breaking news
registered voting
-
లవర్స్ పార్టీ.. ట్వంటీ–ట్వంటీ
సాక్షి, హైదరాబాద్: అవును! మీరు చదివేది నిజమే. ట్వంటీ–20 క్రికెట్ మ్యాచ్ కాదు.. ట్వంటీ–ట్వంటీ.. కచ్చితంగా రాజకీయ పార్టీయే. ఇదే కాదు.. ఇంకా యూత్ ఇండియా టాంగ్రెస్ పార్టీ, ఇండియా లవర్స్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, జాగ్తే రహో పార్టీ, విధాయక్ పార్టీ, విదర్భ్ మజా పార్టీ, సూపర్ నేషన్ పార్టీ, వోటర్స్ పార్టీ, వాజిద్ అధికారి పార్టీ, భరోసా పార్టీ, సబ్సే బడే (అన్నింటికన్నా పెద్ద) పార్టీ, రాష్ట్రీయ సాఫ్నీతి పార్టీ.. ఇలాంటి చిత్ర విచిత్రమైన పేర్లతో ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ చేయించుకున్న రాజకీయ పార్టీల జాబితాలో మొత్తంగా 2,301 పేర్లు ఉన్నాయి. గుర్తులుండవ్.. కేరళలో రిజిస్టర్ అయిన ట్వంటీ–20 పార్టీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 20–20) నుంచి స్ఫూర్తి పొంది ఆ పేరు పెట్టుకున్నట్టు ఉంది. అలాగే ప్రేమను నిలబెట్టుకోవడం కోసం సమాజానికి ఎదురొడ్డి, ప్రేమికులు చేసే పోరాటంలో వారికి అండగా నిలిచే లక్ష్యంతో పనిచేస్తోన్న బీ కుమార్ శ్రీశ్రీ తన రాజకీయ పార్టీని ఇండియన్ లవర్స్ పార్టీ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. జాగ్తే రహో (జాగృతం కండి) పార్టీ పౌరులంతా జాగృతం కావాలనీ, నిరంతరం జాగ్రత్తతో వ్యవహరిస్తూ, పరస్పరం మేల్కొల్పుతూ ఉండాలని దీనర్థం. ఒక పార్టీలో మతం, వ్యక్తి, పార్టీ, దేశం అన్నీ వచ్చేలా ద రెలిజియన్ ఆఫ్ మాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియాగా మరో విచిత్రమైన పేరుతో ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. బిహార్‌లోని సీతామర్హిలోని బహుజన్ ఆజాద్ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన సమూహిత్ ఏక్తా పార్టీ, రాజస్థాన్‌కి చెందిన జైపూర్‌లోని రాష్ట్రీయ సాఫ్నీతీ పార్టీ, ఢిల్లీలోని సబ్సే బడా పార్టీ, తెలంగాణలోని భరోసా పార్టీ, తమిళనాడు కోయంబత్తూర్‌లో న్యూ జనరేషన్ పీపుల్స్ పార్టీ, పూర్మాన్స్ పార్టీ, యువర్స్–మైన్ పార్టీ, మై హీ భారత్ పార్టీ, వోటర్స్ పార్టీ, విధాయక్ పార్టీ, విదర్భ మజా పార్టీ, యూత్ ఇండియా టాంగ్రెస్ పార్టీ, వాజిబ్ అధికార్ పార్టీ అలాగే టమిజ్దార్ పార్టీ, టోలా లాంటి విచిత్రమైన పేర్లతో మొత్తం 149 పార్టీలు ఎన్నికల కమిషన్‌లో పేరు రిజిస్టర్ చేయించుకున్నాయి. -
జిల్లాలో 81.9శాతం పోలింగ్ నమోదు
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 81.9 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అత్యధికంగా 88.93 శాతం, తాడికొండలో 88.87 శాతం, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 64.99 శాతం, గుంటూరు తూర్పులో 68.17 శాతం నమోదైనట్టు తెలిపారు. 36,46,011 మంది ఓటర్లకుగానూ 29,85,871 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 2009 ఎన్నికలలో 77.6 శాతం నమోదైనట్లు చెప్పారు. దాదాపు 5శాతం పెరగడం మంచి పరిణామమన్నారు. ఓట్లలెక్కింపునకు 1,200 మందిని నియమిస్తున్నామని తెలిపారు. 16న కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 15న సాయంత్రం 5గంటలులోగా పోస్టల్ బ్యాలెట్లు అందాలని చెప్పారు. ఎన్నికల విధులలో ఆకస్మికంగా మరణించిన కెవికె కిషోర్, మహబూబ్‌నగర్‌కు చెందిన హోంగార్డు వైకుంఠం కుటుంబసభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో జెసి వివేక్‌యాదవ్, డిఆర్వో కె.నాగబాబు తదితరులు పాల్గొన్నారు.


