవసరమైతే మత్తు మందుతో చేస్తారు. అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. అయితే, ఈ పరీక్ష చేయడానికి ముందు ప్రస్తుతం ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా దానికి మందులు ఇవ్వాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా కండరాల వ్యాయామాలు, మందులు లేదా ఇతర చికిత్స అవసరమా అనే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, మూత్రం లీక్ అవుతోంది అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలా చేస్తే సమస్యకు సరైన చికిత్స తీసుకుని, సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు.నా వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు. గర్భసంచి గడ్డల కారణంగా గర్భసంచి తీసివేయాలని డాక్టరు చెప్పారు. కాని, అండాశయాలను మాత్రం తీసివేయొద్దు అని అంటున్నారు. అండాశయాలు తీసివేస్తే బరువు పెరుగుతుందని కూడా చెప్పారు. ఇందులో సరైన నిర్ణయం ఏంటి?– లలిత, శ్రీకాకుళం. గర్భసంచి గడ్డల వల్ల శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు అండాశయాలను తీసివేయాలా లేక ఉంచాలా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి మహిళలో ఒకేలా ఉండదు. మీ వయస్సు, సమస్య స్వభావం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర, స్కాన్ నివేదికలు ఇవన్నీ చూసి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడు, లేదా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా అండాశయాలను కూడా తీసివేయాలని సూచిస్తారు. అలా చేస్తే భవిష్యత్తులో మళ్లీ ఆపరేషన్ అవసరం లేకుండా ఉంటుంది. కానీ క్యాన్సర్ ప్రమాదం లేని పరిస్థితుల్లో, అండాశయాలను ఉంచితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అండాశయాలు ఉంచితే శరీరంలో సహజ హార్మోన్లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. దీని వల్ల ఒక్కసారిగా వేడి దడలు, ఎక్కువ చెమటలు, మూడ్ మార్పులు, డిప్రెషన్ , జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా కొంతవరకు తగ్గుతుంది. అండాశయాలు తీసివేస్తే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే లక్షణాలు ముందుగానే వస్తాయి. వేడి దడలు, నిద్రలేమి, తలనొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకలు పలుచబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో బరువు పెరగడం కూడా జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా జరుగుతుందనే కాదు. కొన్ని ఎంపిక చేసిన పరిస్థితుల్లో హార్మోన్ ప్రత్యామ్నాయ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు. మాత్రలు లేదా ప్యాచ్‌ల రూపంలో ఈ చికిత్స ఇస్తారు. అయితే ఇది అందరికీ సరిపోదు. వైద్యుడు పూర్తిగా పరిశీలించిన తర్వాతే సూచిస్తారు. కొన్ని అరుదైన సందర్భాల్లో అండాశయాలు ఉంచినా, తరువాత పొత్తికడుపు నొప్పి లేదా ఇతర సమస్యల వల్ల మళ్లీ శస్త్రచికిత్స అవసరం రావచ్చు. అలాగే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు అండాశయాలు ఉంచడం వల్ల నొప్పి కొనసాగవచ్చు. కాబట్టి గర్భసంచి శస్త్రచికిత్స సమయంలో అండాశయాలు తీసివేయాలా వద్దా అన్న నిర్ణయం మీ వైద్యునితో పూర్తిగా చర్చించి తీసుకోవాలి. మీకు ఉన్న సమస్య, భవిష్యత్తు ప్రమాదాలు, లాభనష్టాలు అన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకుంటేనే దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది. -
Lok sabha elections 2024: మళ్లీ ఇందిర
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్‌లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు... ‘జనతా’ బలహీనత ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్‌ని చరణ్ సింగ్ (లోక్‌దళ్), బాబూ జగ్జీవన్‌రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే. ఆనియన్ ఎలక్షన్ హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం! కాంగ్రెస్‌లో మరో చీలిక 1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర! విశేషాలు... ఇందిర దారుణహత్య ► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది. ► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. ► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ► బింద్రన్‌వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు. ఏడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పార్టీ స్థానాలు కాంగ్రెస్ 353 జనతా (ఎస్) 43 సీపీఎం 39 జనతా పార్టీ 31 డీఎంకే 16 కాంగ్రెస్(యూ) 13 సీపీఐ 10 ఇతరులు 28 స్వతంత్రులు 9 – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
-
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. దొంగగా అనుమానించి ఓ యువకుడిని గొడ్డునిబాదినట్లు బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఫలితంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేయడంతోపాటు మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి ఓ యువకుడిని ఎత్వాహ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణ గదికి తీసుకెళ్లి టేబుల్ పై పడుకోబెట్టి ఆ యువకుడి తలను కదలకుండా ఓ పోలీసు మొకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చుని ఉంచగా.. మరోపోలీసు అతడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఓ దండనాయకుడి మాదిరిగా సివిల్ డ్రస్ లోఉండి బారెడు పొట్ట వేసుకున్న ఓ పోలీసు వచ్చాడు. చేతిలో బ్యాటులాంటిదానిని తీసుకున్నాడు. దానికి ఒక మందమైన రబ్బరు కూడా ఉంది. ఇక ఆ కుర్రాడు లబోదిబోమంటు కేకలు వేస్తున్నా దెబ్బమీదదెబ్బలతో ఫటాఫటా వాయించారు. ఆ వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనడం మాత్రం ఖాయం.


