breaking news
pregnant suside
-
సర్పంచ్‌గా అవకాశం ఇవ్వలేదని గర్భిణి ఆత్మహత్య
సాక్షి, అశ్వారావుపేట రూరల్: సర్పంచ్‌గా పోటీచేసే అవకాశం ఇవ్వలేదనే మనస్తాపానికి గురైన ఓ గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఊట్లపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామానికి చెందిన రెబక్కారాణి(26)ని టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దింపేందుకు స్థానిక నాయకులు కుటుంబ సభ్యులతో చర్చించి ఆమె వివరాలు తీసుకున్నారు. అయితే ఈమె ఏడు నెలల గర్భిణి కావడంతో రెబక్కారాణి వదిన(సోదరుడి భార్య) సాధు జ్యోత్స్నబాయిని బరిలోకి దింపారు. ఈనెల 25న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో జ్యోత్స్నబాయి సర్పంచ్‌గా గెలుపొందారు. కాగా, తనకు వచ్చిన అవకాశాన్ని దక్కకుండా చేశారంటూ జ్యోత్స్నబాయి నామినేషన్ వేసిన రోజు నుంచి రెబక్కారాణి కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతోంది. సోమవారం కూడా తన అన్న, తండ్రితో తీవ్రంగా వాగ్వాదం జరిగింది. ఆ కోపంతోనే తన ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో బయటకు వెళ్లిన భర్త నరేంద్ర కాసేపటి తర్వాత ఇంటికి వెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో పక్క ఇంట్లోనే ఉన్న మామ, బావమరుదులను పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి రెబక్కారాణి మృతి చెంది ఉంది. మృతురాలికి భర్తతో పాటు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. స్థానిక ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తెతో కలిసి గర్భిణి ఆత్మహత్య
► వరకట్న వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు కోవూరు: తన మూడేళ్ల కుమార్తెతో కలిసి నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కోవూరులోని కోనమ్మతోటలో శనివారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం మేరకు.. కొడవలూరు మండలం రామన్నపాళెంకు చెందిన చెంతాటి వెంకటరమణయ్య, సుధామణి దంపతుల కుమార్తె అనుచందన (20)కు కోవూరు కోనమ్మతోటక చెందిన జ్యోతి శంకర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఆ సమయంలో రూ.3 లక్షల నగదు, 30 సవర్ల బంగారంతో పాటు రెండు కేజీల వెండి వస్తువులను కట్నంగా అందజేశారు. అదనంగా రూ.80 వేల విలువ చేసే బైక్‌ను కానుకగా కొనిచ్చారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి మూడేళ్ల రుషిక అనే కుమార్తె ఉంది. సుధామణి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం ఆమె వివాహానికి ముందే నుంచే హైదరాబ్‌లోని మల్కాజ్‌గిరికి వలస వెళ్లారు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి అయిన అనుచందన తన కుమార్తె రుషికతో కలిసి నెల క్రితం హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. శంకర్ మాత్రం కోవూరులోనే తల్లిదండ్రుల వద్ద ఉన్నాడు. అనుచందన, ఆమె తల్లి సుధామణి, కుమార్తె రుషికతో కలిసి శనివారం ఉదయం కోవూరుకు చేరుకున్నారు. కుమార్తెను అనుచందన, మనుమరాలు రుషికను కోవూరు అత్తారింట్లో వదిలిపెట్టి సుధామణి రామన్నపాళెంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటికే ఏమైందో ఏమో తెలియదు కానీ సుధామణి మార్గం మధ్యలో ఉండగానే అనుచందన, రుషిక ఉరేసుకుని చనిపోయారని శంకర్ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో సుధామణి గుండెలు అదిరేలా రోదిస్తూ తిరిగి కుమార్తె ఇంటికి పరిగెత్తింది.అనుచందన రుషికను తన బెడ్రూంలోకి తీసుకెళ్లి ఉరివేయడంతో పాటు తాను ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్నారు. ఎంత సేపటికి గడి తీయకపోవడంతో శంకర్ కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి తలుపులు పగలుగొట్టారు. విగతజీవులుగా తల్లికుమార్తెలను చూసి గెండెలు పగిలేలా రోదించారు. డబ్బులు ఇస్తేనే ఫోన్లో మట్లాడించేవాడు.. తల్లిబిడ్డ మృతి వివరాలను తెలుసుకున్న సుధామణి బంధువులు రామన్నపాళెం నుంచి కోవూరుకు చేరుకున్నారు. శంకర్‌తో పాటు కుటుంబ సభ్యులే తల్లి, బిడ్డ ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అనుచందన భర్త శంకర్ అడిగినప్పుడు డబ్బులు ఇస్తేనే హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించే వాడని, లేకుంటే ఆ అవకాశమే లేకుండా చేసేవాడని బంధువులు దుమ్మెత్తి పోశారు. హైదరాబాద్ మల్కాజ్గిరి సెంటర్ వంద గజాల స్థలం ఉందని, దాన్ని అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని నిత్యం వేధించేవాడు. ప్రస్తుతం స్థలం ధర ఎక్కువ లేదని మంచి రేటు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పిన వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మమ్మ నీతో వస్తాను.. హైదరాబాద్ నుంచి తమతో పాటు సింగరాయకొండకు వస్తున్న అనుచందన పెద్దమ్మ శైలజతో తాను నీతో వస్తానని చిన్నారి రుషిక అల్లరి చేసింది. ఆ సమయంలో అనుచందన రుషికను లాలించి బుజ్జగించి కోవూరు తీసుకువచ్చిందని శైలజ చేసిన రోదన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.