ప్రభాస్‌తో సినిమా ఛాన్స్‌.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి | Actress Raasi Expresses Admiration For Prabhas As Fan Girl, Made Interesting Comments About Him, Video Went Viral | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో సినిమా ఛాన్స్‌.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి

Mar 25 2026 8:38 AM | Updated on Mar 25 2026 10:02 AM

Actress Raasi Fan Girl Comments On Prabhas

సీనియర్ హీరోయిన్ రాశి మరోసారి ప్రభాస్‌పై అభిమానాన్ని చూపించారు. టాలీవుడ్‌లో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాశి.. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కలిసి నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలు ఆమెకు భారీ గుర్తింపు తెచ్చాయి. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాశి పలు చిత్రాలతో పాటు సీరియల్స్‌లో కూడా కనిపిస్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి నటి రాశి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని చెప్పారు. ప్రభాస్‌తో కలిసి ఒక్కసినిమాలో అయినా నటించాలనే ఆశ చాలా ఏళ్లుగా ఉండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఛాన్స్‌ వచ్చినా తల్లిగా మాత్రం నటించనని క్లారిటీ ఇచ్చారు. ఆపై అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ ఎలాగూ ఇవ్వరని తెలిపారు. దీంతో తన కోరిక అలాగే ఉండిపోయిందన్నారు. అయితే, ప్రభాస్‌ను ఇంతవరకు కలవలేదని రాశి అన్నారు.  మిర్చి, రాధేశ్యామ్‌ వంటి చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. 'ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని తన బ్రదర్‌తో చెప్పానని ఆమె అన్నారు. ప్రభాస్‌  సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్‌కి వెళ్తానని రాశి చెప్పడం విశేషం.

అడవి రాముడు షూటింగ్ సమయంలో ప్రభాస్‌ ఉన్న హోటల్‌లోనే తాను కూడా ఉన్నానని రాశి అన్నారు.  'ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే  ప్రభాస్‌ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్‌కు కాల్ చేసి మాట్లాడా.   అయితే ప్రభాస్ సీనియర్స్‌కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement