breaking news
Ratna Pathak Shah
-
వయసులో తన కంటే పెద్దదైన మహిళను పెళ్లాడిన నటుడు!
ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ తన కంటే వయసులో పెద్దదైన సానియా చందోక్‌ను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయంలో తండ్రి బాటలో పయనిస్తున్నాడు. సచిన్ కూడా తన కంటే వయసులో పెద్ద అయిన అంజలిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా మంది ప్రముఖులు ఇదే విధంగా పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 56 ఏళ్ల క్రితం ఓ నటుడు తన కంటే వయసులో 15 ఏళ్లు పెద్దదైన మహిళను పెళ్లాడాడంటే నమ్మగలరా? ఆ నటుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే మీకు బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా మొదటి వివాహం గురించి చెప్పాల్సిందే!ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) భార్య రత్న పాఠక్ అని చాలా మందికి తెలుసు. కానీ ఆయన మొదటి భార్య పర్వీన్ మురాద్ గురించి ఎక్కువ మందికి తెలియదు. నటుడిగా నిలదొక్కుకోకముందే ఆయన పెళ్లయిపోయి, విడాకులు కూడా తీసేసుకున్నారు. మొదటి భార్యకు భరణం చెల్లించడానికే 12 ఏళ్ల పాటు కష్టాలు పడ్డారట షా.బాలీవుడ్ షాదీస్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. నసీరుద్దీన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు పర్వీన్‌ను మొదటిసారి కలిశారు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లు. 34 ఏళ్ల పర్వీన్ అప్పటికే భర్త నుంచి విడాకులు తీసుకుని తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. విద్యార్థిగా ఉన్న షా.. 1969లో సంప్రదాయబద్దంగా పర్వీన్‌ను పెళ్లిచేసుకున్నాడు. సంవత్సరం లోపు వీరికి కూతురు పుట్టింది. ఆమెకు హీబా అని పెట్టుకున్నారు. తర్వాత వీరి వివాహ బంధానికి బీటలు వారాయి.విడాకుల కష్టాలుపర్వీన్ను షా పెళ్లిచేసుకోవడం మొదటి నుంచి నసీరుద్దీన్ కుటుంబానికి ఇష్టం లేదు. విడాకులు తీసుకుని పిల్లలు ఉండడం, వయసులో ఎక్కువ వ్యత్యాసం కారణంగా వీరి వివాహాన్ని ఆమోదించలేదు. ఫలితంగా షా, పర్వీన్ కాపురంలో కలతలు రేగాయి. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు ఇవ్వడానికి పర్వీన్ కుటుంబం భారీగా భరణం చేయడంతో షా ఒప్పుకున్నారు. నటన కొనసాగిస్తూనే భార్యకు భరణం చెల్లించారు. మసూమ్ చిత్రంతో బ్రేక్ రావడంతో తన మాజీ భార్యకు పూర్తిగా భరణం చెల్లించేశారని, దీనికి దాదాపు 12 సంవత్సరాలు పట్టిందని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి.రత్న పాఠక్‌తో రెండో పెళ్లి1975లో థియేటర్లో పనిచేస్తున్న సమయంలో నసీరుద్దీన్ షాకు రత్న పాఠక్ (Ratna Pathak) పరిచయం అయ్యారు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికింకా చట్టబద్దంగా షా మొదటి వివాహం రద్దు కాలేదు. రత్న పాఠక్‌ను పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆమెతో సహజీవనం సాగించారు. దాదాపు ఏడేళ్ల పాటు వీరి లివింగ్ రిలేషన్షిప్ కొనసాగింది. 1982లో వీరిద్దరు వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఇమాద్ షా, వివాన్ షా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ వివాహబంధానికి 40 దశాబ్దాలు పూర్తైనా షా, పాఠక్ తమ నటనా జీవితాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.చదవండి: హీరో నాని ఎంత మందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా?దిగ్గజ నటుడుఉత్తరప్రదేశ్లోని బారబాంకీ పట్టణానికి చెందిన నసీరుద్దీన్ షా.. చదువు పూర్తైన తర్వాత నటనలోకి అడుగుపెట్టారు. రాజేంద్ర కుమార్, సైరా బాను నటించిన అమన్ (1967) సినిమాతో తెరంగ్రేటం చేశారు. నిషాంత్, జునూన్, స్పర్శ్, ఆక్రోస్, మసూమ్, మిర్చ్ మసాలా, త్రికాల్, అర్థ్ సత్య, హమ్ పాంచ్ తదితర సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగానూ ఆయన రాణించారు. ఉత్తమ నటుడిగా మూడు సార్లు జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. -
రంగు మానేశాక స్వేచ్ఛ లభించింది.. ! నటి రత్నా పాఠక్ మనోగతం..
వెండి తెర నటీమణులు తమ వయసును దాచుకోవాలి. వయసును దాచాలంటే జుట్టుకు రంగు వేయాల్సిందే. అయితే బహుశా దేశంలో జుట్టుకు రంగు వేయడం మానేసిన తొలినటి రత్నా పాఠక్. స్త్రీ ఏ రంగంలోనైనా రాణించాలంటే రూపం కంటే కూడా ప్రతిభ, శరీరానికి ఇచ్చే తర్ఫీదు, దృష్టి ముఖ్యమని అంటారామె. రంగు వేయడం మానేశాక అవకాశాలు తగ్గినా వయసును యాక్సెప్ట్ చేయడంలో స్థిమితం ఉందంటున్నారామె. తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...‘నేను నటిగా కెరీర్ మొదలైన రోజుల్లో స్త్రీలకు వయసు ఉన్నంత కాలమే పాత్రలు ఉంటాయి. తర్వాత వారు తెరమరుగు అవడమే అనుకునేదాన్ని. కాని నన్ను నటిగా కలకాలం నిలబెట్టేది నా నటనా నైపుణ్యమే తప్ప రూపం, వయసు కావు అని అర్థం కావడానికి చాలా కాలం పట్టింది’ అంటారు రత్న పాఠక్.బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ తెలిసిన దీనా పాఠక్ కుమార్తె రత్న పాఠక్ టీవీ, సినిమా రంగంలో పని చేస్తున్నారు. ఆమె నటించిన ‘సారాభాయ్ వెర్సస్ సారాబాయ్’ టీవీ సీరియల్ విశేష ఆదరణ పొందింది. ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’. ‘థప్పడ్’,‘ధక్ధక్’ సినిమా ల్లో ఆమె నటన అందరికీ గుర్తుంటుంది. సుప్రియ పాఠక్, రత్న పాఠక్ అక్కచెల్లెళ్లు. నసీరుద్దిన్ షాను వివాహం చేసుకున్న రత్నపాఠక్ విలక్షణమైన పాత్రలతో దేశ విదేశాల్లో అవార్డులెన్నో పొందారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, స్త్రీల గురించి మాట్లాడారు.ఆడపిల్లలే: ‘మా అమ్మ దీనా పాఠక్‌కు మేము ఇద్దరమే ఆడపిల్లలం. మా నానమ్మ మా ఇద్దరినీ చూసి– పాఠక్ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే మగ నలుసే లేదే అని నెత్తి కొట్టుకునేది. అయితే నేను, సుప్రియా నటనా రంగంలో రాణించి పాఠక్ వంశ ఘనతను కాపాడాం. మా అమ్మ, నాన్న ఫలానాది చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆడపిల్ల అనే కారణాన అడ్డుకోలేదు. చదువులో, కెరీర్లో ఎంత దూరం వెళ్లగలిగితే అంత దూరం వెళ్లనిచ్చారు. చిన్నప్పటి నుంచి మాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. మా నాన్న ఢిల్లీ నుంచి కార్లు తెచ్చి ముంబై లో అమ్మేవారు. ఆయన కార్ల కోసం బయలుదేరినప్పుడల్లా మేము కూడా వెళ్లేవాళ్లం. ఆ ప్రయాణాలు కూడా మాకు మంచి చదువును ఇచ్చాయి’ అంటారామె. నటన అంటే: ‘నటనలో నాకు గురువు మా అమ్మ. అయితే ఆమె ప్రతిభకు తగ్గ పాత్రలు రాలేదనే అనుకుంటాను. నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో మూడేళ్లు నటన నేర్చుకున్నాను. ఒక నటికి కావాల్సింది మనసును, మెదడును డైలాగ్కెలా సిద్ధం చేయాలో తెలియడమే. మంచి రూపం బోనస్ కావచ్చు కాని అదే నటనకు అర్హత కాదు. మంచి నటి తన శరీరాన్ని కూడా ఎక్స్‌ప్రెసివ్‌గా మారుస్తుంది. ఆంగికాభినయం ముఖ్యం. నటి అందంగా కంటే దృఢంగా ఉండాలి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను శరీరాన్ని మరింత దృఢంగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యం చేశానని. నటులకు ఈ నిర్లక్ష్యం పనికి రాదు’. అని చెప్పారు రత్నా పాఠక్.జుట్టుకు రంగు మానేశాక: ‘నటీమణులు తెల్లజుట్టులో కనిపించడానికి ఇష్టపడరు. నేనూ ఇష్టపడను. కాని తలకు రంగు వేయడం అనేది ఒక ప్రహసనం. రంగు వేసి వేసి శారీరక ధర్మాల నుంచి ఎంతకాలం దూరం వెళ్లగలం అనిపించింది. నసీరుద్దీన్ షా కూడా రంగు మానేసి చూడు... నిన్ను నీలా యాక్సప్ట్ చెయ్ హాయిగా ఉంటుంది అని ప్రోత్సహించాడు. రంగు మానేశాను. తెల్లటి జుట్టుతో కనిపిస్తుంటే ముందు మార్కెట్ పోతుంది... నాక్కూడా పోయింది. ఎందుకంటే నాతో నటించే నా వయసు మగ నటులు కూడా రంగు వేసుకుంటున్నారు. అయినా సరే నాకొచ్చే పాత్రలు నాకొచ్చాయి. నేను రంగు నుంచి స్వేచ్ఛ పొందాను. మనకు ప్రతిభ ఉంటే రూపం అడ్డు నిలవదు. ఆధునికత అంటే ఎదుటివారిని ఎలా చూస్తున్నావు, ఎలా అర్థం చేసుకుంటున్నావు అనే సంస్కారం పెరగడమే. అలాగే ఈ కాలపు కుర్రకారు మాటలు అప్పుడప్పుడు చెవిన పడుతుంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి మాటలో బూతులు మాట్లాడుతున్నారు. ఇది ఆధునికత అయితే నాకు గతకాలమే మేలు అనిపిస్తుంది. కాసింత మర్యాద, గౌరవం, పద్ధతీ పాడూ వద్దా ఈ కాలం పిల్లలకు?’ అని ముగించారామె.(చదవండి: స్టుపిడ్ కాదు సూపర్ కపుల్! ఆ జంట లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..) -
అసహ్యించుకుంటూనే....చివరికి నటినయ్యా..!
రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్‌షా స్పష్టం చేశారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్ ఆర్ట్స్ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు. డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ పునరుద్ధరణే లక్ష్యం.. చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్‌ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్‌గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో -
అక్కను రౌడీలా వేధించా.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది
ఎంత గొడవపడ్డా సరే అక్కాచెల్లెళ్లు వెంటనే కలిసిపోతారు. అయితే వారి మధ్య పోట్లాటలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఒకరు హైపర్ అయిపోతే మరొకరేమో అన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి రత్న పాఠక్ షా మొదటి రకం. తన సోదరిని ఎమోషనల్‌గా టార్చర్ పెట్టిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది.రౌడీలా ప్రవర్తించా'సుప్రియ అక్క, నేను చిన్నగా ఉన్నప్పుడు తెగ పోట్లాడుకునేవాళ్లం. తనకు నేను మంచి చెల్లినైతే కాదు. ఒక రౌడీలా ప్రవర్తించేదాన్ని. ఏది పడితే అది అనేసి బాధపెట్టేదాన్ని. అది గుర్తు చేసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. తన మనసును బాధపెట్టినందుకు ఆమెకు సారీ చెప్పాను. తను నన్ను క్షమించిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాం' అని తెలిపింది.అందంగా లేనేమోననిసినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నేనంత అందంగా లేనేమోనని భయపడేదాన్ని. నా పళ్లు, పెదాలు బాగోవని.. అలాగే నా కళ్లు కూడా అంత పెద్దవి కావని ఫీలయ్యేదాన్ని. కానీ సుప్రితకు అందమైన కళ్లుండేవి. అలా అని తను నాకన్నా అందంగా ఉందని నేనేమీ ఈర్ష్య పడేదాన్ని కాదు. నా ప్రవర్తన, క్రమశిక్షణ, టాలెంట్‌పై ఫోకస్ పెట్టేదాన్ని' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్ 2023లో వచ్చిన ధక్ ధక్ అనే సినిమాలో చివరిసారిగా నటించింది. సుప్రియ పాఠక్.. సత్యప్రేమ్కీ కథ చిత్రంలో మెరిసింది.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా -
నా భర్తకు ఎంతోమందితో ఎఫైర్లు.. నేనే లాస్ట్: నటి
సినిమా ఇండస్ట్రీలో లవ్ బ్రేకప్‌లు సర్వసాధారణం. చాలామంది సెలబ్రిటీలు ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడినవారే! ఆ లిస్టులో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఉన్నాడు. అయితే అతడికి బోలెడన్ని ప్రేమకథలు ఉండవచ్చేమో కానీ చివరిగా ప్రేమించింది, ప్రేమిస్తోంది మాత్రం తననే అంటోంది నటి రత్న పాఠక్ షా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ సినిమాలో కలిసి నటించాం. అప్పుడే మేమిద్దరం కలిసుండాలని నిర్ణయించుకున్నాం. నిజంగా, మేమెంత పిచ్చివాళ్లమంటే? ఒకరి గురించి మరొకరు పెద్దగా ఏమీ ఆరా తీయలేదు. కలిసుండాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నామంతే! పెళ్లి, ఎఫైర్లు.. చరిత్రే ఉంది అతడి గతం గురించి నేనసలు పట్టించుకోలేదు.. ఎందుకంటే నేను ఆ సమయంలో అతడి మీద పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఆయన చాలాకాలం క్రితమే మొదటి భార్యతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పెళ్లి ఒక్కటే కాదు, అతడికి గతంలో చాలా ఎఫైర్లు ఉన్నాయి. అదంతా ఒక చరిత్రలా అనిపిస్తుంది. ఆయన చివరగా ప్రేమించింది నన్నే.. ఆయన జీవితంలోకి ప్రవేశించాక నేను మాత్రమే ఉన్నాను.. అది చాలనిపించింది. పెళ్లి చేసుకున్నాం. తర్వాత హనీమూన్‌కు కూడా వెళ్లాం. హనీమూన్‌కు వెళ్లొచ్చాక నసీరుద్దీన్ షా.. జానే బీ దో యారో సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. పెళ్లికి ఒప్పుకోని పేరెంట్స్ అప్పుడు రెండుమూడు రోజుల తర్వాత కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. తను బతికున్నాడా? లేదా? ఎవరితోనైనా పారిపోయాడా?(నవ్వుతూ) అనేది కూడా తెలిసేది కాదు' అని చెప్పుకొచ్చింది రత్నపాఠక్ షా. కాగా నసీరుద్దీన్‌షా, రత్నపాఠక్ షా 1982లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మొదట రత్న పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటికే అతడు ఒకసారి పెళ్లి చేసుకుని భార్యను వదిలేయడంతో పాటు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దీంతో అతడిని అల్లుడిగా అంగీకరించడానికి రత్న కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అయితే వారు ప్రేమ విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో చివరకు వారి సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నారు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి సీరియల్ నటి.. అత్యధిక పారితోషికం ఆమెకే..