breaking news
ppp mode
-
AP: పేదలకు అందని ద్రాక్షగా వైద్య విద్య!
అధికారం అంటే కేవలం రాజకీయ ఆట కాదు – ఇది పేదల జీవితాలను మార్చే, వారి కలలకు ఊపిరి పోసే బాధ్యత. వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ, ‘నవ రత్నాలు’ అనే తొమ్మిది స్తంభాల ద్వారా విద్య, ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడప వద్దకు చేర్చింది. ఈ పథకాలు పేదలకు సమాజంలో గౌరవం పెంచడమే కాదు... కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలను నిధుల కేటాయింపు లేకుండా చేసి వాటిని నీటి మీద రాతలుగా మార్చింది. ముఖ్యంగా వైద్యరంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టి వైద్యాన్ని పేదలకు దూరం చేస్తోంది. ఇందుకు మంచి ఉదాహరణ మెడికల్ కాలేజీలను ‘పబ్లిక్ – ప్రైవేట్ పార్ట్నర్షిప్’ (పీపీపీ) పేరుతో 66 ఏళ్లు ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనుకోవడం!వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–2024 మధ్య నవరత్నాలను నూటికి నూరుశాతం అమలు పరచి ఏపీలో సుస్థిర సమగ్ర అభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో వైఎస్సార్సీపీ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2,485 ఎంబీబీఎస్ సీట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023–24 నాటికి 5 కాలేజీలు ప్రారంభం కాగా, 750 సీట్లు అందు బాటులోకి వచ్చాయి. ‘ప్రతి పార్లమెంటరీ నియో జకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ’ అనే లక్ష్యం స్థాని కంగా నాణ్యమైన వైద్య శిక్షణను నిర్ధారించింది. ‘ఆరోగ్యశ్రీ’ పథకం పేదలకు ఉచిత వైద్య సేవలను అందించి, ఆర్థిక భారం లేకుండా చికిత్సలు అందేలా చేసింది.అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటైజేషన్ విధానం ఏపీలో పేదల ఆశలకు పెను ముప్పుగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ మోడల్ కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం పేదలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కాలేజీలు ఏటా తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్లను అందించాయి. పేదలకు వైద్య విద్యను సరసమైనదిగా చేశాయి. కానీ, ప్రైవేటైజేషన్ తర్వాత ఫీజులు కేటగిరీ ఏ (కన్వీనర్ కోటా) సీటు రూ. 5–10 లక్షలు, కేటగిరీ బీ (మేనేజ్మెంట్ కోటా) సీటు రూ. 15–20 లక్షలకు చేరవచ్చని అంచనా. ఒక ఎంబీబీఎస్ కోర్సుకు రూ. 27.5–110 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. ఇంత అధిక ఫీజులు పేదలకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తాయి.ప్రజా ఆరోగ్య వేదిక (పీఏవీ) ఈ ప్రైవేటైజేషన్ 1,500 ఎంబీబీఎస్ సీట్లను ప్రభావితం చేస్తుందనీ, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్ కోటాను 50% వరకు తగ్గి స్తుందనీ హెచ్చరిస్తోంది. ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణలో 50% సీట్లను మార్కెట్ రేట్లతో విక్ర యించుకోవచ్చు, పైగా ప్రభుత్వ కాలేజీల కంటే 10–20 రెట్లు ఎక్కువగా ఫీజులు ఉంటాయి. ఈ చర్య పేదలకు వైద్యవిద్యను పూర్తిగా దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. సేవా– ఆధారిత వైద్యుల సంఖ్యను తగ్గిస్తుంది. ఉదాహరణకు, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో హాస్పిటల్స్‌కు అప్పగించిన తర్వాత సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇదే ధోరణి మెడికల్ కాలేజీల్లోనూ కనిపిస్తే, పేదలకు వైద్య సేవలు అత్యంత ఖరీదైనవిగా మారతాయి.ఈ ప్రైవేటైజేషన్ విధానాన్ని విజయవాడలో 2025 ఏప్రిల్‌లో జరిగిన పీఏవీ సదస్సు ‘క్రూరం’ అని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ నలుగురిలో ఒకరు సరసమైన, నాణ్యమైన వైద్యం అందక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారనీ, ప్రభుత్వ ప్రైవేటైజేషన్ పాలసీ ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనీ హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లో 10 ట్రామా సెంటర్లను ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఖర్చులు 10–20 రెట్లు పెరిగాయి. ఇదే ఆంధ్రలో జరిగితే పేదలు ఉచితంగా పొందాల్సిన వైద్య సేవలను కోల్పోతారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సూపర్–స్పెషాలిటీ ఆసుపత్రులను పీపీపీ మోడ్‌లో నిర్మించాలనే కూటమి ప్రభుత్వ మరో ప్రణాళిక కూడా ఆరోగ్య రంగాన్ని వాణిజ్యీకరణ వైపు నడిపించనుంది. ఇది ఆరోగ్యశ్రీ వంటి పథకాలను బలహీనపరుస్తుంది. ఈ విధానం ప్రజల ఆరోగ్యం, ఆశల కంటే కార్పొరేట్ లాభా లకు ప్రాధాన్యం ఇస్తుంది.చదవండి: ఎవరి కోసం ఈ ఒప్పందం?ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. సొంత లాభాల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టే విధానాలను మేధావులు, ప్రజాస్వామ్య వాదులు తిరస్కరించాలి.- తలకోల రాహుల్ రెడ్డిసామాజిక ఆర్థిక రంగాల విశ్లేషకుడు -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మరో 30 ఏళ్లు జీఎంఆర్‌కే
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహాన బాధ్యతలు మరో ముప్పై పాటు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. ఈ మేరకు సివిల్ ఏవియేష్ అథారిటీ ఇందుకు సంబంధించిన పత్రాలను జీఎంఆర్‌కు అందచేసింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 21 మిలియన్ మంది ప్రయాణిస్తుండగా 1.50 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. గతంలో బేగంపేటలో ఎయిర్‌పోర్టు ఉండగా శంషాబాద్ వద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులు 2004లో ప్రారంభించారు. 31 నెలల పాటు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2008లో ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. పీపీపీ ఒప్పందంలో భాగంగా అప్పటి నుంచి 2038 వరకు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. తాజాగా మరో ముప్పై ఏళ్ల పాటు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్‌కి కట్టబెడుతూ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు 2068 మార్చి 23 వరకు జీఎంఆర్ ఆధీనంలో ఉండనుంది. ఇటీవల ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు భారీ ఎత్తున జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఏడాదికి 35 మిలియన్ మంది ప్రయాణించేలా ఇక్కడ సౌకర్యాలను మెరుగు పరుస్తోంది. చదవండి: విస్తరణ బాటలో ఫనాటిక్స్ -
మారటోరియం మరో రెండేళ్లు
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులపై గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని (మారటోరియం)ను కొన్ని షరతులతో ఏఐసీటీఈ మరో రెండేళ్లు పొడిగించింది. దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీటీఈ ఓ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక మేరకు కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చింది. డిమాండ్‌కు మించి కాలేజీలు, సీట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మారటోరియంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. పీపీపీ మోడ్‌తో సంప్రదాయ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీలతో ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ట్రస్టు, సొసైటీ, కంపెనీగా నమోదైన మూడేళ్లలో రూ.5 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన పరిశ్రమలు స్థాపించే సంస్థలకు మినహాయింపు వర్తిస్తుంది. గత ఏడాది 100 లోపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్)లో చోటు సాధించి 10 వేల మంది విద్యార్ధులతో 25 ఏళ్లుగా ఇతర విద్యాసంస్థలు నడుపుతున్న దాతృత్వ సంస్థలకు కూడా మినహాయింపునివ్వనున్నారు. ప్రాంతీయ భాషల్లోకి సాంకేతిక పదాలు సాంకేతిక విద్యా కోర్సులను ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాస్త్రీయ, సాంకేతిక పదాలను ఆయా భాషల్లోకి అనువదించేలా ఏఐసీటీఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (సీఎస్టీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్యా కోర్సులను బోధించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. (చదవండి: ‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు) -
ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుగా భారత్ నెట్
న్యూఢిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాల్లోని నివాసిత గ్రామాలకు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం)మోడల్ ద్వారా భారత్ నెట్ అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం కోసం, సేవలు అందించడానికి కేంద్రం ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చింది. "దేశంలో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీటీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు" కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే "16 రాష్ట్రంలోని 3,61,000 గ్రామాల్లో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీటీ అందించేందుకు పీపీపీ పద్దతిలో ప్రపంచ స్థాయిలో బిడ్డింగ్ నమూనాను అమలు చేయాలి" అని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. భారతదేశంలోని అన్ని గ్రామాల్లో సమాచార విప్లవం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో అన్ని గ్రామాలు 1,000 రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ తో అనుసంధానించబడతాయని అన్నారు.భారత్ నెట్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. 2021, మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని కోసం ఇప్పటికే రూ.42,068 కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ పథకానికి తాజాగా రూ.19,041 కోట్లు కేటాయించడంతో దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది. -
ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీకరణ ప్రక్రియ ముమ్మరం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్న ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమైంది. వీటి నిర్వహణ కోసం పది కంపెనీల నుంచి మొత్తం 32 సాంకేతిక బిడ్స్‌ను ఏఏఐ స్వీకరించింది. గౌహతి, తిరువనంతపురం, లక్నో, మంగళూర్, అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాల నిర్వహణ, ఆపరేషన్స్, అభివృద్ధి కోసం అంతర్జాతీయ బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ కింద బిడ్లను ఆహ్వానించింది. ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణ కోసం మొత్తం పది కంపెనీల నుంచి 32 సాంకేతిక బిడ్స్ అందాయని ఏఏఐ వర్గాలు వెల్లడించాయి. సాంకేతిక బిడ్స్‌కు ఈ నెల 14 ఆఖరు తేదీ కాగా, ఈనెల 28న ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఏఏఐ తెరవనుంది. గెలుపొందిన బిడ్డర్ల వివరాలను ఈనెల 28న ఏఏఐ వెల్లడిస్తుంది. ప్రయాణీకులు సహా వివిధ భాగస్వాములకు అంతర్జాతీయ మౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధిపరచేందుకు ఏఏఐ ఈ చర్యలు చేపట్టింది. -
ఇంటర్నేషనల్ స్కూళ్లూ ‘ప్రైవేటుకే’
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రతిపనికి ప్రైవేట్ సంస్థల్నే ఆశ్రయిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు బాధ్యతను వారికే కట్టబెట్టనుంది. పేరుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయించినా, వాటిల్లో ప్రైవేట్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉండనుంది. నర్సరీ నుంచి డిగ్రీ వరకూ ఉండే ఈ స్కూళ్లను తొలిదశలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ జిల్లా అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 15 ఎకరాల్లో, నెల్లూరు జిల్లా బొడ్డువారిపాలెంలో 16.45 ఎకరాల్లో స్కూళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పీపీపీ విధానంలో స్కూళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భారీ స్థాయిలో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ జిల్లాలో భూమిని 33 సంవత్సరాలు లీజుకు ఇవ్వనున్నారు. ఎకరానికి తొలుత రూ. లక్ష లీజుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఆరు సంవత్సరాలకోసారి పది శాతం చొప్పున లీజు పెంపు నిబంధన విధించింది. ఈ ఒప్పందంలో ప్రభుత్వ వాటా, ఆదాయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే స్కూలు ఫీజులన్నీ ప్రైవేట్ సంస్థలే నిర్ణయిస్తాయనే నిబంధనను చూస్తే.. ప్రైవేటుకే అధిక లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో రెసిడెన్షియల్ సదుపాయంతో పాటు, పలు రకాలైన క్రీడా మైదానాలు ప్రైవేటు సంస్థలే ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే నిబంధన కూడా ఉంది. పర్యాటకంలోనూ ‘పీపీపీ’ ఇక పర్యాటక ప్రాజెక్టులను కూడా పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ. 6,000 కోట్లు వ్యయంతో పలు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రూ. 1,020 కోట్లతో ఎకో టూరిజం, రూ. 563 కోట్లతో బీచ్ టూరిజం, రూ. 1,265 కోట్లతో అడ్వెంచర్ అండ్ రిక్రియేషన్, రూ. 74 కోట్లతో హెరిటేజ్ టూరిజం ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. రూ. 781 కోట్లతో టెంపుల్ టూరిజం, రూ. 1,026 కోట్లతో బుద్ధిస్ట్ థీమ్ ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఆమోదం తెలిపేందుకే ఇటీవల ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అమ్మకానికి కొత్త రాజధాని ఆస్తులు?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి నిధులు ఎక్కడినుంచి తేవాలన్న విషయంలో టీడీపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పీపీపీ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీజీటీఎం ఉడాను రద్దు చేసి దాని స్థానంలో సీఆర్టీఏ అనే ఒక సంస్థను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. తాజాగా బిల్డ్ ఏపీ అనే కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికి మూలధనాన్ని, ఆస్తులను సృష్టించి.. వాటి ద్వారా అప్పులు తెచ్చుకోవాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం బాండ్లు జారీ చేయడం, విరాళాలు స్వీకరించడం.. ఇలా పలు మార్గాల ద్వారా నిధులు సేకరించబోతోంది. భూములను రైతుల నుంచి తీసుకుని.. వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నది సర్కారు ఆలోచన. అయితే.. ఈ మార్గాల్లో నిధులు సేకరించినా అవి ఏ మాత్రం సరిపోకపోవడం వల్లే ఇప్పుడు పీపీపీ పద్ధతి గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
పీపీపీ విధానంలో ఏపీ వైద్యసేవలు
త్వరలో అన్ని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, వైద్యపరీక్షల విభాగాలను ఔట్ సోర్సింగ్‌కు ఇస్తామని ఆయన చెప్పారు. ఖరీదైన వైద్య విభాగాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా పీపీపీ విధానాన్ని ఆలోచిస్తున్నట్లు వివరించారు. ఏపీకి పోలియో రహిత రాష్ట్రంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ అవార్డు వచ్చిందని, 2008లోనే ఏపీ పోలియో రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. మెడికల్ కౌన్సెలింగ్‌పై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఫీజులు పెంచాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు కోరుతున్నాయని, రెండు రోజుల్లో ఫీజులపై నిర్ణయం తీసుకుని మెడికల్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని ఆయన అన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలలో ఆంద్రప్రదేశ్‌లో పర్యటిస్తారని కామినేని శ్రీనివాస్ తెలిపారు. బీజేపీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటామని, బలమైన, గతంలో వివాద రహిత సీనియర్ నేతలను బీజేపీలో చేర్చుకుంటామని ఆయన అన్నారు. అమిత్ షాను పవన్ మర్యాదపూర్వకంగానే కలిశారని, జనసేన విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.