breaking news
raicode
-
చెకింగ్ ఇన్స్పెక్టర్పై చెప్పులతో దాడి.. అసలేం జరిగిందంటే..!
సాక్షి, సంగారెడ్డి: రాయికోడ్‌లో ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్పై దాడి జరిగింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపారు. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని చెకింగ్ ఇన్స్పెక్టర్ గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు నమోదు కాకుండా ఉండేందుకు రూ. 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో చెకింగ్ ఇన్స్పెక్టర్పై ప్రయాణికులు, కండక్టర్ చెప్పులతో దాడి చేశారు. -
రాయికోడ్ మండలంలో 205 మి.మీ వర్షపాతం
రాయికోడ్ : మండలంలో జూలై నెలలో 205 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి 225 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్‌లో నిరాశ పరిచిన వర్షాలు జూలైలో ఊరటనిచ్చాయి. జూన్ నెలలో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 133 మిల్లీమీటర్లు కురిసింది. జూలై 6న 24 మిల్లీమీటర్లు, 21న 30 మిల్లీమీటర్లు, 22న 80 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మండలంలో విస్తారంగా కురిసిన వర్షాలతో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. పంటపొలాలు పచ్చగా దర్శనమిస్తున్నాయి. రైతులు ఉత్సాహంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని హస్నాబాద్ చెరువు పొంగిపొర్లుతోంది. రెండేళ్లుగా సరైన వర్షాలు లేక కరువును చవిచూసిన జనం చెరువులు నిండటంతో వాటిని వీక్షించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టులోనూ ఆశించన మేర వర్షాలు కురిసి తమ అంచనాలకు తగ్గట్టుగా పంటల దిగుబడులు రావాలని ఆశిస్తున్నారు. మండలంలో అత్యధికంగా ఈ ఏడాది 7,500 హెక్టార్లలె పత్తి పంటను సాగు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన 14 వేల మంది రైతుల్లో 10 వేల మంది పత్తి సాగు చేశారు. 5 వేల మంది రైతులు 4,500 హెక్టార్లలో సోయాబీన్, కంది, పెసర, మినుము, జొన్న తదితర పంటలను సాగు చేశారు.


