వియత్నాం ఓపెన్ ఫైనల్లో సాకేత్
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాలుగో సీడ్ సాకేత్ 5-7, 6-4, 6-2తో ఐదో సీడ్ థామస్ ఫాబియానో (ఇటలీ)పై విజయం సాధించాడు. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఏకంగా 14 ఏస్‌లు సంధించి ప్రత్యర్థిని హడలెత్తించాడు. కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసిన సాకేత్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట 6-7 (5/7), 6-4, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్ రటివటానా-సొంచాట్ రటివటానా (థాయ్‌లాండ్) జోడీపై గెలిచింది.