breaking news
pilligrims
-
ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..
నేపాల్లోని భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన జలప్రళయం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చి..శోకసద్రంలోకి నెట్టేసింది. ప్రస్తుతం అక్కడ బురదతో..తమ వాళ్ల ఆచూకీ కోసం ఆత్రంగా ఎదురు చూసే అశ్రుధారతో మిన్నంటే ఘోష కనిపిస్తోంది. ఇలాంటి విషాదకరఘటనలో కొన్ని అద్భుత సంఘటనలు మనకు మానవత్వంపై ఆశ, దేవుడిపై నమ్మకాన్ని రేకెత్తించేలా చోటు చేసుకుంటాయి. అలాంటి అపురూప ఘటనే మానసరోవర యాత్ర కోసం వచ్చిన యాత్రికులకు ఎదురైంది.అసలేం జరిగిందంటే..నేపాల్ మానస సరోవర్యాత్ర కోసం వచ్చిన తమినాడు యాత్రికులు నేపాల్లో ఆకస్మికంగా సంభవించిన వరద బీభత్సంలో చిక్కుకున్నారు. అయితే ఈవిషాదం నుంచి బయటపడ్డ 21 మంది యాత్రికులు చెన్నై చేరుకున్నాక..తామెలా బయటపడ్డామో తమ ప్రాణాలను ఎలా రక్షించుకున్నామో కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అది అద్భుతం లేక అదృష్టం అనాలో అర్థకావడం లేదు ఇంకా మా కళ్లముందు ఆ మృత్యు ఘోష కనబడుతూనే ఉందని ఆవేదనగా నాటి ఘటన గురించి ఆ బృందంలోని ఒక యాత్రికురాలు ఇలా చెప్పుకొచ్చింది. నేపాల్-చైనా సరిహద్దు వైపు రసువా జిల్లా గుండా మొత్తం మూడు బస్సుల్లో ప్రయాణిస్తున్న 57 మంది సభ్యుల బృందంలో ప్రాణాలతో బయటపడ్డ 21 మంది ఉన్నట్లు తెలిపారామె. కుంభకోణానికి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన కైలాశ్ మానసరోవర్ యాత్రలో తాము భాగమైనట్లు వెల్లడించారు. అయితే ఆగస్టు 26న, తమ బృందం శ్యాబ్రుబేసి నుంచి చైనా ఇమ్మిగ్రేషన్ పాయింట్ వైపు ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా పరిసరాలు మారిపోయాయని, దుమ్ము మేఘాన్ని చూశామని నాటి విషాదాన్ని గుర్తు చేసుకుందామె. ఆ తర్వాత ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది అచ్చం బాంబు పేలుడు లాంటి శబ్దమని, ఆ తర్వాత కొద్దిసేపటికే తమ వాహనం చుట్టూ రాళ్లు పడటం ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే నేపాలీ డ్రైవర్ మమల్ని అప్రమత్తం చేసి తక్షణమే బస్సు దిగి వెళ్లిపోవాల్సిందిగా సూచించడంతో తాము పక్కనే ఉన్న పర్వతంపైకి ఎక్కే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చింది ఆ యాత్రికురాలు. అయితే తమ బృందంలోని మగవాళ్లంతా పర్వత శిఖరం పైకి సులభంగా వెళ్లిపోగలిగారు గానీ, మహిళలు మాత్రం అస్సలు పర్వతం ఎక్కలేకపోయారని చెప్పుకొచ్చింది. ఎందుకంటే బురద, ఆ శిఖరం వాలు అత్యంత భయానకంగా ఉండటంతో ఎక్కడం కష్టమై జారిపోయామని తెలిపింది. అయితే తమ బృందంలోని ఒక మహిళ చీరవిప్పేసి, ఒక కేబుల్ వైర్కి అనుసంధానించి వదలడంతో..దాని సాయంతో తాము బయటపడ్డామని కన్నీటి పర్యంతమైందామె. ఆ మహిళ స్వెటర్ ధరించి చీర విప్పేసి తమకోసం ఇచ్చినట్లు తెలిపింది. నిజానికి ఆ మహిళ ఆ ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని గద్గద స్వరంతో చెప్పుకొచ్చిందామె. అంతేగాదు ఆ భయానక పరిస్థితుల్లో ఆ చీర తమకు ప్రాణదాతగా మారిందంటూ నాటి విషాద పరిస్థితిని వివరించారామె. కాగా, మొత్తం 57 మంది యాత్రికుల్లో కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగతా 36 మంది ఆచూకీ కానరాలేదు. అలాగే ఈ విపత్తు సమయంలో సరిహద్దు చైనా వైపున ఉన్న గిరోంగ్ పోర్ట్ ప్రాంతంలో చెన్నైకి చెందిన మరో 49 మంది యాత్రికుల ఆచూకీ కూడా తెలియరాలేదని సమాచారం. View this post on Instagram A post shared by BBC News Hindi (@bbchindi) (చదవండి: 65 ఏళ్ల వయసులో టిఫిన్ సర్వీస్! ఇవాళ ఏకంగా రూ. 2.5 కోట్లు..) -
పంపాలో పేరుకుపోయిన భక్తుల దుస్తులు.. మండిపడ్డ కేరళ హైకోర్టు
సాక్షి, కేరళ: శబరిమల యాత్ర ముగిసిన తర్వాత పంపా నదిలో భక్తులు వదిలేసిన దుస్తులతో చెత్తకుప్పలా మారింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం అధికారుల తీరుని తప్పుపబట్టింది. అలాగే ఈ దుస్తులను తొలగించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి శబరిమల సీజన్ ముగిసిన తర్వాత పంపా నదిని శుభ్రం చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నదిలో పేరుకుపోయిన బట్టల కుప్పలు పర్యావరణానికి, జలచరాలకు ముప్పుగా మారుతుందని స్పష్టం చేసింది. చాలామంది భక్తులు దీన్ని ఆచారంగా భావిస్తున్నారు..కానీ ఇది శబరిమల సంప్రదాయంలో భాగం కానేకాదని, అదొక అపోహని పేర్కొంది. భక్తులకు దీనిపై అవగాహన పెంచాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. నిజానికి ఇలా నదిలో వదిలేసిన బట్టలు కుళ్లిపోయి దుర్వాసన రావడమే గాక, ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా ఈ వ్యర్థాల వల్ల చేపలు వంటి జలచరాలు మృత్యువాతపడుతున్నాయని పేర్కొంది. కేవలం నదిలో తేలే బట్టలను మాత్రమే కాకుండా, నది అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే సుచిత్ర మిషన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పంతినం తిట్ట జిల్లా యంత్రాంగం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పంపా నదిని యథాస్థితికి తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని దేవస్వం బోర్డును ఆదేశిస్తూ కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది కేరళ హైకోర్టు. కాగా, ఈ పంపా నది కేరళలో మూడవ అతి పొడవైన నది. దక్షిణ గంగగా పూజలందుకుంటోంది. ఇడుక్కిలోని పీర్మేడు పీఠభూమిలోని పొగమంచుతో నిండిన పులచిమలై కొండల నుంచి ఉద్భవించి, అరుదైన ఔషధ వృక్షజాలంతో సమృద్ధిగా ఉన్న అడవుల గుండా ప్రవహించే ఈ పవిత్ర నది ప్రతి అలలోనూ ఇతిహాసాలు, గొప్ప చరిత్రను దాచుకుంది. ఒకప్పుడూ స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచిన అవే జలాలు ఇలా భక్తులు వదిలేసిన బట్టలు, పూసల మాలలు వంటి వాటితో కలుషితమవుతోంది. ఉనికిలోని ఆచారంతో పవిత్రమైన నదిని కాస్తా అపవిత్రంగా మారుస్తుండటం బాధకరం.(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!) -
మొక్కు తీరకుండానే మృత్యుఒడికి
రేణుకా యల్లమ్మా.. నీ దర్శనానికి వస్తున్నామమ్మా అని స్మరిస్తూ పాదయాత్రగా బయల్దేరారు. కానీ మధ్యలో మృత్యుశకటంలా బొలెరో వాహనం వచ్చింది. త్వరగా వెళ్లొచ్చు కదా అని అందులో బయల్దేరారు. విధి చిన్న చూపు చూసింది. యల్లమ్మ దర్శనానికి నోచుకోలేకపోయారు. బొలెరో ప్రమాదంలో ఆరు మంది భక్తులు అసువులు బాశారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే. కుటుంబీకుల శోకాలతో ఆ ప్రాంతం విషాద సంద్రమైంది. సాక్షి, బెంగళూరు: బెళగావి జిల్లాలో సవదత్తి రేణుకా యల్లమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం తెల్లవారుజామున రామదుర్గ తాలూకా హులకుంద గ్రామంలో ఈ దుర్ఘటన జరగ్గా, ఆరుమంది మరణించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. బొలెరో ఎక్కిన కొంత సేపటికే - రామదుర్గ తాలూకా హులకుందకు చెందిన కొందరు భక్తులు తెల్లవారుజామున నడుచుకుంటూ యల్లమ్మ దేవి దేవస్థానికి బయల్దేరారు. - మార్గమధ్యలో బొలేరో గూడ్స్ వాహనం డ్రైవర్ వాహనం ఆపి సవదత్తిలో వదులుతానని చెప్పడంతో అందరూ ఎక్కారు. - మొత్తం వాహనంలో 23 మందిని ఎక్కించుకుని డ్రైవర్ బయలుదేరాడు. ఐదు నిమిషాలు ప్రయాణించిందో లేదో రామదుర్గ తాలూకా చుంచనూర వద్ద విఠల్ రుక్మిణి గుడి వద్ద పెద్ద చెట్టుకు గుద్దుకుంది. - వాహనం ధ్వంసం కాగా అందరూ తలోదిక్కుకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో మరొకరు మరణించారు. - హనుమవ్వ మెగాడి (25), దీపా (31), సవిత (12), సుప్రిత (11), మారుతి (43), ఇంద్రవ్వ (28)లను మృతులుగా గుర్తించారు. - మరో 16 మంది గాయపడగా వారిని గోకాక్, ఇతరత్రా ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మితిమీరిన వేగమే కారణం అతి వేగం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమైంది. వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో తీసుకుని వెళ్తున్న పెద్ద పెద్ద ఇనుప పైపుల వల్ల ప్రమాద తీవ్ర ఇంకా పెరిగింది. ఇదే మార్గంలో దేవస్థానానికి వెళుతున్న ఇతర వాహనాల ప్రయాణికులు, గ్రామస్తులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కడకోళ పోలీసులు అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సంఘటన స్థలానికి ఎస్పీ సంజీవ పాటిల్ వచ్చి పరిశీలించారు. ప్రమాదంపై సీఎం బసవరాజు బొమ్మై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాకుల చెరో రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారి చికిత్సకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. -
రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి
-
రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి
తిరుమల: శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న రథ సప్తమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం స్వామి వారికి చక్రస్నానం సందర్భంగా కోనేటి వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు కోనేటిలో పడిపోయారు. వారిలో ఒక మహిళ నీటిలో ఊపిరాడక చనిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల స్నానాలు ఆపివేయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


