breaking news
Parameswara Reddy
-
సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లేదా చైనాలను ‘నరక కూపాలు’ అని పిలిచినప్పుడు అందరికీ కోపం రావడం సహజం. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు అది కేవలం అమర్యాదగా మాత్రమే అనిపించలేదు, ఇదొక కొలమాన లోపం అనిపించింది. వాషింగ్టన్ ఇప్పటికీ 1950ల నాటి పాత ఆలోచనలతోనే ప్రపంచాన్ని చూస్తోంది. తాను ఎంత విద్యుత్తును వాడుతున్నాను అనే దానినే గొప్పగా భావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలైన తృప్తిని అర్థం చేసుకోవడంలో పొరబడుతోంది. నేను 1982లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పీహెచ్డీ పూర్తి చేసి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని దశాబ్దాలుగా నేను జీవితంలోని రెండు వేర్వేరు ‘ఆపరేటింగ్ సిస్టమ్స్‘ను గమనిస్తున్నాను. వాషింగ్టన్ చూసే కోణం కేవలం ఆర్థిక గణాంకాల చుట్టూనే తిరుగుతుంది తప్ప, మనిషి అనుభవాన్ని నిర్దేశించే అసలైన విషయాలను పట్టించుకోదు. ప్రపంచాన్ని ‘ఆనందపు సామర్థ్యం’ అనే కోణం నుండి చూస్తే, ఆనందం అనేది డబ్బు (జీడీపీ) వల్ల మాత్రమే రాదని అర్థమవుతుంది. అది ఒక సామాజిక నిర్మాణం. ఈ కోణంలో చూసి నప్పుడు, బయటకు ‘నరక కూపం’లా కనిపించే దేశాలే మనిషి సంతోషంగా ఉండటానికి అనువైన ప్రదేశాలుగా కనిపిస్తాయి.ప్రమాణాల్లో తేడా నెల్లూరు జిల్లాలోని అల్లూరు మా స్వగ్రామం. 1980లో బెంగళూరులో నా పీహెచ్డీ స్టైపెండ్ నెలకు ‘50 డాలర్లు’(400 రూపాయలు). అమెరికా లెక్కల ప్రకారం ఇది పేదరికం. కానీ అప్పట్లో వాస్తవం వేరేలా ఉండేది. నా గది అద్దె 4 డాలర్లు, మరో 16 డాలర్లతో రోజుకు నాలుగు పూటలా మంచి భోజనం దొరికేది. వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, నా సొంత పనుల కోసం నేను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు. మధ్యతరగతి జీవితాల్లో పనివారు అనే వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన, ఒక ముఖ్యమైన భాగం. నేను అమెరికా వెళ్ళాక ఒక వింత పరిస్థితి చూశాను. చికెన్, గుడ్లు, కూల్ డ్రింక్స్ వంటివి చాలా చౌకగా దొరికేవి. కానీ నా ‘జీవన ప్రమాణం‘లో ఒక లోటు వచ్చింది. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఒక కూలీలా మారిపోయాను. వంట, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి పనులకు మనుషులు దొరకరు, దొరికినా చాలా ఖరీదు. భారత్‌లో మధ్యతరగతి మనిషి మేధస్సు ఇటువంటి పనుల నుండి విముక్తి పొంది ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో సంపద ఉండవచ్చు కానీ, అక్కడ ‘సమయం, సామాజిక లోటు’ ఎక్కువ.2026 నాటికి, ఒక సగటు అమెరికన్ ఒక భారతీయుడి కంటే 12 రెట్లు ఎక్కువ కరెంటు వాడుతున్నాడు. ఇంత కరెంటు వాడినంత మాత్రాన 12 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందా? నేను 1986లో కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. నా అపార్ట్మెంట్ మేనేజర్, ఒక మైలు దూరంలో మంచి షాపు ఉన్నా కూడా, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ‘మరింత శుభ్రమైన‘ షాపుకు నన్ను కారులో తీసుకెళ్లాడు. అమెరికాలో పెట్రోల్, కరెంటు చౌకగా దొరుకుతాయి కాబట్టి, ఆనందాన్ని ఇవ్వని చిన్న చిన్న సౌకర్యాల కోసం వాటిని వృథా చేస్తారు. కానీ ఇండియాలో మనం సామీ ప్యతకు, సమాజానికి విలువ ఇస్తాం. మనకు సంతోషం మన దగ్గర్లోనే దొరుకుతుంది. తక్కువ వనరులను వాడుతూ ఎక్కువ ఆనందాన్ని పొందడంలో భారతీయులు ముందున్నారు.వలసల వెనుక అసలు నిజంవలసల మీద విమర్శలు చేసేవారు ఒక విషయం మర్చి పోతున్నారు: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజాలను నడిపిస్తున్నది ఈ దేశాల మేధావులే. అమెరికా తన బయోమెడికల్ రంగం కోసం, టెక్నాలజీ కోసం ఈ దేశాల శాస్త్రవేత్తలపై ఆధార పడుతోంది. ఇవేమీ ‘లూప్‌హోల్’ వలసలు కాదు. ఇది వ్యూహాత్మక వనరుల సముపార్జన. వై2కే సంక్షోభ సమయంలో, డిజిటల్ మౌలిక సదుపాయాలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి అమెరికాకు భారతీయ ప్రతిభావంతులే అక్కరకొచ్చారు. అలాంటప్పుడు వాటిని ‘నరక కూపాలు’ అనడం అమెరికా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో!సైన్స్ పరంగా చూస్తే, నిరంతరం సౌకర్యాల మధ్య ఉండటం వల్ల అమెరికన్లలో ‘హెడోనిక్ నంబ్నెస్‘ (ఆనందాన్ని ఫీల్ అవ్వలేని తనం) ఏర్పడుతోంది. ఏసీలు, కార్లు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే కిక్ (డోపమైన్, సెరోటోనిన్) తగ్గిపోతుంది. కానీ వనరులు తక్కువగా ఉన్న చోట ఆనందం ఎక్కువగా ఉంటుంది. 25 షర్టులు ఉన్నవాడికి 26వ షర్టు వల్ల వచ్చే ఆనందం కంటే, 5 షర్టులు ఉన్నవాడికి 6వ షర్టు వల్ల వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ. అలాగే అమెరికన్ మధ్యతరగతి మనిషి భారీ ‘ఆందోళన పన్ను‘ (యాంగై్జటీ ట్యాక్స్) కడుతున్నాడు. లక్ష డాలర్ల జీతం వచ్చినా, ఇన్సూరెన్స్ బిల్లులు, ఇతర సేవల కోసం అది ఖర్చయిపోయి చేతిలో ఏమీ మిగలదు. ఇండియాలో మనకు కుటుంబం అనే భావోద్వేగ అండ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖరీదైన వ్యవస్థల కంటే, పక్కనే ఉండే కుటుంబ సభ్యులు మనకు ధైర్యాన్ని ఇస్తారు.ప్రపంచాన్ని కేవలం ఒకే కోణం నుండి చూడటం ఆపాలి. ఇల్లు ఎంత పెద్దది, ఎంత వాడుతున్నాం అనే లెక్కలతో చూస్తే భారత్, చైనాలు పేదవిగా కనిపించవచ్చు. కానీ వాటి దగ్గర లెక్కించలేని సంపద ఉంది– అదే ఆపదలను తట్టుకునే శక్తి, సామాజిక ఐక్యత.ఏ దేశాన్నయినా తక్కువ చేసి చూసే ముందు, సంతోషం అనేది ఆయా దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాషింగ్టన్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటే, ముందు ఈ అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రపంచం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
సీఎం జగన్ సీఎస్‌వోగా పరమేశ్వరరెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతాధికారిగా (సీఎస్ఓ) పి.పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పి.పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడిషనల్ ఎస్పీగా (అడ్మినిస్ట్రేషన్) పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి సీఎస్‌వోగా నియమించారు. డిప్యూటీ స్పీకర్‌కు కేబినెట్ ర్యాంకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మా నాన్నను ఎవరు చంపారు?: సునీతా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తన తండ్రి హత్యతో పరమేశ్వరరెడ్డి పాత్ర ఉందని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. కేసు దర్యాప్తు జరిగే తీరులో అనేక అనుమానాలు ఉన్నాయని, సరైన రీతిలో జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సునీతా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నాన్న చనిపోయి ఇన్నిరోజులు అయినా ...వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మా బంధువులను అదుపులోకి తీసుకుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలు ఇచ్చినా...ఆ దిశలో విచారణ చేయడం లేదు. మనిషి పోయింది మాకే. పైగా మా మీదే నింద పడింది. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా?. నిజంగా నాన్న హత్యకేసులో మా కుటుంబంలోని వ్యక్తేకే సంబంధం ఉంటే...చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఆగేవారా?. మా నాన్నను ఎవరు చంపారనే దానికి సమాధానం కావాలి. అంతేకాకుండా నాన్న హత్యను రాజకీయం చేస్తున్నారు. మా నాన్న 70వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధులు జమ్మలమడుగు కోసం ఖర్చు చేశారు. జగనన్న సీఎంని చేయడానికి, వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు కోసం నాన్న కృషి చేస్తున్నారు. కడపలో ఉన్న ప్రతి స్థానిక నేత మా నాన్నకు తెలుసు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నాన్నకు మంచి పేరు ఉంది. మా నాన్న ప్రచారంతో ఆదినారాయణరెడ్డి భయపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణరెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారు. మా నాన్నను అడ్డు తొలగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తానని ఆదినారాయణరెడ్డి భావించారు. ఈ విషయాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా.. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు. మా కుటుంబం గురించి అడిగిన ప్రతి చిన్న విషయాన్ని సిట్ అధికారులకు వివరించాను. మా నాన్నది నలుగురికి సేవ చేసే తత్వం. ఆయన అలా చనిపోతారని నేను అనుకోలేదు. నాన్న చనిపోయిన విషయం సీఐ శంకరయ్యకు ఉదయం 6.40 గంటలకు తెలిపాం. ఈ కేసులో పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. అయితే మార్చి 14వ తేదీ ఉదయం పరమేశ్వర్ రెడ్డి ఛాతీ నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరగానే వివేకానందరెడ్డి తనకు సన్నిహితుడని చెప్పారు. పరమేశ్వర్ రెడ్డి ఆ రోజంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. అదేరోజు సాయంత్రం ఆస్పత్రిలో గొడవ చేసి తనంతట తానే డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలను హరిత హోటల్లో పరమేశ్వర్ రెడ్డి కలిశారు. మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. నాన్న హత్య జరిగినప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డికి...పరమేశ్వర్ రెడ్డికి మధ్య సంభాషణలు జరిగాయి. ఇన్నిరోజులు అయినా ఆదినారాయణరెడ్డిని, పరమేశ్వర్ రెడ్డిని ఎందుకు విచారణ చేయడం లేదు. ఆదినారాయణరెడ్డిని సీఎం చంద్రబాబు రక్షిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే మాకు అనుమానం కలుగుతోంది. ఆదినారాయణ సిట్ విచారణ సరిగా లేనందునే మేము హైకోర్టును ఆశ్రయించాం. ఈ కేసును సక్రమంగా విచారణ చేయాలి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెగా న్యాయం కోసం మీడియా ముందుకు వచ్చాను.’ అని అన్నారు. సునీతా రెడ్డి ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరు, అనంతర పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వడదెబ్బకు కార్మికుడు మృతి
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ఓ యువకుడు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. గోపిరెడ్డి పరమేశ్వరరెడ్డి స్థానికంగా గల ఐటీసీ పేపర్ మిల్స్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాల నేపథ్యంలో ఎక్కువగా ఎండలో తిరిగిన పరమేశ్వరరెడ్డి శనివారం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని విజయవాలోని ఓ ఆస్పత్రికి తరలించగా శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.


