breaking news
NSFM
-
నూనెగింజల సాగులో మొండి చేయి..
ఆహార భద్రత పథకాన్ని పక్కాగా అమలు చేసి ఆహాధాన్యాల కొరతను అధిగమిస్తామని ప్రభుత్వం చెబుతోంది.అందుకు అవసరమైన ప్రణాళికలను జిల్లా నుంచి పంపినా పట్టించుకోలేదు. నూనెగింజల పథకానికి నిధులు కేటాయిస్తూ జీఓలు మాత్రం జిల్లా వ్యవసాయశాఖకు పంపింది. పరికరాల విషయంలో ప్రభుత్వంలోని పెద్దలకు, కంపెనీల మధ్య డీల్ కుదరక, ధరలు ఖరారుకాక పథకాలు మూలన పడిపోయాయని వ్యవసాయశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. కడప అగ్రికల్చర్ : నూనెగింజల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీంతో ఏడాది కేడాది నూనెగింజల పంటల సాగు తగ్గిపోతోంది. జిల్లాకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎస్ఎఫ్ఎం), నూనె విత్తుల పథకం (ఐసోఫాం)ను మొన్నటి వరకు వేర్వేరుగా నిర్వహించే వారు, ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి జాతీయ ఆహార పథకాన్ని అమలు చేస్తున్నారు.ఇందుకగాను 600 సాగునీటిపైపుల యూనిట్లు జిల్లాకు కేటాయించారు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా తుంపర సేద్య పరికరాలు 600 యూనిట్లు, మరొక పథకానికి కలిపి రూ.50 లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు జారీ చేసింది. ఈ పథకాల్లోని పరికరాల కోసం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం మొండి పట్టుదలతో గత ఏడాది ఇచ్చిన ధరలకే ఇప్పుడు టెండర్లు కోట్ చేయాలనే సంకేతాలు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఖరీప్ నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలు నిర్వీర్యమైపోయే పరిస్థితులు ఉన్నాయి.ఈ టెండర్లు ఖరారై ధరలు నిర్ణయమయ్యే లోపు ఖరీఫ్ పంటకాలం ముగిసిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. సాగునీటి కోసం రైతులు భగీరథ పోరాటాలు చేస్తున్నారు. సాగునీటి కష్టాలు కర్షకులకు కన్నీటిగాథను మిగులుస్తోంది. సేద్యపు జలాలను పొదుపుగా వాడడం కోసం సబ్సిడీ పైపులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం రైతుల కళ్లల్లో కాంతులు నింపలేదు. సేద్యపు నీటి కష్టాలు తీర్చలేదు. 600 యూనిట్లు మంజూరు జాతీయ ఆహార భద్రత పథకం కింద సాగు నీటిపైపులు 600 యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో ఒక్కో యూనిట్లో ఎకరాకు 60 పైపులు ఇవ్వనున్నారు.సాగునీటి పైపులకు గత ఏడాది రూ.7500 రాయితీ ఇచ్చారు. ఈ పథకం మొత్తానికిగాను రూ.35లక్షలు కేటాయించారు. అదే విధంగా నూనె గింజల అభివృద్ధి పథకం కింద దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు పథకాలకు రూ.50 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో యూనిట్‌కు 60 పైపులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు పథక ఫలాలు అందడం లేదు. మార్కెట్లో పైపులు, తుంపర సేద్య పరికరాల ధరలు అధికంగా ఉంటున్నాయని, డీజిల్, పెట్రోలు ధరలు పెరిగినందున పాత ధరలకు ఇవ్వలేమని కంపెనీలు నిరాకరించినందున, తాము కూడా ఆయా కంపెనీలు కొత్తగా ప్రకటించిన ధరలకు పైపులు, తుంపర సేద్య పరికరాలు కొనుగోలు చేసి అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేయ్యడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం కంటే ఇచ్చేదేదో మాకే ఇస్తే తుంపర సేద్య పరికరాలు, పైపులు మేమే తెచ్చుకుంటాం..కదా? అని రైతులు అంటున్నారు. రైతుల ప్రశ్నలకు అటు ప్రభుత్వం నుంచి, ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు రైతులకందించే పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. సాగునీటి పైపుల విషయంలో ప్రభుత్వ తీరు అధ్వానంగా ఉంది. కమీషన్ల కోసం ప్రభుత్వంలోని పెద్దలు ఏమైనా చేస్తారు. రైతులు ఏమై పోయినా ఫర్వాలేదు.. మాకు రావలసిన ఆమ్యామ్యాలు వస్తే చాలని అనుకుంటారు. జి.చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
బండారం బట్టబయలు!
సంక్షేమ పథకాల లబ్ధిదారుల రికార్డులు మాయం వివరాలు తమ వద్ద లేవంటూ చేతులెత్తేసిన వైనం 2011 ఇన్పుట్ సబ్సిడీ పంపిణీపై అనుమానాలు రూ.22.05కోట్లకు యూసీలు సమర్పించని అధికారులువ్యవసాయశాఖ డెరైక్టర్ సమీక్షలో వెలుగులోకి.. లబ్ధిదారుల జాబితాను తన దగ్గర ఉంచాలి అధికారులకు డెరైక్టర్ జీడీ ప్రియదర్శిని ఆదేశం మహబూబ్‌నగర్ వ్యవసాయం : పథకం అమలుచేశారు..కానీ లబ్ధిదారుల రికార్డులు మాయం.. ఇలా ఒక్క పథకం కాదు.. అన్నీంటిలోనూ ఇదే వరుస. ఎందుకు ఇలా చేశారంటే..తమ హయాంలో కాదంటూ పక్కకు తప్పుకునేందుకు యత్నం.. ఒక ఏడీఏ సొంత ఫర్మ్‌తో అవినీతికి పాల్పడినట్లు గుర్తించి విచారణకు ఆదేశించిన కొద్ది రోజుల్లోనే వ్యవసాయశాఖలో మరో అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. సమీక్షలో వెలుగుచూసిన అంశాలను బట్టి చూస్తుంటే వీరి అనుమానాలు నిజమేనా అన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లాలో అమలు అవుతున్న వ్యవసాయ సంబంధ సంక్షేమ పథకాలపై సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఆర్కేవీవై పథకంపై సమీక్ష చేస్తుండగా..2014-15 వార్షిక ఏడాదిలో ఈ పథకం కింద 320 రోటవేటర్లు పంపిణీ చేసినట్లు రికార్డులో నమోదు చేశారు. బిజినపల్లి, నాగర్‌కర్నూల్, గద్వాల్ డివిజన్లలో 150 రోటవేటర్లు పంపిణీ చేసినట్లు గుర్తించగా, అయితే లబ్ధిదారుల రికార్డులేవీ అంటూ డెరైక్టర్ ప్రశ్నించారు. తమ సమయంలో పంపిణీ చేయలేదని, తమకు తెలియదని అధికారులు పొంతన లేని మాటలు చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన డెరైక్టర్ ఆ వార్షిక ఏడాదిలో పంపిణీ చేసిన లబ్ధిదారుల లిస్టును రెండు రోజుల్లో తమకు అందించాలని టెక్నికల్ ఏఓను ఆదేశించారు. నిధుల వివరాలు లేవంటా.. జిల్లాలో పథకాల వారీగా ఎన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి..ఎన్ని పంపిణీ చేశారని రికార్డులు తేవాలని సిబ్బందిని ఆదేశించగా ఒకరిపై నొకరు బొంకుతూ చేతులు ఎత్తేశారు. ఇలా జిల్లాలో ప్రధానంగా అమలవుతున్న ఎన్‌ఎంఓఓపీ పథకం, ఎన్ఎస్పీ, ఆర్కేవీవై, ఎన్ఎస్ఎఫ్ఎం, ఎస్ఎంఏఎం పథకాల అమలు ద్వారా పంపిణీ చేసిన ఇన్పుట్ లోనూ అవ కతవకలు జరిగినట్లు డెరైక్టర్ గుర్తించారు. అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ లబ్ధిదారుల వివరాలను తన ముందు ఉంచాలన్నారు. 2011 ఇన్పుట్ సబ్సిడీ యూసీలు ఇంకా ఇవ్వని వైనం 2011లో ఇన్పుట్ సబ్సిడీ పంపిణీపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ.22.05కోట్లకు చెందిన యూసీలు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి సమగ్ర వివరాలు అందుబాటులో ఉంచాలని, త్వరలో జిల్లా సమీక్ష చేస్తానని, వివరాలు అందించని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం మూడేళ్లుగా అమలైన సంక్షేమ పథకాలతీరును క్షుణంగా పరిశీలించాలని జేడీఏ బాలును ఆమె ప్రత్యేకంగా ఆదేశించారు. పథకాల లబ్ధిదారుల వివరాల ను సమగ్రంగా సేకరించి పరిశీలిస్తే అవినీతి మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగితాలకే సంక్షేమ పథకాలు పరిమితమా? సంక్షేమ పథకాలన్ని కాగితాలకే పరిమితం అయ్యాయని, క్షేత్రస్థాయిలో అమలు కావ డం లేదంటూ వ్యవసాయశాఖ డెరైక్టర్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే టార్గెట్లు జేడీఏ కార్యాలయం వరకే పరిమితమవుతున్నాయని, ఏడీఏ, ఏఓల వరకు పో వడం లేదని, దీంతో రైతులకు అందే ప రిస్థితి కనిపించడం లేదన్నారు. కిసాన్పోర్టల్లో రైతుల పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతులందరి పేర్లను పోర్టల్‌లో పొందుపర్చాలన్నారు. ఏడీఏలు, ఏఓలు స్థానికంగా అందుబాటు లో ఉంటూ పనిచేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్, ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు.