breaking news
one day tourny
-
లాంకషైర్ కౌంటీ జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్
మాంచెస్టర్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భారత బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ అడుగు పెడుతున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ ‘రాయల్ లండన్ కప్’లో అతను లాంకషైర్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. జూలై 15న అయ్యర్ జట్టుతో చేరతాడు. ఈ వన్డే టోర్నీలో భాగంగా నెల రోజుల పాటు జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా కౌంటీల్లో ఎంతో గుర్తింపు ఉన్న నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కోసం కాకుండా అయ్యర్ ప్రత్యేకంగా వన్డేల కోసం మాత్రమే లాంకషైర్‌తో జత కట్టాడు. గతంలో భారత్ నుంచి ఫరూఖ్ ఇంజినీర్, లక్ష్మణ్, గంగూలీ ఈ కౌంటీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
విజయ్ హజారే టోర్నీకి హైదరాబాద్ జట్టు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రంజీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో తలపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ... ఎస్. బద్రీనాథ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఎ. లలిత్ మోహన్, పి. సాకేత్ సాయిరాం, రోహన్ యాదవ్, ప్రిన్స్, టి. రవితేజ, బి. యతిన్ రెడ్డిలను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. ఈ జట్టుకు భరత్ అరుణ్ కోచ్‌గా ఎంపికవగా... జాకీర్ హుస్సేన్ అసిస్టెంట్ కోచ్‌గా, సి. దయానంద్ ఫీల్డింగ్ కోచ్‌గా, ప్రశాంత్ ఫిజియోగా వ్యవహరిస్తారు. కోల్‌కతాలో ఈనెల 25 నుంచి మార్చి 6 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది. జట్టు వివరాలు: ఎస్. బద్రీనాథ్ (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. అనిరుధ్, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఆకాశ్ భండారి, ఎం. రవికిరణ్, సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, హిమాలయ్ అగర్వాల్, ముదస్సిర్ హుస్సేన్, కె. రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, శరద్ ముదిరాజ్.