breaking news
raitu bharosa yatra
-
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
– రూ.1.80 లక్షలు నగదు స్వాధీనం – వైఎస్ జగన్ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో చేతివాటం – శ్రీశైలం నుంచి బండిఆత్మకూరు వరకు రోడ్‌షోను అనుసరించిన ‘ముఠా’ - ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో వీరిపై కేసులు కర్నూలు: రోడ్‌షోలు, బహిరంగ సభలు లక్ష్యంగా చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ‘ముఠా’ ఆటకట్టించారు పోలీసులు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 17 మంది దొంగలను ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీ సుప్రజతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 17 మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా అనేక నేరాలకు పాల్పడ్డారు. రైతు భరోసా యాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ముఠాసభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ నేతృత్వంలో ఆత్మకూరు సీఐలు కృష్ణయ్య, శ్రీశైలం వన్‌టౌన్ ఎస్ఐ వరప్రసాద్, టూటౌన్ ఎస్ఐ ఓబులేసు, ఆత్మకూరు ఎస్ఐ లోకేష్‌కుమార్, కర్నూలు సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ మస్తాన్ తదితరులు దొంగలపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. ఆత్మకూరు, శ్రీశైలం పోలీసు స్టేషన్ల పరిధిలో వీరు పలు నేరాలకు పాల్పడ్డారు. శ్రీశైలం నుంచి బండి ఆత్మకూరు వరకు రైతు భరోసా యాత్రను అనుసరించి బహిరంగ సభ, రోడ్‌షోల్లో చేతివాటం ప్రదర్శించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో కూడా ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడిందన్నారు. భవిష్యత్తులో వీరిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీశైలంలోని శిఖరేశ్వరం వద్ద కొందరిని, ఆత్మకూరులోని చక్రం హోటల్ వద్ద మరికొందరిపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. మొత్తం 12 కేసుల్లో వీరు దొంగలించిన సొత్తుకు సంబంధించి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన మూడు బైకులు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరందరిపై సస్పెక్ట్ సీట్లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వారి వేలి ముద్రలను సేకరించి పోలీసు శాఖ ఆన్లైన్లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ప్రిన్స్అనే కొత్త యంత్రాన్ని త్వరలో అమలులోకి తెస్తున్నామని, ఇకపై దొంగలు, రౌడీషీట్ల ఆటలు చెల్లవని ఎస్పీ వెల్లడించారు. పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.నిందితులను ఆత్మకూరు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరిచారు. ముఠాలోని నిందితుల వివరాలు - షేక్ అహ్మద్ బాషా- అనంతపురం - బలిజ ఈశ్వరయ్య - గోసానిపల్లె, డోన్ - వడ్డె శివ - డోన్ - పూలకొమ్మ కేశవరావు - మార్కాపురం, ప్రకాశం దొండపాటు శ్రీనివాసుల- మార్కాపురం, ప్రకాశం గన్నవరపు శ్రీను - ఎర్రగుండపాలెం, ప్రకాశం పీట్ల ఉప్పతోళ్ల ఇస్రాయిల్ - కృష్ణాపురం, కర్నూలు కుంచాల కోటేశ్వరరావు - వినుకొండ, గుంటూరు మన్నెపల్లె శేషయ్య - పొద్దుటూరు, కడప ఇలగనూరు నాగరాజు - కోటంవేడు, నెల్లూరు సముద్రాల యాకోబ్ - నెల్లూరు కాలటి ప్రతాప్ - ఈవూరుపాలెం, ప్రకాశం చల్లా శ్యాములు - సాకచెర్ల, నెల్లూరు సాతుపాటి సాయి - వైకుంఠాపురం - ప్రకాశం తమ్మిశెట్టి చంద్రశేఖర్ - సిద్ధాపురం, కర్నూలు వేముల రాంబాబు - సిద్ధాపురం, కర్నూలు ఆకు విజయ్ - పెడవళ్లి, అనంతపురం -
నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర
-
నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర
కర్నూలు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ నేడు(ఆదివారం) నాలుగోరోజుకు చేరుకుంది. నేటి యాత్ర వెలుగోడు మండలం వేల్పనూరులో ప్రారంభమైంది. అక్కడి నుంచి సంతజుటురు, నారాయణపురం, చిన్నదేవలపురం, లింగాపురం, జీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం, వీర్నపాడు మీదుగా వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. నేటి యాత్రలో భాగంగా లింగాపురంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన తనయుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఇవిష్కరించున్నారు. -
న్యాయం, ధర్మానిదే గెలుపు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టీకరణ • కర్నూలు జిల్లాలో మూడో రోజు ‘రైతు భరోసా యాత్ర’ రైతు భరోసా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: ‘‘రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్... ఇలా మనం చదివే పవిత్ర గ్రంథాలన్నీ చెప్పేది ఒక్కటే... ప్రలోభాలు, మోసాలు ఒడిపోతాయి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతారు. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో జగన్ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ మూడో రోజు శనివారం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి ప్రారంభమైంది. వేల్పనూరులో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘ఇప్పటివరకు మనం చూసినా సినిమా అంతా ఇంటర్వెల్ వరకే నడిచింది. ఇప్పటిదాకా విలన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. సినిమాలో 14 రీళ్లు ఉంటే 13వ రీల్ వరకూ విలన్‌దే పైచేయిగా ఉంటుంది. క్లైమాక్స్‌లో కథ అడ్డం తిరుగుతుంది. 14వ రీల్లో విలన్‌ను హీరో చితకబాదుతాడు. దేవుడు పై నుంచి కరుణించి ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఇది సినిమా అయినా కానీ, ఏ కథ అయినా కానీ చివరకు ముగింపు ఇదే. బాబువన్నీ మోసాలు,అబద్ధాలు, ప్రలోభాలే వేల్పనూరు గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడి నుంచి ఇదే కుటుంబం (బుడ్డా) నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖరరెడ్డిని మీరంతా ఆశీర్వదించి దీవించారు. కానీ ప్రలోభాలకు, మోసాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరినీ వదిలిపెట్టలేదు. ఆయన మోసాలు, అబద్ధాలు, ప్రలోభాలు ఏ స్థాయికి చేరాయంటే చివరికి వీరి (బుడ్డా శేషారెడ్డిని చూపిస్తూ) కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ కుటుంబంపై నాకు నమ్మకం ఉంది. కుటుంబంలో ఒకరు తప్పు చేసినా క్షమించే మంచి గుణాన్ని మనందరికీ దేవుడు ఇచ్చాడు. శేషును(బుడ్డా శేషారెడ్డి) మీరందరూ దీవించండి. మీ అందరి ఆశీస్సులు శేషుపై చూపించండి. హామీలిచ్చారు.. దగా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయకుండా ఎవరినీ వదిలిపెట్టలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందు మైకు పట్టుకుని చెప్పారు. అప్పుడు ఏ టీవీలో చూసినా ఇవే హామీలు, ఏ గోడలపై చూసినా ఇవే రాతలు. ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను దగా చేశారు. అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. గద్దెనెక్కాక విస్మరించారు. చివరకు చదువుకుంటున్న పిల్లలను, చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగా ల కోసం వెతుక్కుంటున్న వారిని కూడా వదల్లేదు. జాబు కావాలంటే బాబు ముఖ్య మంత్రి కావాలని ప్రచారం చేశారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చివరకు మొండిచేయి చూపారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పేదలకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదు. మోసాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం’’ అని జగన్ తేల్చి చెప్పారు. అనంతరం అబ్దుల్లాపురంలో పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి బయలుదేరి వెలుగోడులో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బోయరేవుల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి మోత్కూరు, తిమ్మనపల్లి వరకూ రైతు భరోసా యాత్ర కొనసాగింది. అనంతరం జగన్ అబ్దుల్లా పురం, మోత్కూరు గ్రామాల్లో స్థానిక రైతులు, కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వారు తమకు పంట గిట్టు బాటు ధర లభించని తీరును, పింఛన్లు అందని వైనాన్ని జగన్ దృష్టికి తెచ్చారు. వారందరికి ఆయన ధైర్యం చెప్పారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాడుతోందని భరోసా ఇచ్చారు. -
ఆత్మీయ నేస్తం
జనసంద్రంగా రైతు భరోసా యాత్ర - చాకలి వెంకటేశ్వర్లు కుటుంబానికి ఓదార్పు - కదిలివచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలు - గిట్టుబాటు ధర లేదని ఆవేదన - మనవడికి ఆప్యాయత పంచిన వృద్ధులు - అడుగడుగునా అక్కాచెల్లెళ్ల ఆనందోత్సాహం - స్వాగతం పలికిన ఊరూవాడా అదిగో రాజన్న బిడ్డ.. పొలాల్లోంచి పరుగు పరుగున వచ్చిన కూలీలు. మనవడి రాక.. నడవలేకపోయినా అతికష్టం మీద రోడ్డు మీదకొచ్చిన వృద్ధులు. రైతు నేస్తం.. కష్టాలు తెలిసిన నేతతో గోడు చెప్పుకున్న రైతన్నలు. జగనన్న.. అక్కా చెల్లి.. అన్నా తమ్ముడు పంచిన ఆత్మీయతతో ఊరూవాడా మురిసింది. కన్నీళ్లు తుడుస్తూ.. జీవితాలకు భరోసానిస్తూ సాగిన యాత్ర ఆద్యంతం జగమంత కుటుంబాన్ని తలపించింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతుల కష్టాలు తెలిసిన నేతగా ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకు భరోసానిచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడవ రోజు శనివారం వెలుగోడు మండలంలో సాగింది. వేల్పనూరు నుంచి ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని పురాతన ఆలయమైన ఆంకాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బుడ్డా వెంగళరెడ్డి కుటుంబంపై తనకు నమ్మకం ఉందని.. కుటుంబంలో ఒక్కరు తప్పు చేసినా క్షమించే గుణం మనకు ఉందని గుర్తు చేశారు. అయితే రైతులు, మహిళలు, యువతతో పాటు బుడ్డా కుటుంబాన్నీ చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అక్కడి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ అబ్దుల్లాపురం మీదుగా వెలుగోడుకు చేరుకున్నారు. అబ్దుల్లాపురంలో మినుము పంటను పరిశీలించారు. తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని.. రుణమాఫీ కాకపోవడంతో తాకట్టు పెట్టిన గొలుసు బ్యాంకులోనే ఉండిపోయిందని రైతు వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో కొత్త నోట్లు రావడం లేదని.. సద్ది కట్టుకునిపోయి లైన్లో ఉంటున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తమకు రోజువారీ కూలి రూ.110 నుంచి రూ.130 వరకు వస్తోందని.. నోట్ల రద్దు తర్వాత రైతులు కూలి డబ్బు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కూలీలు వాపోయారు. వచ్చేసారి కచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలు వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు. అనంతరం వెలుగోడుకు చేరుకున్న ఆయన వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. పింఛన్లు ఇవ్వడం లేదు..! వెలుగోడులో నిర్వహించిన రోడ్డు షోలో అడుగడుగునా ప్రజలు తమ బాధలు జననేతకు చెప్పుకునేందుకు ముందుకొచ్చారు. తమకు పింఛన్లు ఇవ్వడం లేదని, వేలిముద్రలు పడటం లేదని చెప్పి ఉన్న పింఛన్లను కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు వృద్ధులు వాపోయారు. అదేవిధంగా భర్తలను కోల్పోయిన వితంతువులు కూడా తమకు కొత్తగా పింఛన్లను ఇవ్వడం లేదని.. నెలల తరబడి ఎదురు చూస్తున్నామని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇక రైస్ మిల్లు కార్మికులు కూడా తమకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారని.. రైస్ మిల్లులు కూడా సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. వారి బాధలు వింటూ త్వరలోనే మంచిరోజులు వస్తాయని భరోసా ఇస్తూ జగన్ ముందుకు కదిలారు. అక్కడి నుంచి బోయరేవులలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబానికి భరసానిచ్చారు. కుటుంబం వెంట తాము ఉంటామని ధైర్యం చెప్పారు. గిట్టుబాటు ధర కరువు బోయరేవుల నుంచి మోత్కురుకు చేరుకుని అక్కడ వడ్ల కళ్లంలో రైతులతో వైఎస్ జగన్ ముచ్చటించారు. తమకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మినుము, మిరప, ధాన్యాలు, కంది.. ఇలా ఏ పంటకూ చంద్రబాబు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యిందని జగన్ ధ్వజమెత్తారు. వరుస కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతాంగం.. పండిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఆదుకునేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అక్కడి నుంచి తిమ్మనపల్లికి చేరుకుని మూడో రోజు రైతు భరోసా యాత్రను ముగించారు. మూడవ రోజు రైతు భరోసాలో సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి భరోసా కల్పించారు. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమైన యాత్ర రాత్రి 7 గంటల వరకూ సాగింది. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, రైతు సంఘం నేతలు నాగిరెడ్డి, వంగాల భరత్‌కుమార్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, పోచా శీలారెడ్డి, కర్రా హర్షవర్దన్ రెడ్డి, పోచా జగదీశ్వర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, రాజా విష్ణువర్దన్ రెడ్డి, తరిగోపుల భాస్కర్ రెడ్డి, పర్ల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జన దీవెన
రెండో రోజు భరోసా యాత్ర విజయవంతం - మల్లన్న ఆశీర్వాదంతో ప్రారంభం - దోర్నాల మీదుగా ఆత్మకూరుకు.. - దారి పొడవునా బారులుతీరిన ప్రజలు - 140 కిలోమీటర్లు.. 10 గంటల యాత్ర - అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. శుక్రవారం రెండు జిల్లాల్లో యాత్ర సాగడం విశేషం. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకున్న అనంతరం వైఎస్ జగన్ దోర్నాల మీదుగా ఆత్మకూరు చేరుకున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు డబ్బులిస్తే అధికారంలోకి రారని.. ప్రజల అభిమానం గెలవాలని జగన్ చెప్పడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అదేవిధంగా మీకు రుణమాఫీ అయ్యిందా తెలపాలంటూ అడిగిన ప్రశ్నకు.. లేదంటూ చేతులు అడ్డంగా ఊపుతూ రైతులు తమ అభిప్రాయం తెలిపారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదన్నారు. ఇకపోతే దారి పొడవునా ముస్లిం నేతలు టోపీ ధరింపజేసి శాలువాతో సత్కరించారు. రైతు విభాగం నేతలు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి కండువా వేసి నాగలి బహూకరించారు. ఆత్మకూరు పట్టణంలో టాప్‌పై నిల్చొని రోడ్‌షో నిర్వహించారు. అంతకు ముందు ప్రకాశం జిల్లాలో సాగిన యాత్రలో ప్రధానంగా చింతలలోని చెంచులు కాగితపు పూలు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు. మల్లన్నకు మొక్కులతో.. ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి శ్రీశైలానికి వచ్చిన వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వాచనాలు అందజేశారు. ఆలయ జేఈఓ హరినాథరెడ్డి శ్రీశైలాలయం చిత్రపటాన్ని బహూకరించారు. దర్శనానంతరం 11 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరిన జగన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు దోర్నాలకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి ప్రసంగించారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆత్మకూరుకు చేరుకున్నారు.ఽ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఆ తర్వాత స్మృతివనం చేరుకుని వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మొత్తం మీద రెండో రోజు రైతు భరోసా యాత్ర ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 140 కిలోమీటర్లు సాగింది. ఇదీ మానవత.. ఆత్మకూరు పట్టణంలోకి భరోసాయాత్ర చేరుకోగానే ఓ అభిమాని వేగంగా వచ్చి కింద పడిపోయాడు. జీపులో నుంచి గమనించిన వైఎస్ జగన్ వెంటనే కిందకు దిగి అతని వద్దకు వెళ్లి జాగ్రత్త అంటూ పలకరించారు. ఆయనను లేపిన తర్వాత తిరిగి జీపులో కూర్చుని యాత్ర కొనసాగించారు. అదేవిధంగా దారిపొడవునా ప్రతి చోటా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రోడ్డుకు అడ్డంగా వచ్చి పలకరించారు. వారిని చూసిన జగన్.. ప్రేమగా కిందకు దిగి ఆత్మీయతను పంచారు. ఎలా ఉన్నారంటూ ఆరాతీశారు. పింఛన్లు రావడం లేదని, ఇళ్లు ఇవ్వలేదని, గిట్టుబాటు ధర రాలేదని పలువురు తమ బాధలను విన్నవించారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని, అధైర్యపడవద్దంటూ ధైర్య వచనాలు చెబుతూ ఆయన ముందుకు కదిలారు. ఆకట్టుకున్న ప్రసంగాలు...! ప్రాజెక్టులు వైఎస్ కడితే.. తానే కట్టినట్టుగా రైతాంగాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి, అధికార తెలుగుదేశం పార్టీ వైఖరి.. పాండవులు, కౌరవుల తీరు అంటూ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సవివరంగా తెలిపిన తీరు ప్రజలను ఆకట్టుకుంది. ఇక ఇంత మంది ప్రజాభిమానాన్ని ఎన్ని కోట్లు ఇస్తే కొనచ్చో తెలపాలంటూ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి స్వయానా తన సోదరుడు, పార్టీ మారిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. తాను ఇచ్చిన మాట మేరకు జగన్‌తోనే పయనిస్తానని హామీనిచ్చారు. ప్రజల అభిమానంతో గెలిచిన ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోవడం దుర్మార్గమని సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అంటేనే కరువని గౌరు చరిత అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, బుగ్గన రాజేనంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్ రెడ్డి, ఇన్చార్జీలు రాజగోపాల్ రెడ్డి, మురళీకృష్ణ, చెరుకులపాడు నారాయణ రెడ్డి, హఫీజ్‌ఖాన్, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, సురేందర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, తరిగొపుల భాస్కర్ రెడ్డి, ముంతల విజయభాస్కర్ రెడ్డి, గోవిందగౌడు, చౌడయ్య, అంబాల ప్రభాకర్ రెడ్డి, రాములమ్మ, డీకే రాజశేఖర్, సాయిరాం, లింగస్వామిగౌడ్, మద్దయ్య, వంగాల భరత్‌కుమార్ రెడ్డి, నరసింహులు యాదవ్, రాజా విష్ణువర్దన్ రెడ్డి, చంద్రమౌళి, నాగరాజు యాదవ్, పత్తికొండ మురళీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు అండగా.. జననేత ‘భరోసా’ యజ్ఞం
-
కొండంత అభిమానం
జనసంద్రమైన సున్నిపెంట - ఊరు ఊరే కదిలివచ్చిన వేళ - రెండు కిలోమీటర్ల రోడ్‌షోకు ఆరు గంటల సమయం - ప్రతి ఒక్కరికీ ఆప్యాయ పలకరింపు - దివ్యాంగులను చూసి చలించిన జగన్ - నేలపై కూర్చొని యోగక్షేమాల ఆరా - వృద్ధులకు మనవడిని చూసిన ఆనందం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యింది. గురువారం మధ్యాహ్నం లింగాలగట్టుకు చేరుకున్న జగన్‌కు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. 2009లో వరదలు వచ్చిన సందర్భంగా తాము గృహాలను కోల్పోయామని.. పక్కా గృహాలు నిర్మించాలని లింగాలగట్టువాసులు జగన్‌ను అభ్యర్థించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ఆయన హామీనిచ్చారు. అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్‌కు చేరుకున్న ఆయన.. డ్యాంలో నీటి నిల్వ, విడుదల తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని సున్నితంగా ఎండగట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి, దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తుతూ.. తానే ప్రాజెక్టులను పూర్తిచేసినట్టు బిల్డప్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు లస్కర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను తానే కడుతున్నానని నమ్మబలుకుతున్నారని.. అయితే నీటి విడుదల విషయంలో మాత్రం ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం అక్కడి నుంచి సున్నిపెంటకు చేరుకున్న ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దాదాపు 2 గంటల ప్రాంతంలో సున్నిపెంట చేరుకున్న ఆయన సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షో సుమారు 6 గంటలు పట్టిందంటే జనం ఏ విధంగా తరలివచ్చారో అర్థమవుతోంది. మరోవైపు ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రతి ఒక్కరూ పోటీపడ్డారు. అభిమానమై తరలిరాగా... అభిమాన నేత జగన్‌ను చూసేందుకు సున్నిపెంట ఊరు మొత్తం రోడ్డుపైకి వచ్చింది. గుండెల నిండా అభిమానంతో రోడ్డుపైనే గంటల తరబడి నిరీక్షించారు. కాళ్లు లేని ఒక ముసలవ్వ జగనన్నను చూడాలంటూ రోడ్డుపైకి వచ్చింది. ఆ అవ్వను ప్రేమతో పలకరించి.. ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ దగ్గరుండి మరీ ఇబ్బంది లేకుండా చూశారు. అదే విధంగా ఆయనకు రోడ్డు నిండా పూలు చల్లుతూ.. హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ రోడ్ షో రాత్రి 8 గంటల వరకూ సాగింది. అనంతరం ఆయన శ్రీశైలానికి చేరుకున్నారు. సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. అభిమాన నేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఆయన విష్ యూ ద సేమ్ అంటూ కరచాలనం చేశారు. మరికొందరు వృద్ధులు, వికలాంగులు తమకు పింఛన్లు రావడం లేదని విన్నవించారు. వారికి తప్పకుండా న్యాయం చేద్దామని భరోసానిస్తూ ముందుకు కదిలారు. మొత్తం మీద భరోసా యాత్ర మొదటి రోజు 18 కిలోమీటర్ల మేర.. 7 గంటల పాటు సాగింది. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీలు కాటసాని రాంరెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, హఫీజ్‌ఖాన్, మురళి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, పత్తికొండ మురళి, పోచా శీలారెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు యాదవ్, నరసింహులు యాదవ్, విజయకుమారి, విజయలక్ష్మి, మంగమ్మ, నొసం సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, వంగాల భరత్‌కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇబ్రహీం, వైబీ చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రైతు భరోసా యాత్ర
-
నేటి నుంచి రైతు భరోసా యాత్ర
♦ కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి ప్రారంభం ♦ శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జగన్ పర్యటన సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు. అనంతరం 6వ తేదీన శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం ఆత్మకూరు చేరుకుని బహిరంగసభలో ప్రసంగించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో ఈ నెల 11వ తేదీ వరకూ భరోసా యాత్ర జరుగుతుందని పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. -
4న వైఎస్ జగన్ శ్రీశైలం రాక
- లింగాలగట్టు, డ్యాం సందర్శన ·- సున్నిపెంటలో రోడ్‌షో - శ్రీశైలంలో రాత్రిబస ·- 5న స్వామిఅమ్మవార్ల దర్శనం శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4వ తేదీ బుధవారం శ్రీశైలానికి వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి.. సోమవారం శ్రీశైలం చేరుకుని ఈఓ నారాయణ భరత్‌గుప్తతో వసతి ఏర్పాట్లపై చర్చించారు. అలాగే క్షేత్ర పరిధిలో జననేత బస చేసే వసతిగృహాన్ని పరిశీలించిన తరువాత రాయలసీమలో ఉన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ..ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులకే కేటాయించాల్సిన వసతిగదులపై కసరత్తు చేశారు. శ్రీశైల నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర..ఈ నెల 5 నుంచి ఆత్మకూరులో ప్రారంభమవుతుందని బుడ్డా తెలిపారు. అంతకు ముందుగా జననేత.. 4వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా లింగాలగట్టుకు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి డ్యాం సందర్శన చేసిన తరువాత సున్నిపెంటకు చేరుకుని సాయంత్రం వరకు రోడ్‌షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. అదేరోజు రాత్రికి శ్రీశైలంలో బస చేస్తారని చెప్పారు. స్వామిఅమ్మవార్లను 5వ తేదీ ఉదయం దర్శించుకున్నాక శ్రీశైలం నుంచి బయలుదేరి దోర్నాల మీదుగా ఆత్మకూరుకు చేరుకుంటారన్నారు. అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తారని బుడ్డా శేషారెడ్డి తెలిపారు. -
వర్షాల కారణంగా ‘రైతు భరోసా యాత్ర’ వాయిదా
– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడి కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో ఈనెల 28 నుంచి నిర్వహించ తలపెట్టిన రైతు భరోసా యాత్ర వాయిదా పడినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అధిక వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత భరోసా యాత్ర తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
సత్యనారాయణ కుటుంబానికి జగన్ పరామర్శ
-
'చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగోరోజు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభమైంది. గొల్లపల్లి వద్ద రైతుకూలీలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలుకరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ రుణాలను మాఫీ చేస్తామంటేనే టీడీపీకి ఓట్లేశామని, రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని తెలిపారు. హామీలతో చంద్రబాబు తమను మోసం చేశాడని వైఎస్ జగన్ వద్ద వాపోయారు. వర్షాలు సరిగా లేక పంటలు పండటం లేదని ఆవేదన వ్యక్త చేశారు. రైతులకు న్యాయం జరిగేలా పోరాడుతానని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. వసంతపురం గ్రామ మహిళలు తమ సమస్యలను వైఎస్ జగన్‌ను వివరించారు. వేలి ముద్రలు పడట్లేదని అధికారులు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని, ఈ పాస్ విధానం రద్దు చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మహిళలు కోరారు. అనంతరం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర కొనసాగింది. వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. చిగిచెర్లలో సత్యనారాయణ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. -
అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం
-
అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం
అనంతపురం: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసాయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 2016 డైరీని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను వైఎస్ జగన్‌కి వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులాపతి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసం నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ అనంతపురంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. -
'బాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం'
-
ప్రజలకు పంగనామాలు
* మతిమరుపు వ్యాధితో చంద్రబాబు హామీలన్నీ మరిచారు * నిరుద్యోగ భృతి మాటే విస్మరించారు * సీఎం తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్ * కాదలూరులో రైతు ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ * హోసగుడ్డం, సోమలాపురంలో జగన్‌కు ఘన స్వాగతం (అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘అసలే కరువు జిల్లా. వానల్లేవ్. పంటలూ లేవు. రైతుల పరిస్థితేం బాగోలేదు. వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజానీకానికి పంగనామాలు పెట్టారు. బాబు మాటలు నమ్మిన బడుగులు నిలువునా మోసపోయార’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. ప్రజలను వంచించిన నీవు సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో తిరగ్గలవా? ఒకవేళ అదే జరిగితే జనం రాళ్లతో కొట్టినా ఆశ్చర్యం లేద’న్నారు. రెండో విడత రైతు భరోసా యాత్ర ముగింపు రోజైన సోమవారం వైఎస్ జగన్ రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం కాదలూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే గ్రామ కూడలిలో రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ‘జిల్లా రైతుల్లో కడుపు నిండా బాధ ఉంది. అప్పులు, ఆగిపోయిన పింఛన్లు, మంజూరు కాని ఇళ్లు, చేతికందని నిరుద్యోగభృతి వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. జనాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు మునిశాపంతో పాటు మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు. వాటిని గుర్తుచేస్తూ జూన్ 4, 5 తేదీల్లో గుంటూరులో మరోసారి నిరాహార దీక్షలు చేయబోతున్నా’నని జగన్ ప్రకటించారు. యాత్ర సాగిందిలా... డి. హీరేహాళ్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు 8వ రోజు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. రెండో విడత యాత్రకు చివరి రోజు కావడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు డి.హీరేహళ్ చేరుకుని జగన్‌ను కలిశారు. జిల్లా పార్టీ ముఖ్య నేతలతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన.. ముందుగా హోసగుడ్డం గ్రామం మీదుగా సోమలాపురం చేరుకున్నారు. గ్రామసర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల నేత గోపాల్‌రెడ్డితో పాటు ఊరంతా కదిలొచ్చి ఘన స్వాగతం పలికారు. యువకులు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. జగన్ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి ఇంటికెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడున్న మహిళలతోనూ సంభాషించారు. స్థానిక ఎస్సీ కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని, కొన్ని వీధుల్లో కరెంటు స్తంభాలు లేవని స్థానిక మహిళ వీరభద్రపు లక్ష్మక్క వివరించింది. హైదరాబాద్‌లోని కిమ్స్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్ చేయించుకున్న తనకు ప్రభుత్వం మందులు ఇవ్వలేదని, వాటిని కొనుగోలు చేసే స్తోమత లేని తనను ఆదుకోవాలని అదే గ్రామానికి చెందిన చెక్కిరపు లక్ష్మి వేడుకుంది. ఈ ఇద్దరి మహిళల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి జగన్ సూచించారు. అనంతరం కాదలూరు చేరుకున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. బ్యాంకులోళ్లు ఇళలమీదకొస్తున్నారు... ‘అప్పులన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు నిండా మోసం చేశాడు. ఇప్పుడేమో బ్యాంకులోళ్లు ఇళ్ల మీదకొస్తున్నారు. ఇళ్లు అమ్ముతారో, ఆస్తులమ్ముతారో మాకు తెలీదు.. అప్పులు మాత్రం తీర్చాల్సిందేనని కరాఖండీగా చెబుతున్నార’ని పలువురు డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ట్రిక్స్ ప్లే చేసిన చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ఘోరంగా మోసగించారని రాయదుర్గం మహిళ పద్మజ మండిపడింది. చేతనైతేనే చెప్పాలి గానీ.. ఈ తరహా మోసం దారుణమని రాయదుర్గం రైతు అశోక్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు హామీలపైనా, ఆయన ఏడాది పాలనా తీరుపైనా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రసంగానికి విశేష ఆదరణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, ఇప్పుడు వాటిని విస్మరించిన తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే ఎండగట్టారు. కాదలూరులో జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వైఎస్ పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులు చేశారు. ‘ప్రజలకు చంద్రబాబు పంగనామాలు పెట్టారా’ అని ప్రశ్నించినప్పుడల్లా అవునంటూ చేతులెత్తారు. ఎనిమిదో రోజు యాత్రలో వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. ముగిసిన రెండో విడత భరోసా యాత్ర జిల్లాలో ఈ నెల 11న మొదలైన రెండో విడత రైతు భరోసా యాత్ర సోమవారంతో ముగిసింది. ఏడు నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ 14 మంది రైతు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు. నయా పైసా ఇవ్వలేదు డీ.హీరేహాళ్ : ‘నా భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయల తక్షణ సాయం వస్తుందని చెబితే దరఖాస్తు చేసుకున్నా. అధికారులు పట్టించుకోలేదు. ఇంతవరకు పైసా సాయమందించలేదు. కనీసం ఎవరూ పలకరించిన పాపానపోలేదు. ఇక పరిహారం ఊసే లేద’ని మండలంలోని కాదలూరు గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు భార్య గంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు.వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. జగన్ : ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా తల్లీ? గంగమ్మ : లేదు సార్. భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయలు వస్తాయని జన్మభూమిలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. ఇంత వరకు రాలేదు. జగన్ : ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లీ? గంగమ్మ : 4.5 ఎకరాలు ఉంది సార్. పత్తి పంట వేశాం. జగన్ : ఎన్ని క్వింటాళ్ల పత్తి వచ్చిందమ్మా? గంగమ్మ : రెండు క్వింటాళ్లు సార్ జగన్ : నాలుగున్నర ఎకరాలకు అంతేనా తల్లీ?! గంగమ్మ : నీళ్లు లేక పంట ఎండిపోయింది. సార్. జగన్ : పిల్లలు లేరా? గంగమ్మ : లేరు. అక్క నాగమ్మ కొడుకు దేవేంద్రను దత్తత తీసుకున్నాం. జగన్ : బయట ఎంత అప్పు చేశారమ్మా? గంగమ్మ : లక్షా 30 వేలు సార్. జగన్ : బంగారు లోను ఏమైనా తీసుకున్నావా తల్లీ? గంగమ్మ : బంగారమే లేదు సార్. కొడుకు దేవేంద్ర కూడా బళ్లారిలో ఉంటున్నాడు. ఇక్కడ ఉంటే నా పిల్లలు ఎలా బతకాలంటూ అక్కడికి వెళ్లాడు. జగన్ : (దేవేంద్రనుద్దేశించి..) ఏం పని చేస్తున్నావు? దేవేంద్ర : డ్రైవర్ సార్. జగన్ : నీకేమైనా సాయం కావాలంటే రామచంద్రారెడ్డన్నను కలువు. సార్.. నాకు ఆధార్‌కార్డు కర్ణాటక నుంచి బదిలీ కాకపోవడంతో అప్పు మాఫీ కాలేదు. జగన్ : నీలాంటి వారికి చంద్రబాబు పంగనామాలు పెట్టారు. -
వైఎస్ జగన్ 8వరోజు రైతు భరోసా యాత్ర
-
అన్ని వర్గాల్లో ఆవేదనే!
- 8 రోజుల జగన్ భరోసా యాత్రలో వినిపించిన జనం గుండె గొంతుక - 14 రైతు కుటుంబాలకు భరోసా - మండే ఎండల్లోనూ ఎదురుచూసిన జనం - జననేతకు బాధలు చెప్పుకున్న ప్రజలు అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా లో చేపట్టిన రెండో విడ త రైతు భరోసాయాత్ర ఆద్యంతం రైతులు, మహిళలు, యువతకు భరోసానిచ్చేలా సాగింది. 8 రోజుల పాటు 7 నియోజకవర్గాల్లో, 1150 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో వందలాది గ్రామాల ప్రజలను జగన్ పలకరించారు. ఆత్మహత్య చేసుకున్న 14 మంది రైతు కుటుంబాలను పరామర్శించారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి రాత్రి తొమ్మిది గంటలవరకూ రోజుకు 12 గంటలపాటు వేసవిని కూడా లెక్కచేయకుండా జగన్ చేసిన భరోసా యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఒక్కోరోజు అర్ధరాత్రి 12 గంటల వరకూ యాత్ర సాగినప్పటికీ ఓపికగా రోడ్ల మీదనే జనం వేచి చూసి మనసారా స్వాగతం పలికారు. జగన్ కూడా తన కోసం వేచి ఉన్న ప్రజల కోసం యాత్ర సాగిన ప్రతీ గ్రామంలోనూ ఆగి వారిని పేరు పేరునా పలకరించారు. అనంతపురం పట్టణంలోని బస్టాండులో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ర్టవ్యాప్త బంద్ చేపడతామని సర్కారును హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండపై మండిపడ్డారు. అధికార పార్టీ చేతిలో హత్యకు గురైన పార్టీ నేతలు ప్రసాద్ రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మల్లికార్జున కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రసాదరెడ్డి హత్యానంతరం చెలరేగిన అల్లర్ల ఘటనలో అనంతపురం జిల్లా సబ్‌జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తదితరులను పరామర్శించారు. గుంతకల్లు నియోజకవర్గంలోని తిమ్మాపురంలో, ఉరవకొండ నియోజకవర్గంలో ఉరవకొండ పట్టణంలో, రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్, కాదలూరుల్లో ముఖాముఖి నిర్వహించి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, యువతీ యువకుల ఆవేదనను ఆలకించారు. తమ వ్యవసాయ, బంగారు రుణాలు మాఫీ కాలేదని రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి కూడా రావడం లేదని యువతీ యువకులు మాటామంతీలో వాపోయారు. తమకు నెలకు వస్తున్న రూ.600 సబ్సిడీ కూడా రెండు నెలలుగా రావడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తంచేశారు. రానున్నవి మంచి రోజులని.... మన ప్రభుత్వ హయాంలో అందరి సమస్యలు పరిష్కరిస్తానని జగన్ వారికి భరోసానిచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు వచ్చే నెల 4,5 తేదీలల్లో చేపట్టనున్న దీక్షకు తరలిరావాలని కోరారు. -
ఒక్క హామీ నిలబెట్టుకున్నావా?
- రైతు భరోసా యాత్రలో బాబుపై మండిపడ్డ జగన్ - నిన్ను నమ్మిన అన్ని వర్గాలనూ నిలువునా ముంచావు - ధైర్యముంటే సెక్యూరిటీ లేకుండా కన్పించు.. ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టినా ఆశ్చర్యంలేదు (రైతుభరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి): ‘‘అధికారంలోకి రాగానే బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామన్నావు. డ్వాక్రా రుణాలనూ పూర్తిగా మాఫీ చేసే బాధ్యతను తీసుకుంటామన్నావు. ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం... ఉద్యోగం లేనివారికి రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నావు. గుడిసెలు లేకుండా ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామన్నావు. ఎన్నికల తర్వాత హామీలన్నీ విస్మరించావు. ఒక్కటంటే ఒక్క హామీనీ నెరవేర్చలేదు. మీ వైఖరిపై రైతులు, డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. ధైర్యముంటే ఇప్పుడు సెక్యూరిటీని పక్కనపెట్టి వీధుల్లో తిరగగలవా? అలా కనపడితే ప్రజలు రాళ్లతో కొట్టినా ఆశ్చర్యం లేదు’’ అని విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో జగన్ చేపట్టిన రెండోవిడత రైతు భరోసా యాత్ర సోమవారం ముగిసింది. చివరిరోజు ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డీ.హీరేహాళ్ మండలం కాదలూరులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత అదే గ్రామంలో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలముందు చంద్రబాబు ఇచ్చిన హామీ యూట్యూబ్‌లో భద్రంగా ఉందని జగన్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సెల్‌ఫోన్ తీసుకుని యూట్యూబ్ ఓపెన్‌చేసి చంద్రబాబు ప్రసంగాన్ని మైక్‌లో అందరికీ వినిపించారు. ఆ ప్రసంగం విన్న ప్రజలు... చంద్రబాబు మోసగాడని, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని తమను ముంచేశాడని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు హామీలు నెరవేర్చేవరకూ తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా జగన్ స్పష్టంచేశారు. ముఖాముఖిలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... 'ఎన్నికలకు ముందు రైతురుణాలు 87 వేల కోట్ల రూపాయలున్నాయి. గతంలో ఏడు శాతం వడ్డీ చెల్లించేవారు. ఇప్పుడు 14 శాతం అపరాధ వడ్డీతో కలిపి కేవలం వడ్డీ రూపంలోనే 14 వేల కోట్ల రూపాయల భారం పడింది. అయితే.. చంద్రబాబు రుణమాఫీకి కేటాయించింది 4,600 కోట్లు మాత్రమే. మూడోవంతు మాఫీకి కూడా ఆ మొత్తం సరిపోదు. డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. మహిళలకు తెలీకుండా పొదుపుసొమ్మును బ్యాంకర్లు అప్పుల్లో జమ చేసుకుంటున్నారు. బాబు మాత్రం రైతులు, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారని, తనకు శాలువాలు కూడా కప్పుతున్నారని బీరాలు పలుకుతున్నారు. చంద్రబాబు ఇటీవల ప్రాజెక్టుల వద్దకు తిరుగుతున్నారు. హంద్రీ-నీవా వద్దకు వెళ్లి తానే ప్రాజెక్టును నిర్మించానని చెబుతున్నారు. ఆయన సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో హంద్రీ-నీవాకు ముష్టి వేసినట్లు రూ. 13 కోట్లు విదిలించారు. దివంగత వైఎస్‌తోపాటు ఆ తర్వాతి ప్రభుత్వాలు రూ.5,800 కోట్ల ఖర్చు చేశాయి. మరో రూ.1100 కోట్లు ఖర్చుచేస్తే ‘అనంత’లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ బడ్జెట్లో రూ.212 కోట్ల మాత్రమే కేటాయించారు. ఇటీవల నేను కూడా హంద్రీ-నీవా పనులను పరిశీలించా. మల్యాల వద్ద ఉన్న 12 పంపుల్లో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. తక్కిన పంపులు ఎందుకు పనిచేయడం లేదని ఆరా తీశా. 23వ ప్యాకేజీ పనులు సీఎం రమేశ్ చేస్తున్నారని, 12 పంపులు వదిలితే కాలువ తెగిపోతుందని అధికారులు చెప్పారు. దీన్నిబట్టే పనులు ఎలా చేస్తున్నారో తెలుస్తోంది. పైగా నాలుగు పంపులతో నీళ్లు ఎత్తిపోసేందుకు రూ.250 కోట్లకుపైగా కరెంటు బిల్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. బాబు కేటాయించిన రూ.212 కోట్లు కరెంటు బిల్లులకే సరిపోకపోతే ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు? హంద్రీ-నీవానే కాదు.. గాలేరు-నగరితోపాటు చాలా ప్రాజెక్టుల్లో 87 శాతం పనులను వైఎస్ పూర్తి చేశారు. ఇప్పుడు బాబు వచ్చి కుళాయి తిప్పి నీళ్లు పట్టుకుంటున్నారు. పైగా ఎవరో పూర్తి చేసిన పనులను తానే చేశానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నీతి, నిజాయితీతో నెరవేర్చాలి. అప్పటివరకూ పోరాటం ఆగదు. మరింత గట్టిగా పోరాడతాం. ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ చివరి రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ ఆత్మహత్యకు పాల్పడిన బోయ ఆంజనేయులు కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. డీ.హీరేహాళ్ మండలం కాదలూరు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు(60) భార్య గంగమ్మను ఓదార్చారు. తనకున్న ఐదెకరాల పొలంలో పత్తిపంట వేసిన ఆంజనేయులు అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 4న పంటచేలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నాశనం చేశారు సార్ బ్యాంకులో 8తులాలు బంగారం తాకట్టుపెట్టి 80 వేల రూపాయల రుణం తీసుకున్నాం. దానికి 35 వేల వడ్డీ అయ్యింది. రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా రేషన్‌కార్డు నెంబర్ తీసుకురా అని బ్యాంకోళ్లు అంటాండారు. 15ఏళ్ల నుంచి ఉన్నకార్డు తీసేశారు. ఇప్పుడు కార్డు నెంబర్ కావాలంటే ఎట్టా తెచ్చేది? అసలు, వడ్డీ చెల్లించాలంటున్నారు, మమ్మల్ని నాశనం చేసిపెట్టారు. - అంజనమ్మ, పల్లెపల్లి రూపాయి కూడా మాఫీ కాలేదు మా సంఘంలో రూ. 80 వేలు తీసుకున్నాం. రూ. 40 వేలు వడ్డీ వేయడంతో మొత్తం రూ.లక్షా ఇరవై వేలైంది. రూపాయి మాఫీ కాలేదు సార్. వైఎస్ ఉన్నపుడు పావలావడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు మూడు రూపాయలపైన వడ్డీ పడుతోంది. ఇదేంటని అడిగితే చంద్రబాబును అడుగుపోండని బ్యాంకోళ్లు చెబుతున్నారు. ఇళ్లు, ఆస్తులు అమ్మి అప్పు చెల్లించండంటున్నారు. - పద్మజ, రాయదుర్గం -
ఈ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారు
కూడేరు : ‘చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు. దీంతో ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నార’ని ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా మంగళవారం కూడేరు బస్టాండ్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు రెన్యూవల్ కూడా చేసుకోలేకపోయారన్నారు. వడ్డీ భారం పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం నిర్వాకం వల్ల రైతులు కనీసం బ్యాంకు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వంపై పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, రాష్ర్ట ప్రచార కార్యదర్శి తలశిల రఘురామ్, ప్రధాన కార్యదర్శి అనంతవెంకట రామిరెడ్డి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
రేపట్నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 'భరోసాయాత్ర'ను నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హిందూపురం బహిరంగ సభకు వైఎస్ జగన్ హాజరవుతారు. సోమవారం మరకుంటపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన శేషప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం కొత్తకోటకు చేరుకుని రైతు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తారని తలశిల రఘురాం వివరించారు. -
22 నుంచి అనంతలో.. ‘రైతు భరోసా యాత్ర’
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ అనంతపురం అర్బన్: అప్పుల బాధను తట్టుకోలేక అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22 నుంచి ‘రైతు భరోసా యాత్ర’ నిర్వహించనున్నారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆ పార్టీ పోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసెంబ్లీలో ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ఆధారాలతో సమస్యను లేవనెత్తారని తెలిపారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే, వారికి భరోసా కల్పించేందుకు తానే స్వయంగా వె ళ్లి పరామర్శిస్తానని జగన్ ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఆ పరిణామంతో దిగొచ్చిన చంద్రబాబు.. రైతు ఆత్మహత్యలను ఒప్పుకున్నారన్నారు. తమ పార్టీ ఒత్తిడితోనే జిల్లాలో 29 మంది రైతు, 11 మంది చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటి వరకు 86 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని, వారి జాబితాను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు అందజేశామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. -
'వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటన ఖరారు'
హైదరాబాద్:రైతు భరోసా యాత్ర పేరుతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టనున్న పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈమేరకు సోమవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పర్యటన వివరాలను వెల్లడించారు. ఈనెల 22 నుంచి 26 వరకూ వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా హామీల అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం చెందారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి పేర్కొన్నారు. రైతులు తాకట్టు పెట్టిన బంగారం తెచ్చిస్తామన్న చంద్రబాబు వేలం వేస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్ 421 జీవో జారీ చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.