breaking news
ranger
-
భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్ భారత సైనిక ఉన్నతాధికారికి సెల్యూట్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా ఓ పాకిస్థాన్ రేంజర్ భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారికి సెల్యూట్ చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రతిగా భారతీయ అధికారి కూడా ఆ సైనిక అభివాదనాన్ని స్వీకరించారు.కెమెరాకు చిక్కిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇది సైనిక వృత్తిపరమైన సంప్రదాయాలకు, దుస్తుల (యూనిఫాం) గౌరవానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో జరిగే అధికారిక వేడుకలు, ఫ్లాగ్ మీటింగ్‌లు ఇతర సైనిక సదస్సుల సమయంలో ఇరు దేశాల సైన్యాలు అంతర్జాతీయ సైనిక నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటిస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత లేదా రాజకీయ విభేదాలకు అతీతంగా హోదా, యూనిఫాంకు సముచిత గౌరవం ఇస్తారని తెలిపారు.ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘ఇది భారత్ లేదా పాకిస్థాన్‌కు సంబంధించినది కాదు, యూనిఫాం ధరించిన సైనికుల మధ్య సీనియర్ అధికారికి దక్కే గౌరవం’ అని ఒక యూజర్ రాసుకొచ్చారు. మరొకరు స్పందిస్తూ ‘ఇది కేవలం సైనిక సంప్రదాయానికి ప్రతీక’ అని పేర్కొన్నారు. మరో వ్యాఖ్యలో ‘ఇలాంటి సమయాల్లో రాజకీయం కంటే సైనిక ప్రోటోకాల్దే పైచేయి అవుతుంది’ అని రాశారు. సైనిక నిబంధనల ప్రకారం ఎదుటి అధికారి ఉన్నత హోదాలో ఉంటే సెల్యూట్ చేయడం ఆనవాయితీ అని, సీనియర్ అధికారులు దాన్ని మర్యాదపూర్వకంగా స్వీకరిస్తారని కొందరు స్పష్టం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నప్పటికీ, ఇది ఏ నాటిదనే దానిపై ఎలాంటి ధృవీకరణ లభించలేదు. దీంతో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Comedycrest.in™ (@comedycrest.in)ఇది కూడా చదవండి: నా కల సొంతూరికి సర్పంచ్: అభిజీత్ దీప్కే -
బీఎస్ఎఫ్ అదుపులో పాక్ రేంజర్
-
ఏనుగు ముందు ఎందుకలా పరిగెడుతున్నాడు..?
లైవ్‌లో అడవి జంతువులను చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ.. అవి కాస్త రివర్స్ అయితే మాత్రం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పరుగులెత్తాల్సి వస్తుంది.. ఇదిగో ఇక్కడ జరిగింది అదే. శ్రీలంకలోని యాలా నేషనల్ పార్కులో ఓ మదగజం రెచ్చిపోయి.. పర్యాటకులు ఉన్న వాహనాన్ని ఎత్తి పడేయడానికి ప్రయత్నించింది. ఇంతలో ఆ పార్కు రేంజర్ ఒకరు సాహసం చేసి.. చాకచక్యంగా ఏనుగుకు మస్కా కొట్టి.. వాహనం ఎక్కి.. పర్యాటకులను సురక్షిత ప్రాంతానికి తరలించాడు.. ఈ ఉద్విగ్నభరిత చిత్రాన్ని శ్రీలంకకు చెందిన డాక్టర్ లలిత్ క్లిక్‌మనిపించారు. ఇంతకీ ఆ సాహస రేంజర్ ఎక్కడనేగా మీ డౌటు.. చిత్రంలో ఏనుగు ముందు పరుగులు పెడుతున్నాడుగా.. ఆయనే!! (క్లిక్: సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది) -
రేంజర్‌గా సిబిరాజ్
యువ నటుడు సిబిరాజ్ ఇప్పుడు రేంజర్‌గా మారనున్నారు. అవును ఈయన నటించనున్న నూతన చిత్రానికి రేంజర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆరా సినిమాస్ సంస్థ అధినేత మహేశ్.జీ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు బర్మా, రాజారంగూష్కీ, జాక్సన్‌దురై చిత్రాలను తెరకెక్కించిన ధరణీధరణ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్.జీ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది మహారాష్ట్రలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రం అని చెప్పారు. ఈ మధ్య మహారాష్ట్రలోని యావత్మాల్ అనే జిల్లాలో ఆవ్నీ అనే పులి మనుషులను ఎలా బలి తీసుకున్నదన్న విషయం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందేనన్నారు. ఆ సంఘటను ఆధారంగా చేసుకుని రేంజర్ పేరుతో చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సిబిరాజ్ కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి రమ్యానంబీశన్, మధుశాలిని నటించనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు మనుషులపై దాడి చేసిన మృగాల ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయని, అయితే అవన్నీ కల్పిత కథా చిత్రాలని అన్నారు. తమ చిత్రం మన దేశంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ అధికంగా ఉంటుందని చెప్పారు. అందుకు హాలీవుడ్ సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు ధరణీధరణ్ కథ, కథనాన్ని వైవిధ్యంగా తీర్చిదిద్దారని చెప్పారు. థ్రిల్లర్‌తో కూడిన కమర్శియల్ కథా చిత్రంగా రేంజర్ ఉంటుందన్నారు. ఈ చిత్రానికి నటుడు సిబిరాజ్ పక్కాబలంగా ఉంటారని అన్నారు. ఆయన ఇమేజ్ను మరింత పెంచేదిగా రేంజర్ చిత్రం ఉంటుందని అన్నారు. రేంజర్ ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుందన్నారు. చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, అదే విధంగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. అరోల్ కరోలి సంగీతాన్ని, కల్యాణ వెంకట్రామన్ ఛాయాగ్రహణం అందించనున్నారని నిర్మాత తెలిపారు. -
ఫారెస్ట్ ఆఫీసుపై మూకుమ్మడి దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మోతీపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆపీసుపై మూకుమ్మడి దాడి చేసి, నిందితుడిని విడిపించుకుపోయిన ఘటన కలకలం రేపింది. ఫారెస్ట్ రేంజర్ సహా ఆరుగురిని సిబ్బందిని గాయపర్చిన దుండగులు, రేంజ్ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారు. అటవీ అధికారుల సమాచారం ప్రకారం అడవిలోని చెట్లను అక్రమంగా నరికేస్తున్నాడనే ఆరోపణలపై సల్మాన్ అనే వ్యక్తిని అటవీశాక అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త విన్న కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా రేంజ్ ఆఫీసుపై దాడికి దిగారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దుండగులను నిరోధించడానికి ప్రయత్నించిన రేంజర్ ఖుర్షీద్ ఆలం, డిప్యూటీ రేంజర్ రామ్ సహా ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం లాకప్‌లో ఉన్న సల్మాన్ అక్కడి నుంచి తప్పించుకుని ఉడాయించారు. ఈ దాడిపై అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


