breaking news
Potassium ratio
-
ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!
తినే ఉప్పు.. శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్ ఎక్కువైతే ముందు రక్తపోటు.. జాగ్రత్తలేవీ తీసుకోకపోతే.. కొంత కాలం తరువాత గుండెజబ్బులు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి ఈ విషయాన్ని. కానీ మనకే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద ఉప్పులేని వంటకం తినడం దాదాపు ఎవరికీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? ఉప్పులో సోడియం క్లోరైడ్ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్ పెంచితే సరి అంటున్నారు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్‌లోనూ కేంద్రాలున్న ఈ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ ఇటీవలే ఒక భారీస్థాయి అధ్యయనం ఒకదాన్ని నిర్వహించింది. ఉప్పులో సాపేక్షంగా పొటాషియం క్లోరైడ్‌ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని నిర్ధారించింది. అంతేకాదు.. ఈ కొత్త రకం ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన చెబుతోంది. -సాక్షి, హైదరాబాద్ ప్రాణాలకు రక్ష! కొత్త రకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రూస్ నీల్ చెబుతున్నారు. అవసరానికి మించి ఉప్పు తినడం ఇప్పుడు అన్నిచోట్ల ఎక్కువ అవుతోందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రత్యామ్నాయాల (సైంధవ లవణం వంటివి)ను ఉపయోగించడం ఖరీదైన వ్యవహారం అవుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోడియం క్లోరైడ్ తక్కువగా, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఉప్పును తయారు చేసి, పంపిణీ చేయడంతోపాటు, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం ఎంతైనా అవసరమని, పైగా ఈ కొత్త రకం ఉప్పు ఖరీదు తక్కువేనని వివరించారు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వాళ్లు ఎవరైనా ఈ కొత్తరకం ఉప్పును వాడవచ్చునని చెప్పారు. ఇదీ పరిశోధన... ప్రత్యామ్నాయ ఉప్పు ప్రభావాన్ని, సమర్థతను అంచనా వేసేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ చైనాలో దాదాపు 21 వేల మందిపై పరిశోధన నిర్వహించింది, గుండెపోటు లేదా అదుపులో లేనంత ఎక్కువ రక్తపోటు ఉన్న వారిని దాదాపు 600 గ్రామాల నుంచి ఎంపిక చేసింది. 2014 ఏప్రిల్‌లో మొదలుపెట్టి 2015 జనవరి వరకూ అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ ఉప్పు మరికొందరికి సాధారణ ఉప్పు అందించింది. ఒక్కో వ్యక్తికి రోజుకు 20 గ్రాముల చొప్పున ఈ ప్రత్యామ్నాయ ఉప్పును అందించి వంట, నిల్వ (ఊరగాయ లాంటివి)లకు వాడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత అంటే 2015 నుంచి ఐదేళ్లపాటు ఈ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చింది. ఐదేళ్ల కాలంలో మూడు వేల మంది గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 14 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. గుండెకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే 13 శాతం తగ్గుదల నమోదు కాగా... అకాల మృత్యువు బారిన పడే అవకాశం 12 శాతం వరకూ తగ్గింది. చదవండి: హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు సిద్దిపేటలోనూ పరిశోధన ప్రత్యామ్నాయ ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందనేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ భారత్‌లో జరిపిన ఒక పరిశోధన తార్కాణంగా నిలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం వెలువడ్డ ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. ప్రత్యామ్నాయ ఉప్పు వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో తాము 502 మందిపై ఈ పరిశోధన నిర్వహించామని వీరిలో కొంతమందికి 70 శాతం సోడియం క్లోరైడ్, 30 శాతం పొటాషియం క్లోరైడ్ల మిశ్రమమైన ప్రత్యామ్నాయ ఉప్పును, మరికొందరికి వంద శాతం సోడియం క్లోరైడ్ ఇచ్చామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుధీర్ రాజ్ థౌట్ తెలిపారు. చదవండి : మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’ మూడు నెలల తరువాత పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ ఉప్పును వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 4.6 యూనిట్లు తగ్గిపోగా, డయాస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్‌లో, మూత్రంలో ఉప్పు అవశేషాల విషయంలోనూ సానుకూల మార్పులు కనిపించాయని వివరించారు. ఈ ఫలితాలు రక్తపోటు నివారణకు ఉపయోగించే మాత్రల ప్రభావంతో పోల్చదగ్గదిగా ఉందన్నారు. చదవండి : జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు -
పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే!
మొక్కల పెరుగుదలకు సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం. వీటిలో జింక్, ఇనుము ధాతువుల గురించి గతంలో తెలుసుకున్నాం. సూక్ష్మ పోషకాలలో ముఖ్యమైన ఇతర ధాతువులు మె గ్నీషియం, బోరాన్, గంధకం. పత్తి, వేరుశనగ పంటల్లో ఈ పోషకాలు లోపిస్తే ఏం జరుగుతుంది? ఆ లోపాలను ఎలా సవరించాలి? అనే దానిపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న సూచనలు... జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది మెగ్నీషియం ధాతువు జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది. పత్తి పైరులో ఈ ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది. పైరులో ముదురు, మధ్య ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపించినట్లు గ్రహించాలి. అయితే భాస్వరం లోపించినప్పుడు, బెట్ట పరిస్థితుల్లో, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గిపోయినప్పుడు, ఎర్ర నేలల్లో పైరును సాగు చేసినప్పుడు కూడా పత్తి ఆకులు ఎర్రబడతాయి. ఆకులు ఎర్రబడడానికి ఇవేమీ కారణం కాదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఆహారాన్ని సరఫరా చేస్తుంది ఆకుల్లో తయారయ్యే ఆహారాన్ని మొక్కలోని వివిధ భాగాలకు చేర్చడంలో బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొక్కలో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని కూడా క్రమబద్ధీకరిస్తుంది. పత్తి పైరులో ఈ ధాతువు లోపిస్తే కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి. కొమ్మల చివరి మొగ్గల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఫలితంగా పక్క నుంచి అనేక కొమ్మలు పుట్టుకొచ్చి, మొక్క గుబురుగా కన్పిస్తుంది. ఆకులు, కాడలు, చివరి మొగ్గలు రంగును, రూపాన్ని కోల్పోతాయి. అన్ని భాగాలు ముతకగా, దళసరిగా, పెళుసుగా, అక్కడక్కడ తేమగా ఉంటాయి. అవన్నీ కుళ్లుతున్నట్లు కన్పిస్తే దానిని బోరాన్ లోపంగా గుర్తించాలి. ఈ ధాతువు లోపిస్తే పిందెలు, కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 కిలోల చొప్పున బోరాక్స్ వేసుకోవాలి. పైరులో లోప లక్షణాలు కన్పిస్తే లీటరు నీటికి 1-1.5 గ్రాముల చొప్పున బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. వేర్ల ఏర్పాటుకు సహకరిస్తుంది గంధకం ధాతువు వివిధ రకాల ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. వేర్లు, విత్తనాలు ఏర్పడడానికి సహకరిస్తుంది. వేరుశనగ పైరులో గంధకం లోపిస్తే కింది ముదురాకులు మామూలుగా ఆకుపచ్చగానే కన్పించినప్పటికీ కొత్తగా వచ్చిన చిగురాకులు మాత్రం చిన్నవిగా, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకు కాడలు నిటారుగా ఉంటాయి. ఆకులు ఇంగ్లీషు ‘యు’ ఆకారంలో కన్పిస్తాయి. మొక్క సరిగా పెరగక చిన్నదిగా ఉంటుంది. వేర్లపై బుడిపెలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల నత్రజని స్థిరీకరణ తగ్గి, పైరు సరిగా పెరగదు. పంటకు సూపర్ ఫాస్ఫేట్ను వేయడం ద్వారా గంధక లోపాన్ని నివారించవచ్చు. లేకుంటే ఎకరానికి 2 క్వింటాళ్ల జిప్సంను దుక్కి సమయంలో లేదా పూత దశలో వేసుకోవచ్చు. ఏ పైరులో అయినా రెండు మూడు ధాతు లోపాలు ఒకేసారి కన్పిస్తే మిశ్రమ ధాతువుల్ని కలిగిన ఫార్ములా-4, ఫార్ములా-6, మాక్స్ వంటి మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషకాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్ శాస్త్రవేత్తలను (ల్యాండ్‌లైన్:1100, మొబైల్:1800-425-1110) కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు. ఎలుకలు దాడి చేస్తుంటే... పెనుగొండ ( పశ్చిమ గోదావరి): వరి పైరుకు ఎలుకలు చేసే నష్టం అపారం. ఇవి నారుమడిలో చల్లిన విత్తనాలను తినేస్తాయి. ఆ తర్వాత వివిధ దశల్లోనూ పైరుపై దాడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎలుకల నివారణకు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి అందిస్తున్న సూచనలు... 100 గ్రాముల బ్రోమడయోలోన్ విషపు ఎరను తయారు చేసుకోవడానికి 96 గ్రాముల నూకలు+2 గ్రాముల నూనె+ 2 గ్రాముల మందు కలపాలి. ఆ సమయంలో చేతులకు గ్లౌజులు/పాలిథిన్ సంచులు తొడగాలి. లేకపోతే చేతి వాసనను ఎలుకలు పసిగట్టి, ఎరను తినవు. మందును 10 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టుకోవాలి. ఒక్కో బొరియలో 10 గ్రాముల మందు పొ ట్లాన్ని అంగుళం లోపలికి వేసుకోవాలి. బొరియను మూసేయకూడదు. వర్షాలు పడుతున్నప్పుడు మందు కలపకూడదు. వర్షం లో తడిసిన మందు పనిచేయదు. మధ్యాహ్నం వేళ మందును కలిపి, సాయంత్రం బొరియలో వేయాలి. ఈ మందు తిన్న నాలుగైదు రోజులకు ఎలుకలు చనిపోతాయి. వాటిని ఏరి, భూమిలో పాతిపెట్టాలి. బొరియల్లోకి పొగను పంపడం (బర్రో ఫ్యూమిగేషన్) ద్వారా కూడా ఎలుకల్ని మట్టుపెట్టవచ్చు. తొలకరి చినుకు లు పడిన తర్వాత భూమిని దుక్కి చేస్తే ఎలుకల బెడద తగ్గుతుం ది. పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.