'బాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం' | YS Jagan Mohan Reddy give 4 days time to AP Govt on Municipal Employees Strike | Sakshi
Sakshi News home page

Jul 23 2015 3:37 PM | Updated on Mar 21 2024 8:58 PM

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న ఆయన మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వానికి 4 రోజుల సమయం ఇస్తున్నామని, ఈలోపు స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్ చేపడతామన్నారు. శుక్రవారం జరిగే మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడికి వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుడు వెంకయ్య గుండెపోటుతో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమంటే ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement