breaking news
Own funds
-
బడి బాగుకోసం..
హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ ఈదులగొంది మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు సాటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు పక్కా భవనం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన సమస్య పరిష్కారానికి సంకలి్పంచారు. ఆయన సొంత నిధులతో పాటు స్నేహితుల సహకారంతో రూ.లక్ష సమకూర్చారు. ఈ నిధులకు గ్రామస్తుల శ్రమదానం జోడించి పాఠశాలకు సొంత భవనం సమకూర్చారు. హుకుంపేట: పాఠశాలకు వసతి సమస్య పరిష్కరించేందుకు ఓ ఉపాధ్యాయుడు సొంత నిధులు వెచ్చించారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించి భవన నిర్మాణాన్ని పూర్తిచేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వసతి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకున్నారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని శోభకోట పంచాయతీ ఈదులగొంది చిన్న గ్రామం. ఇక్కడ పీవీటీజీ సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు జీవిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు.పక్కా భవనం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులంతా శ్రమదానంతో మట్టిగోడలు నిర్మించి రేకులతో షెడ్డు ఏర్పాటుచేసుకుని తాత్కాలికంగా వసతి సమస్య కల్పించారు. ఈ నేపథ్యంలో ఇదే పాఠశాలకు రెండేళ్ల క్రితం వచ్చిన ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సమస్యను గుర్తించారు.సమస్య పరిష్కరించేందుకు ఆయన సంకల్పించారు. ఇందుకు ఆయన స్నేహితులైన ఉపాధ్యాయుడు రాజేంద్ర తదితరులు ఆర్థిక సహకారం అందించారు. మొత్తంమీద భవన నిర్మాణానికి ఉపాధ్యాయుడు రూ.లక్ష వరకు నిధులు సమకూర్చారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించారు. పాఠశాల భవనాన్ని నిర్మించి వసతులు కల్పించారు.ఆదర్శంగా తీసుకోవాలి ఈదులగొంది గ్రామంలో పాఠశాల సమస్య తెలుసుకున్న ఉపాధ్యాయుడు సొంత డబ్బులుతో పాఠశాల నిర్మించడం గొప్ప విషయం. అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వెంటాడుతుంది. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి. – ఈశ్వరరావు, ఎంఈవో–2 -
ఈ సర్పంచ్ వెరీ స్పెషల్
రాజకీయాన్ని సంపాదనకు మార్గం అనుకునే ప్రస్తుత రోజుల్లో ఓ సర్పంచ్ తీరు ఆదర్శంగా నిలిచింది. సరైన రోడ్డు సదుపాయం లేక గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన ఆమె తన సొంత నిధులతో వంతెన నిర్మించారు. నాతవరం మండలంలోని వైబీ అగ్రహారం ఊరగెడ్డపై సర్పంచ్ కోసూరి విజయ నిర్మించిన వంతెన గ్రామస్తుల వెతలను తొలగించింది. వారి మన్ననలు పొందేలా చేసింది. అనకాపల్లి: మండలంలోని వైబీ అగ్రహారం పంచాయతీకి దశాబ్దాలుగా సరైన రోడ్డు సదుపాయం లేదు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనే లేదు. ఈ పంచాయతీ మొదటి నుంచీ టీడీపీకి కంచుకోట. టీడీపీ మండల అధ్యక్షుడే ఈ గ్రామానికి 15 ఏళ్లుగా సర్పంచ్. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పంచాయతీని ఈసారి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆశీస్సులతో కోసూరి విజయ గెలిచారు. ఇంతటి నమ్మకాన్నిచ్చిన పంచాయతీ ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోయే మంచి పని చేయాలని సర్పంచ్ విజయ, ఆమె భర్త బుజ్జి నిర్ణయించుకున్నారు. 5 కి.మీ. దూరం తగ్గింది దీంతో గ్రామానికి అనుకుని ఉన్న ఊరగెడ్డపై వంతెన నిర్మిస్తే మండల కేంద్రానికి వెళ్లే దూరం 5 కి.మీ. తగ్గనుండటంతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ సొంత నిధులు రూ.3.40 లక్షలు వెచ్చించి వంతెనతోపాటు, అనుసంధాన రోడ్డును పూర్తి చేశారు. వంతెన అందుబాటులోకి రావడంతో మండల కేంద్రానికి వెళ్లే దూరం, సమయం తగ్గడంతోపాటు, ఈ ప్రాంతంలో సుమారుగా 500 ఎకరాల భూముల్లో రైతుల పండించే వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఇపుడు ఒకటిన్నర కి.మీ. ప్రయాణిస్తే పంట ఉత్పత్తుల్ని గమ్యస్థానానికి చేరవేయొచ్చు. మరోవైపు నాయుడుపాలెం, మన్యపురట్ల, లింగంపేట, మండల కేంద్రం నాతవరానికి దగ్గర దారి ఏర్పడింది. పెరిగిన భూముల ధరలు వంతెన నిర్మాణంతో చుట్టు పక్కల వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు మార్గం సుగమం కావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత భూముల ధరలు పెరిగిపోయాయి. నేరుగా పంట పొలాల్లోకి వాహనాలు పోయే మార్గం ఏర్పాటయింది. సర్పంచ్ తన సొంత నిధులతో నిర్మించిన వంతెనను ఆర్భాటాలకు తావులేకుండా వార్డు సభ్యులు, గ్రామపెద్దలతోనే ప్రారంభించి, రాకపోకలు సాగించడం గమనార్హం. దీనిపై సర్పంచ్ విజయ సాక్షితో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రచారం వద్దని, గ్రామస్తుల హృదయాల్లో తాము చేసిన మంచి నిలిచిపోతే చాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అఽందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రగతి శూన్యం
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువు జిల్లా పరిషత్. అయితే దీని పాత్ర రాజకీయాలకే పరిమితమవుతోంది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేయాలనే ఆలోచన తప్పితే.. ఉన్నవనరులతో ఎలా నిధులు సమకూర్చాలనే అలోచన కరువైంది. ఫలితంగా అభివృద్దికి బాటలు వేయాల్సిన ఈ కార్యాలయం వెనుకబాటుకు గురవుతోంది. పాలకులు రాజకీయాలపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. స్వయం సమృద్ధి సాధించడంలో జిల్లా పరిషత్ ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లపై ఆధారపడడమే తప్ప సొంతగా ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్‌లకు ఆదర్శంగా నిలవాల్సిన జడ్పీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే సాధారణ నిధులతోనే కాలం వెళ్లదీస్తున్నారు తప్ప.. ఆదాయ వనరులపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు ఎన్నికలు జరిగినా కోర్టు సమస్య వల్ల పాలకవర్గాలు ఏర్పడలేదు. అధికారులు సైతం తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జడ్పీకి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ సైతం దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర నిధులు కార్యాలయంలో అవసరమైన సామగ్రి కొనుగోలుకు సరిపోతున్నాయి. ఒక్కోసారి అభివృద్ది నిధులలో కోతల కారణంగా ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా పరిషత్ ఆవరణంలోని సమావేశ మందిరాన్ని మినీ అసెంబ్లీగా మార్చాలని గతంలో పాలక వర్గాలు తీర్మానం చేసినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఉన్న సీలింగ్‌ను తరచూ మరమ్మతులు చేయిస్తూ కాలం గడుపుతున్నారు. ఉన్న ఫ్యాన్లలో ఒకటి తిరిగితే మరొకటి తిరిగే పరిస్థితిలేదు. ఖమ్మం నగరంలో ఉన్న భక్తరామదాసు కళాక్షేత్రం ఆదాయం శూన్యమనే చెప్పాలి. నగరంలో ఒక్కో ఫంక్షన్ హాలుకు రోజుకు వేలల్లో రుసుము చెల్లిస్తున్నారు. అన్ని వనరులున్నా ఈ కళాక్షేత్రానికి నెలకు వేలల్లో కూడా ఆదాయం రావడంలేదు. దీని నిర్వహణ సక్రమంగా లేక అతి తక్కువ ఆదాయానికే పరిమితం అవుతోంది. ఏడాదికి కోటిపైనే ఆదాయం.... జిల్లా పరిషత్‌కు వనరుల ద్వారా ఏడాదికి రూ.1.66 కోట్ల ఆదాయం వస్తోంది. జిల్లా పరిషత్ సముదాయంలో ఉన్న బ్యాంక్ నుంచి ఏడాదికి రూ.లక్ష, మీటింగ్ హాలుకు రూ.2 లక్షలు, కొత్తగూడెంలో షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.80 వేలు, జెడ్పీ వెనుక మామిడి తోటకు రూ.1.50 లక్షలు, రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి రూ.కోటి, ఇసుక వేలం ద్వారా రూ.50 లక్షల ఆదాయం వస్తోంది. ఈ నిధులను వివిధ ప్రాధాన్యత రంగాలకు కేటాయిస్తారు. వాటిలో 9 శాతం మంచినీరు, 35 శాతం సాధారణ పనులు, 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 15 శాతం మహిళా సంక్షేమానికి, 16 శాతం కార్యాలయ ఖర్చులు, 4 శాతం కాంటిన్జెన్స్ ఖర్చు చేస్తారు. క్వార్టర్ల ద్వారా... జెడ్పీ వెనుక భాగంలో 38 క్వార్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.6.25 లక్షలు, కొత్తగూడెంలో ఉన్న 24 క్వార్టర్ల ద్వారా రూ.3.50 లక్షల ఆదాయం వస్తుంది. అయితే వీటి పర్యవేక్షణ సక్రమంగా లేక పోవడంతో ఈ ఆదాయంలోనూ గండిపడుతోందనే వాదనలు ఉన్నాయి. ఇక ఖమ్మం,భద్రాచలం, కొత్తగూడెంలలో జెడ్పీ గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ఆదాయం శూన్యమనే చెప్పాలి. లక్షల రూపాయల వ్య యంతో వీటిని నిర్మించారు. అయితే వచ్చే ఆదా యం నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. నిరుపయోగంగా ఉన్న వనరులు... ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెంలలో స్థలా లు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. భద్రాచ లం, ఖమ్మంలో ఉన్న పలు స్థలాలు ఆక్రమణల కు గుైరయ్యాయి. వీటిపై అధికారులు, పాల కులు దృష్టిసారించిన దాఖలాలు లేవు. ప్రభు త్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారు లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదాలరు పక్కన ఉన్న ఈ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తుందని పలువురు అంటున్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం ప్రధాన వ్యాపార కూడలి మధ్యలో ఉంది. అన్ని వైపులా రహదారి సౌకర్యం ఉంది. దీని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఏడాదికి లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జెడ్పీ కార్యాలయం ఎదుట కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే భారీగా ఆదాయం వస్తుంది. నగరంలో అడ్వాన్స్‌లే రూ. లక్షల్లో ఉన్నాయి. జెడ్పీ వెనుక బాగంలో ఉన్న పండ్లతోటలో ఎర్రచందనం, టేకు మొక్కల పెంపకం చేపడితే ఆదాయం లక్షల్లో వస్తుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జెడ్పీకి చెందిన సుమారు రూ.1.50 కోట్ల విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. అయినా వీటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.