breaking news
rajesham
-
కవి రాజేశంకు సినారె పురస్కారం!
మంచిర్యాల: మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు, జిల్లా రచయితల వేదిక అధ్యక్షుడు తోకల రాజేశం డాక్టర్ సీ.నారాయణరెడ్డి రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 30న జడ్చర్లలో జరిగే కార్యక్రమంలో మహాకవి సినారె కళాపీఠం పురస్కారం ప్రదానం చేస్తారు. పద్య, వచన, కవిత్వంతోపాటు సాహిత్య విమర్శ రంగంలోనూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కళాపీఠం అధ్యక్షుడు మల్లెకేడి రాములు, సమన్వయకర్త డాక్టర్ పోరెడ్డి రంగయ్య ప్రకటించారు. రాజేశం 2006లో తెలుగు బాల శతకం, 2010లో చమట చుక్కలు, 2013లో పాతాళగరిగే, 2017లో అడవిదీపాలు, మంచిర్యాల జి ల్లా సాహిత్య చరిత్ర అనే గ్రంథాలను ముద్రించారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బూర రాజేషం(60) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.