breaking news
november 15
-
పెట్రోల్ బంకుల బంద్
దేశంలోని పెట్రోల్ డీలర్స్ ..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లనుంచి గురువారం రోజు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నవంబరు 15న దేశవ్యాప్తంగా బంద్ కు దిగనున్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు నుంచి తమకు తగ్గుతున్న మార్జిన్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు గురువారం కొనుగోళ్ల నిలిపి వేత బంద్ ను, నవంబర్ 15న పూర్తి బంద్ ను పాటిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి సారాదిందు పాల్ చెప్పారు. అలాగే ప్రస్తుతం 3 శాతంగా ఉన్న డీలర్ల కమిషన్ ను 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 53,500 పెట్రోల్ పంపులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిపారు. కొనసాగుతున్న ఆందోళన భాగంగా డీలర్లు ఇప్పటికే "బ్లాకౌట్" నిరసన కార్యక్రమాన్ని అక్టోబర్ 19 , 26 తేదీల్లో 7-7.15 గంటల మధ్య 15 నిమిషాలు చేపట్టినట్టు చెప్పారు. -
గాడ్సేను ఉరితీసిన రోజును..
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేను ఉరితీసిన నవంబర్ 15న బలిదాన్ దివస్’ నిర్వహించాలని అతివాద హిందూ సంస్థ ‘హిందూ మహాసభ నిర్ణయించింది. ఆ రోజు అన్ని రాష్ట్రాల్లో జిల్లాస్థాయిలో ‘బలిదాన్ దివస్’ నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకూ హిందూ మహాసభ సన్నాహాలు చేస్తోంది. గాంధీ హత్యకేసులో మరో నింది తుడైన నాథూరాం సోదరుడు గోపాల్ రచనలను ప్రజలకు పంచిపెట్టాలని యోచిస్తోంది. గాడ్సే దేశభక్తుడా, లేక దేశద్రోహా అన్న అంశంపై చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ తెలిపారు. ప్రజలే ఏ విషయాన్నీ నిర్ణయిస్తారని అన్నారు.