
రేపట్నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 'భరోసాయాత్ర'ను నిర్వహించనున్నారు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 'భరోసాయాత్ర'ను నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి కొడికొండ చెక్పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారు.
లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హిందూపురం బహిరంగ సభకు వైఎస్ జగన్ హాజరవుతారు. సోమవారం మరకుంటపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన శేషప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం కొత్తకోటకు చేరుకుని రైతు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తారని తలశిల రఘురాం వివరించారు.