అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం | YS Jagan Mohan Reddy Raitu bharosa yatra continues on 4th day in anantapur district | Sakshi
Sakshi News home page

అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం

Jan 9 2016 10:13 AM | Updated on Jul 25 2018 4:09 PM

అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం - Sakshi

అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం

రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

అనంతపురం:  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసాయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 2016 డైరీని వైఎస్ జగన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను వైఎస్ జగన్కి వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులాపతి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసం నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ అనంతపురంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారం నాలుగో రోజుకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement