breaking news
public market
-
వెంచర్ క్యాపిటల్‌కు బై ఐపీఓకు.. హాయ్
ఇటీవల కొద్ది రోజులుగా చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు తదుపరి దశ నిధుల సమీకరణలో పబ్లిక్ రూట్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే ఐపీవోకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండింగ్, టాలెంట్, టెక్నాలజీ వృద్ధికి వీలుంటుందని భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ప్రైమరీ మార్కెట్లు రెండేళ్లుగా రికార్డు నిధుల సమీకరణ ద్వారా కదం తొక్కుతుండటంతో చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు లిస్టింగ్‌వైపు చూస్తున్నాయి. ఇందుకు దేశీయంగా కనిపిస్తున్న ఇన్వెస్టర్ల ఆసక్తి, అత్యధిక లిక్విడిటీ తోడ్పాటునిస్తున్నాయి. ఫలితంగా తొలి, మలిదశలలో వృద్ధి నిలుపుకునేందుకు.. తద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం పబ్లిక్ మార్కెట్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. వెరసి ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే స్టాక్ ఎక్సే్ఛంజీలలో నమోదయ్యేందుకే చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు ఆసక్తిని చూపుతున్నాయి.. కాగా.. ఇంతక్రితం చాలా స్టార్టప్‌లు బిలియన్ డాలర్ల కంపెనీలు(యూనికార్న్)గా ఎదిగిన తదుపరి మాత్రమే లిస్టింగ్‌వైపు చూసేవి. అంతకుముందు పెట్టుబడుల కోసం పీఈ, తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తుండేవి. అయితే ఇటీవల ఈ ట్రెండ్‌కు విరుద్ధంగా చాలా ముందుగానే ఐపీవో బాట పడుతుండటం గమనార్హం! బ్రాండ్ బిల్డింగ్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండ్ బిల్డింగ్తోపాటు.. టాలెంట్‌ను ఆకట్టుకోవడం, కొత్త టెక్నాలజీలపై గురి పెట్టడం తదితరాలకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కంపెనీకి సరైన విలువ లభించడం, పారదర్శక పాలన, తగినంత లిక్విడిటీకి వీలుండటం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశాయి. వెరసి రూ. 300–400 కోట్ల ఆదాయ స్థితికి చేరిన స్టార్టప్‌లు ఐపీవోకు సిద్ధపడుతున్నట్లు తెలియజేశాయి. రెండేళ్లుగా అటు ఎస్ఎంఈ, ఇటు మెయిన్ బోర్డులో రికార్డ్‌స్థాయిలో కంపెనీలు లిస్టవుతుండటం స్టార్టప్‌లకు జోష్‌నిస్తున్నట్లు వివరించాయి.జాబితా ఇలా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్పట్ల ఆసక్తిగా ఉన్న మధ్యస్థాయి స్టార్టప్‌ల జాబితాలో స్క్రిప్‌బాక్స్, మైగేట్, ఫ్యాబ్‌హోటల్స్, క్లాస్‌ప్లస్ ముందువరుసలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గత నెల(2025 డిసెంబర్)లో ఫ్యాబ్‌హోటల్స్ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. రానున్న 6 నెలల్లో లిస్టయ్యేందుకు స్క్రిప్‌బాక్స్ సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రూ. 300–600 కోట్ల సమీకరణ ప్రణాళికలున్న స్టార్టప్‌లు అధికంగా ఐపీవో బాటవైపు చూస్తున్నట్లు ఇన్‌క్రెడ్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఇండ్వార్ పేర్కొన్నారు. రూ. 600–700 కోట్ల పరిమాణంలో నిధుల సమీకరణపై కన్నేసిన స్టార్టప్‌లు సైతం అధికంగా లిస్టింగ్‌కు సిద్ధపడుతున్నట్లు ప్రోజస్ గ్రూప్ గ్లోబల్ హెడ్ గజానన్ శుక్లా తెలియజేశారు. ఇదీ తీరు తొలి, మలి దశ స్టార్టప్‌లు ప్రధానంగా ఏంజెల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా నిధు లు సమీకరిస్తుంటాయి. ఈ జాబితాలో సీక్వోయా, యాక్సెల్, బ్లూమ్ వెంచర్స్, కళారి, వై కాంబినేటర్, లెట్స్వెంచర్, ఫండ్ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆపై ప్రయివేట్ ఈక్విటీ సంస్థలను సైతం సంప్రదిస్తుంటాయి. నిజానికి 2019లో మధ్యస్థాయి స్టార్టప్‌లు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 145 రౌండ్ల ద్వారా మైనారిటీ వాటాలు విక్రయించాయి. తద్వారా 5.7 బిలియన్ డాలర్లు సమకూర్చుకు న్నాయి. తదుపరి 2020, 2022లలో నిధుల సమీకరణ మరింత పుంజుకున్నప్పటికీ 2025లో నీరసించింది. 2019 స్థాయిలోనే 152 రౌండ్ల ద్వారా 5.4 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఇందుకు సంస్థలు పెరిగినప్పటికీ ఐపీవో బాట పట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోసహా సౌర విద్యుత్ రంగంలో కార్పొరేట్ నిధులు అంచనాలను మించి వెల్లువెత్తుతున్నాయి. క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్, కన్సలి్టంగ్ కంపెనీ మెర్కమ్ క్యాపిటల్ గ్రూప్ ప్రకారం.. వెంచర్ క్యాపిటల్, పబ్లిక్ మార్కెట్, డెట్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలోకి 112 డీల్స్‌తో రూ.1,68,720 కోట్ల నిధులు వచ్చి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండడం విశేషం. 2020 జనవరి–సెపె్టంబర్లో 72 డీల్స్‌తో రూ.57,670 కోట్ల నిధులను ఈ రంగం అందుకుంది. 2010 తర్వాత పెట్టుబడుల విషయంలో ఈ ఏడాది ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్సింగ్ ద్వారా 23 డీల్స్‌తో రూ.46,620 కోట్ల నిధులు వచ్చి చేరాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు 39 డీల్స్ ద్వారా రూ.16,280 కోట్లు పెట్టుబడి చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 466 శాతం వృద్ధి. కొనుగోళ్లు, విలీనాలు 83 నమోదయ్యాయి. -
విస్తరణకు మోక్షం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు మోక్షం లభించింది. భూసేకరణకు అవసరమైన నిధుల కోసం రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫైలును రాష్ట్ర కేబినెట్ శుక్రవారం పరిశీలించింది. ఎట్టకేలకు రూ.280 కోట్ల నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. వీటిలో రూ.120 కోట్లు భూసేకరణకు కేటాయించాలని, మిగిలిన రూ.160 కోట్లతో విమానాశ్రయంలో వసతులు కల్పించాలని రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 400 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. దీనిపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి రెండేళ్ల క్రితం పంపారు. భూసేకరణకు నిధులు లేకపోవటంతో ఈ ఫైలు కదలలేదు. నిధులు విడుదలైతే భూసేకరణకు జిల్లా యంత్రాంగం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు నిర్వాసితులతో పలుమార్లు చర్చలు జరిపారు. తమ భూములు ఇవ్వటానికి వారు ససేమిరా అంటున్నారు. అప్పట్లో బయట మార్కెట్ విలువకు, ప్రభుత్వ మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులు సహకరించలేదు. కొద్దిరోజుల క్రితం పార్లమెంటులో భూసేకరణకు కొత్త చట్టం ఆమోదం లభించటంతో నిర్వాసితులు తమ భూములు ఇవ్వటానికి ముందుకు వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆధునిక వసతుల కల్పనకు మార్గం సుగమం.. విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించేందుకు చేసిన ప్రతిపాదనలు ప్రస్తుతం అమలులోకి రానున్నాయి. రూ.50 కోట్లతో కొత్తగా టెర్మినల్ భవనం నిర్మించటానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా టె ర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం 50 మంది కూర్చోవడానికి వినియోగిస్తున్న టెర్మినల్ భవనాన్ని 300 మంది కూర్చునేలా విశాలమైన హాలు నిర్మాణంతో విస్తరించనున్నారు. ప్రయాణికులు సేదతీరేందుకు అవసరమైన రిఫ్రెష్మెంట్ సెంటర్లు, రెస్టారెంట్లు, పుస్తక విక్రయ కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. టిక్కెట్ విక్ర య కౌంటర్ల సంఖ్య పెంచటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. టెక్నికల్ బ్లాక్‌ను కూడా విస్తరిస్తారు. పెరగనున్న సర్వీసులు గన్నవరం విమానాశ్రయంలో సర్వీసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయానికి న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా ఆరు సర్వీసులు నడుస్తున్నాయి. వీటితోపాటు వచ్చే నెల నుంచి ఎయిర్‌కోస్తా మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది. ఎయిర్‌కోస్తా గన్నవరం కేంద్రంగానే బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు తమ సర్వీసులు నడపాలని యోచనలో ఉంది. విస్తరణ జరిగి టెర్మినల్ భవనం పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.


