Rasi
-
పాపం ప్రతాప్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
చిన్న సినిమాలతో మంచి విజయాలు అందుకుంటున్న తెలుగు హీరో తీరువీర్. మసూద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తీరువీర్.. పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ ‘ప్రతాప్’ అందుకున్నాడా? తిరువీర్ ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్‌కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని సమస్యేమిటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే..ఓ సున్నితమైన సమస్య చుట్టు తిరిగే కథ ఇది. ప్రేమ ఒకవైపు.. వింత సమస్య మరోవైపు.. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణలో ఏది పై చేయి సాధించింది అనేదే ఈ కథలో కీలకం. యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు ఎస్పీ దుర్గా నరేశ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆయన ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. దానికి పల్లెటూరి వాతావరణం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. బుజ్జమ్మ, ప్రతాప్‌ల చిన్నప్పటి లవ్‌స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే వారిద్దరిని పెద్దవాళ్లుగా పరిచయం చేసి.. పెళ్లి, తర్వాత ప్రతాప్ సమస్యను తెలియజేసి అసలు కథలోకి తీసుకెళ్లాడు. అయితే ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటనేది వెంటనే చెప్పకుండా... కాసేపటి వరకు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా చేశాడు. పంచాయితీలో ఆ సమస్య గురించి చెప్పినప్పుడు.. దీనికి ఎందుకు పంచాయితీ పెట్టడం అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక్కో విషయం తెలిసేకొద్ది.. నిజంగానే అది పెద్ద సమస్య అనిపిస్తుంది. అయితే పెళ్లి అయిన వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా.. పంచాయితీ పెట్టడం అనేది కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఆ సమస్యకి.. ప్రతాప్ ప్రేమకి ముడిపెట్టడం కూడా అతికినట్లుగా అనిపించదు. అయితే హీరో సమస్య గురించి ఊర్లో వాళ్లు రకరకాలుగా మాట్లాడడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కొంతమేర నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాప్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక కీలకమైన ద్వితియార్థంతో కథనం నెమ్మదిగా సాగడం.. అటు కామెడీ సరిగా పండక..ఇటు ఎమోషనల్ సీన్లు కూడా తేలిపోవడంతో బోర్ కొడుతుంది. హీరోకి ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు చేసే పనులు సిల్లీగా అనిపిస్తుంది. అయితే ఆ సమస్య ఎలా వచ్చిందో తెలియజేసే ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ మూవీకి ప్రధాన బలం తిరువీర్.. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చాలా సినిమాల్లో నటించిన వారికి మాత్రమే సాధ్యపడే పాత్రలో ఆయన మెప్పించారు. అమాయకత్వంతో ఉన్న ఈ పాత్రలో సరిగ్గా సెట్ అయ్యారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఎంపిక కూడా బాగుంది అనిపిస్తుంది. అజయ్ ఘోష్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంద శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. ఒకప్పటి హీరోయిన్ రాశి..హీరో తల్లిగా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతం బాగుంది. పాటలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ విశ్వేశ్వర్ ఎస్.వి పర్వాలేదనిపిస్తుంది. -
ప్రభాస్‌తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి
సీనియర్ హీరోయిన్ రాశి మరోసారి ప్రభాస్‌పై అభిమానాన్ని చూపించారు. టాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాశి.. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కలిసి నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలు ఆమెకు భారీ గుర్తింపు తెచ్చాయి. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాశి పలు చిత్రాలతో పాటు సీరియల్స్‌లో కూడా కనిపిస్తుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నటి రాశి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని చెప్పారు. ప్రభాస్‌తో కలిసి ఒక్కసినిమాలో అయినా నటించాలనే ఆశ చాలా ఏళ్లుగా ఉండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఛాన్స్ వచ్చినా తల్లిగా మాత్రం నటించనని క్లారిటీ ఇచ్చారు. ఆపై అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. హీరోయిన్గా నటించే ఛాన్స్ ఎలాగూ ఇవ్వరని తెలిపారు. దీంతో తన కోరిక అలాగే ఉండిపోయిందన్నారు. అయితే, ప్రభాస్‌ను ఇంతవరకు కలవలేదని రాశి అన్నారు. మిర్చి, రాధేశ్యామ్ వంటి చిత్రాలకు డబ్బింగ్ చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. 'ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని తన బ్రదర్‌తో చెప్పానని ఆమె అన్నారు. ప్రభాస్ సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్‌కి వెళ్తానని రాశి చెప్పడం విశేషం.అడవి రాముడు షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్న హోటల్లోనే తాను కూడా ఉన్నానని రాశి అన్నారు. 'ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే ప్రభాస్‌ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్‌కు కాల్ చేసి మాట్లాడా. అయితే ప్రభాస్ సీనియర్స్‌కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. Nen #Prabhas ki Matram Amma ga cheyanu. Eshwar Trailer chusi I just told my brother that he's going to be a Big Hero ani, Ayana Cinema ki Matrame Theatre ki velta nenu, Chatrapati, BB1&2!(Nenu Intha varaku Prabhas ni kalavale) Industry lo unavale kalavale ante manam, kastamey. pic.twitter.com/G9S1gTJjld— . (@charanvicky_) March 24, 2026 -
‘ధన రాశి’ ఇదే.. అత్యధిక సంపన్నులు వీళ్లే..
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను హరున్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన వారితో రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించినవారి సంపదే ఈ ఏడాది అత్యధికంగా వృద్ధి చెందింది. ఇక మిగిలిన రాశుల స్థితిగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి...తాజా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది ఉత్తమ సంవత్సరం. తరువాత మిథునం, సింహ రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వ్యక్తుల సంచిత సంపదలో 84 శాతం పెరుగుదలను చూసింది. మిథున రాశి వారి సంపద 77 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో సింహరాశి ఉంది. వీరి సంచిత సంపద 68 శాతం పెరిగింది.అదే విధంగా 64 శాతం సంపద పెంపుతో ధనుస్సు రాశి, 61 శాతం వృద్ధితో తులారాశి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మకరం సంచిత సంపదలో 58 శాతం పెరుగుదలను చూసింది. తరువాత మీన రాశి 46 శాతం వృద్ధిని సాధించింది. కుంభం, కన్య రాశులు 39 శాతం సంపద వృద్ధితో ఎనిమిదవ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మేషం, వృశ్చికం, వృషభ రాశులు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద వృద్ధితో చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.మిథునం ఇలా అగ్రస్థానంమొత్తం మీద, సంపద వృద్ధి పరంగా కర్కాటక రాశి ముందంజలో ఉంది. కానీ సంపన్నుల సంఖ్య విషయంలో మిథునం అగ్రస్థానంలో ఉంది. జాబితాలోని ధనవంతులలో 9.9 శాతం మంది ఈ రాశి వారే. వీరిలో కుమార్ మంగళం బిర్లా, ఎల్ఎన్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.(Disclaimer: వ్యక్తుల విజయం, సంపాదన రాశుల బట్టి కాక, వారి కృషిని బట్టి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యం, అంకితభావంతో కృషి చేసేవారు తమ రంగంలో తప్పక విజయం సాధిస్తారు.) -
ఆదిలాబాద్: బ్యాంకు సిబ్బందికి షాకిచ్చిన దొంగ
నెన్నెల: ఓ ఆగంతకుడు ఆశగా అర్ధరాత్రి బ్యాంకులో చొరబడ్డాడు. ఆబగా నగదు కోసం వెతికాడు. క్యాష్కౌంటరేమో ఖాళీగా కనిపించింది. స్ట్రాంగ్‌రూం తాళం యమా స్ట్రాంగ్‌గా ఉండటంతో తెరుచుకోలేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు. ఆనక చేసేదేమీలేక ‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’అని కితాబు ఇస్తూ ఓ పేపర్‌పై రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. ముసుగు వేసుకుని గురువారం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు బ్యాంకు తలుపు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరుచుకోలేదు. ఇలా 15 నిమిషాలు బ్యాంకులో ఉండి చోరీకి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోతుపోతూ టేబుల్‌పై ఉన్న ఓ పేపర్ మీద ‘గుడ్ బ్యాంకు, రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్‌ప్రింట్ కూడా దొరకదు’అని మార్కర్‌తో రాశాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు ఆవరణలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ రాములు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వెంటనే బ్యాంకుకు చేరుకుని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నగదు చోరీ కాకపోవడంతో సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంక్‌ను సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
తనను చూసి షాక్ అయిపోయా..అంటున్న హీరోయిన్ రాశి
-
ములుగు శివజ్యోతి ఉగాది రాశి ఫలాలు
-
లంక టీజర్ రిలీజ్ చేసిన మారుతి
టాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీ, పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తరువాత ఇప్పుడు ఓ హర్రర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ సీనియర్ హీరోయిన్. రాశీ భర్త శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోలింగ్ రాక్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ నెలలో ఆడియో రిలీజ్ చేసి, వచ్చే నెల సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
లంక టీజర్ రిలీజ్ చేసిన మారుతి
-
శ్రీశైలం మలన్న సన్నిధిలో రాశి


