Pre-bid meeting
-
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీకి కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ పట్ల పదుల సంఖ్యలో కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఎన్ఎల్సీ ఇండియా, వేదాంత, హిందుస్థాన్ జింక్ సహా 25 కంపెనీలు ప్రభుత్వం నిర్వహించిన బిడ్ ముందస్తు సమావేశంలో (ప్రీ బిడ్) పాల్గొన్నాయి. మంగళవారం (7న) ఈ సమావేశం జరిగింది. దేశీయంగా సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రూ.7,280 కోట్ల ప్రోత్సాహకాలతో భారీ పరిశ్రమల శాఖ ఒక పథకాన్ని తీసుకురావడం గమనార్హం.6,000 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎంటీపీఏ) సామర్థ్యంతో తయారీ కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వనిస్తూ మార్చి 20న ప్రకటన జారీ చేసింది. గరిష్టంగా ఐదు సంస్థలను బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ప్రతీ సంస్థ 1,200 ఎంటీపీఏ సామర్థ్యంతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి ఉత్పత్తి సామర్థ్యం 6,000ఎంటీపీఏగా ఉంటుంది. బిడ్డింగ్ తేదీ మే 28 కాగా, సాంకేతిక బిడ్లను మే 29న తెరవనున్నారు.‘‘ఆశావహ బిడ్డర్లకు స్కీమ్ వివరాలు, ముఖ్యమైన నిబంధనలు, బిబ్డింగ్ ప్రక్రియల గురించి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చాం. బిడ్డర్లు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించాం. ఈ నెల 22 వరకు తమ సందేహాలను ఈ–మెయిల్ ద్వారా తెలియజేయొచ్చని సూచించాం’’అని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. బిడ్డింగ్ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ఎల్రక్టానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల అవసరం ఎంతో ఉంటుంది. -
స్విస్ చాలెంజ్‌పై ఏడు కంపెనీల ఆసక్తి
ప్రీ బిడ్ సమావేశంలో సందేహాల వ్యక్తీకరణ సాక్షి, అమరావతి: సీడ్ రాజధానిలోని స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పిలిచిన బిడ్‌పై ఏడు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. దీనికి సంబంధించి ప్రీ బిడ్ సమావేశం సోమవారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, రాంకీ గ్రూపు, అలియన్స్ ఇన్ఫ్రా, చైనాకు చెందిన జీఐఐసీ, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కంపెనీలు పాల్గొన్నాయి. సీడ్ రాజధానిలో 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన కన్సార్టియం అసెండాస్-సిన్‌బ్రిడ్జి అండ్ సెంబ్ కార్ప్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ఇంతకంటె మెరుగైన ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ స్విస్ చాలెంజ్ విధానంలో గత నెల 17న సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్న ఏడు కంపెనీలూ తమ సందేహాలు వ్యక్తం చేశాయి. వీటిని లిఖిత పూర్వకంగా ఇస్తే వాటికి తగిన సమాధానాలను ఇ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో పొందుపరుస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను చాలెంజ్ చేస్తూ సెప్టెంబర్ 1లోపు ఎవరైనా బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉంది. సమావేశంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ రామమనోహరరావు, ఎకనామిక్ డెవలప్మెంట్ డెరైక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


