breaking news
Pujita actress
-
బ్లాక్ అండ్ వైట్లో పూజిత పొన్నాడ సూపర్ క్యూట్ ఫోటోలు
-
తెలుగు పిల్ల క్యూట్ అందాలు.. చూపులతోనే కట్టిపడేస్తున్న పూజిత పొన్నాడ ఫొటోస్
-
Poojitha Ponnada Latest Photos: చీర అందాలతో కట్టిపడేస్తున్న తెలుగమ్మాయి పూజిత పొన్నాడ (ఫొటోలు)
-
‘రంగస్థలం’ఫేమ్ పూజిత పొన్నాడ బ్యూటీఫుల్ ఫోటోలు
-
హీరోయిన్ పూజిత పొన్నాడ ఫోటోలు
-
నాకు విడాకులు వద్దు
► నా భర్త విజయ్ గోపాల్ను విచారించండి ► పోలీసులతో న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు ► ప్రాణభయం ఉంది: సినీ నటి పూజిత కవాడిగూడ: తాను తన భర్త నుంచి విడాకులు కోరుకోవడం లేదని, తనకు సెటిల్మెంట్ అవసరం లేదని, తనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణ భయం ఉన్నందున తనకు, తన బిడ్డకు న్యాయం చేసేందుకు తన భర్త విజయ్ గోపాల్ను పోలీసులు విచారించాలని సినీ నటి పూజిత అన్నారు. గురువారం ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తన భర్త విజయ్ గోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. అయితే తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఐఏఎస్ అధికారిణి రేఖారాణి పేరు స్పష్టంగా రాసినప్పటికీ.. ఎఫ్ఐఆర్లో ఆమె పేరు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారం వెనుక మరో సీనియర్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఉన్నారని ఆరోపించారు. తనకు విజయ్ గోపాల్, రేఖారాణిల నుంచి ప్రాణభయం ఉందన్నారు. విజయ్ గోపాల్, తాను భార్యభర్తలమనేందుకు కీలకమైన ఆధారాలను పోలీసులకు అందజేశానన్నారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు, తనబిడ్డకు న్యాయం చేయాలని కోరారు.