breaking news
Online purchase
-
క్లిక్.. ఆర్డర్
ఫంక్షన్‌కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్‌కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..!సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్‌కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్‌కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్‌స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్‌లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..! రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్ క్విక్ కామర్స్‌లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్‌లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు.2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించిందని సర్వేలో వెల్లడించింది. సెకనుకు 4 పాల ప్యాకెట్లు దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్‌ని ఇంటికి రప్పించుకుంటున్నారు.నిమిషాల్లో డెలివరీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.ఏం ఆర్డర్ చేస్తున్నారంటే?ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికర మైన గణాంకాలను వెల్లడించింది.» ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు.» నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు వృద్ధి శాతం 249» గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు పెరిగిన శాతం 434» ఎల్రక్టానిక్స్ ఉపకరణాలు శాతం 161» పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు పెరిగిన శాతం 166» క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు నమోదయిన శాతం 374» స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు వృద్ధి చెందిన శాతం 100 -
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
అన్ రిజర్వ్డ్ టికెట్లు కూడా అన్లైన్లో..
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీపి కబురు తెలిపారు. ఇకపై రైళ్లలో అన్ రిజర్వ్డ్ టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రైళ్లలో అన్ రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేయాలంటే.. ప్రయాణికులు టికెట్ కౌంటర్లను ఆశ్రయించాల్సిన సంగతి తెలిసిందే. రద్దీ సమయాల్లో అన్ రిజర్వ్డ్ టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్లైన్లో కూడా టికెట్లను విక్రయించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగా యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లను విక్రయించే విధానాన్ని నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్‌ను విండోస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా అన్ రిజర్వ్డ్ రైల్వే టికెట్లను నేరుగా అన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ విధానాన్ని 15 జోన్లలో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. కాగా, నవంబర్ 1 నుంచి దేశావ్యాప్తంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేవారు రైల్వే ట్రాక్ నుంచి కనీసం 25 మీటర్ల దూరంలో ఉండాలి. యూటీఎస్ యాప్ ద్వారా కేవలం అన్ రిజర్వ్డ్ టికెట్లు మాత్రమే కాకుండా, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైల్వే పాస్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. యాప్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాకింగ్‌తో ఇతర ఎలక్ట్రానిక్ పద్దతుల ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. నాలుగేళ్ల క్రితం కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అంతగా స్పందన రాలేదు. -
‘స్మార్ట్’గా కొనేస్తున్నారు..
- వచ్చే ఏడాదికల్లా స్మార్ట్ఫోన్లతో షాపింగ్ 4 కోట్ల డాలర్లకు... - అసోచాం, గ్రాంట్ థార్న్టన్ నివేదిక ముంబై: స్మార్ట్ఫోన్ల ద్వారా జరిపే ఆన్లైన్ కొనుగోలు లావాదేవీలు 2016 నాటికి 4 కోట్ల డాలర్లకు చేరనున్నాయి. ప్రస్తుతం ఇది 3 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం వచ్చే మూడేళ్లలో మరో 20 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. వీరిలో చాలా మంది స్మార్ట్ఫోన్ల ద్వారానే నెట్‌కు చేరువ కానున్నారు. అంతర్జాతీయంగా ఈ-కామర్స్ మార్కెట్లో ఆన్లైన్ ట్రావెల్ వ్యాపార విభాగం వాటా తక్కువగానే ఉన్నప్పటికీ భారత ఈ-కామర్స్ మార్కెట్లో మాత్రం దీనిదే సింహభాగం కానుంది. ఆన్లైన్ లావాదేవీలు జరిపే వారి సంఖ్య 2011లో 1.1 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాదికి ఈ సంఖ్య 3.8 కోట్లకు పెరగనుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. నెట్‌ను ఉపయోగిస్తున్న వారిలో 75 శాతం మంది 15-34 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉంటున్నారు. దేశీ ఈకామర్స్‌లో ఆన్లైన్ ట్రావెల్ వాటా 71 శాతంగా ఉంది. 2009-2013 మధ్య ఇది ఏటా 32 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. మరోవైపు, సంఘటిత రిటైల్ అమ్మకాల్లో ఆన్లైన్ రిటైలింగ్ వాటా కేవలం 8.7 శాతమే ఉంది. ఇక మొత్తం రిటైల్ అమ్మకాల్లో దీని వాటా 0.3 శాతమే. 2013లో ఈ-కామర్స్ మార్కెట్లో 26 శాతంగా ఉన్న మహిళల వాటా 2016 నాటికి 35 శాతానికి పెరగనుంది. భారత్‌లో 4,000-5,000 నగరాలు, పట్టణాల్లో ఆన్లైన్ రిటైలింగ్‌కు భారీ డిమాండ్ ఉంది. భారీ రియల్ ఎస్టేట్ వ్యయాల కారణంగా సంఘటిత రిటైల్ రంగం అంచనాలకు అనుగుణమైన స్థాయిలో విస్తరణ చేపట్టలేకపోతున్నాయని నివేదిక వివరించింది. భారత ఈ-కామర్స్ మార్కెట్ 63 శాతం వార్షిక వృద్ధితో 2016 నాటికి 8.5 బిలియన్ డాలర్లకు చేరగలదని పేర్కొంది.


