నేటి నుంచి రైతు భరోసా యాత్ర | Ys jagan Raithu Barosa Yatra from today | Sakshi
Sakshi News home page

Jan 5 2017 7:16 AM | Updated on Mar 22 2024 10:48 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement