breaking news
Operation Aruna Reddy Movie
-
నా కెరీర్లోనే ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చా : పోసాని
‘నేను రైటర్ గా వంద చిత్రాలు రాశాను. నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను. దర్శక నిర్మాతగా సినిమాలు తెరకెక్కించాను. నేను చేసిన అన్ని చిత్రాల్లో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ కు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా రూపొందించిందుకు గర్వంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు’ అని అన్నారు నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వ వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలతో పాటు నిర్మాతగానూ ఆయనే వ్యవహరించాడు. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. ‘మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. ఆయన అందించిన సహకారం వల్లే అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నా.ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. ఎంతో సిన్సియర్ గా ఈ సినిమాను రూపొందించాను. "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పోసాని ఎంతో ప్లానింగ్ తో రూపొందించారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే ఆయన ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కథ విన్నప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనిపించింది. ఇది పోసాని గారికి 2.ఓ గా మారుతుందని చెప్పగలను. అన్నారు.‘ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది’ అని హీరోయిన్ హిందోళ చక్రవర్తి అన్నారు. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ మా మూవీ గురించే మాట్లాడుకుంటారు. అలాంటి సెన్సేషన్ ను మా మూవీ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను’అని నటి కాజల్ శర్మ అన్నారు. నిర్మాత శ్రీనివాస్, డీవోపీ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. -
పోసాని 'ఆపరేషన్ అరుణారెడ్డి' రిలీజ్‌కి రెడీ
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఆపరేషన్ అరుణారెడ్డి'. వచ్చే శుక్రవారం(జూలై 17) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను అని చెప్పారు.(ఇదీ చదవండి: యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు) -
రాజకీయాలతో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ కి సంబంధం లేదు: పోసాని
ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది.ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది. ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు. ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు నటించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా.ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్ గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు’ అన్నారు.


