Orleans Masters
-
జపాన్ స్టార్‌కు షాకిచ్చిన తాన్వి శర్మ
ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్‌లో శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–14, 21–14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా (జపాన్)పై సంచలన విజయం సాధించింది.43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ తన్వీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఇషారాణి 21–9, 15–7తో భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్‌పై గెలిచింది. రెండో గేమ్ మధ్యలో గాయం కారణంగా మాళవిక వైదొలిగింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 12–21, 20–22తో లియో కార్నాండో–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీకాంత్ అర్హత
పారిస్ (ఫ్రాన్స్): ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–8, 21–14తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. అనంతరం రెండో రౌండ్లో శ్రీకాంత్ 21–11, 14–21, 21–12తో అర్నాడ్ మెర్కెల్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ మూడో గేమ్‌లో ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో శంకర్ 21–19, 19–21, 21–19తో మాగ్నుస్ జొహాన్సెన్ (డెన్మార్క్)పై, రెండో రౌండ్లో 21–18, 21–12తో భారత్‌కే చెందిన రితి్వక్ సంజీవ్ సతీశ్ కుమార్‌పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తరుణ్ 21–17, 9–21, 16–21తో జువో ఫు లియావో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ఉన్నతి, ఇషారాణి కూడా మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్స్ ఉన్నతి హుడా, ఇషారాణి బారువా కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఉన్నతి 21–12, 21–16తో సియు టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై, రెండో రౌండ్లో 21–13, 21–15తో కిసోనా (మలేసియా)పై గెలిచింది. ఇషారాణి క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 12–21, 21–10, 21–12తో జుయ్‌ఫె కి (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 25–27, 21–16, 23–21తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. -
ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీ విజేత ప్రియాన్షు
భారత బ్యాడ్మింటన్ యువతార, ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 21–15, 19–21, 21–16తో ప్రపంచ 49వ ర్యాంకర్ మాగ్నుస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. ప్రియాన్షుకు 18,000 డాలర్ల (రూ. 14 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్? 𝐀 𝐒𝐭𝐚𝐫 𝐢𝐬 𝐁𝐨𝐫𝐧 ⭐️🫶 Priyanshu is the men’s singles champion of #OrleansMasters2023, his first BWF World Tour Super 300 title 🏆😍 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndiaontheRise#Badminton pic.twitter.com/Mm3lOQMtwU — BAI Media (@BAI_Media) April 9, 2023 𝐀 𝐒𝐭𝐚𝐫 𝐢𝐬 𝐁𝐨𝐫𝐧 ⭐️🫶 Priyanshu is the men’s singles champion of #OrleansMasters2023, his first BWF World Tour Super 300 title 🏆😍 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndiaontheRise#Badminton pic.twitter.com/Mm3lOQMtwU — BAI Media (@BAI_Media) April 9, 2023


