‘చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు.
కూడేరు : ‘చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు. దీంతో ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నార’ని ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా మంగళవారం కూడేరు బస్టాండ్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు రెన్యూవల్ కూడా చేసుకోలేకపోయారన్నారు.
వడ్డీ భారం పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం నిర్వాకం వల్ల రైతులు కనీసం బ్యాంకు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వంపై పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, రాష్ర్ట ప్రచార కార్యదర్శి తలశిల రఘురామ్, ప్రధాన కార్యదర్శి అనంతవెంకట రామిరెడ్డి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు.