new voters joined
-
మమతా బెనర్జీకి టెన్షన్.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక
కోల్‌కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను ఎన్నికల సంఘం చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 6,82,51,008కి చేరింది. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జాబితాలో మరికొందరి పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటేయనున్నారు. వీరిలో తొలిసారి ఓటేస్తున్నవారు ఎందరు అనే వివరాలేవీ ఈసీ వెల్లడించలేదు. అవసరమైతే వాటిని తర్వాత పంచుకుంటామని పేర్కొంది. కాగా, కొత్త ఓటర్ల చేరికతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమూలంగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి 90.83 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎల్లప్పుడూ సహకరించే మైనారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తృణమూల్‌కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా కోతలు పడ్డాయి. అన్నిచోట్లా పరిస్థితి ఒకేలా లేదు. తృణమూల్‌కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్లు కనిపిస్తున్నా మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడంతో కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది.తృణమూల్‌కు సవాలే..పశ్చిమ బెంగాల్లో తృణమూల్ లెక్కలు.. మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సర్‌కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనివల్ల తృణమూల్‌వైపు ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో మైనారిటీ ఓట్లద్వారా లబ్ధి పొందిన ఐఎస్ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం నష్టపోయే అవకాశముంది.నదియాలో విచారణలో ఉన్న ఓటర్లలో 78శాతం పేర్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక తొలగింపు రేటు. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు ఆయువుపట్టులా నిలిచిన జిల్లాలపై భారీగానే దెబ్బ పడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హావ్‌డా, ఉత్తర్ దినాజ్‌పుర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 66.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. -
నమోదైన ఓటర్లు 97.97 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడున్న 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43% ఎక్కువని పేర్కొంది. 2019లో 61.4 కోట్ల ఓట్లు పోలవగా 2024లో 64.64 కోట్ల ఓట్లు పోలయ్యాయని ఇందులో 64.21 కోట్లు ఈవీఎంలలో నమోదైనట్లు వివరించింది. ఇందులో 32.93 కోట్ల పురుషులు, 31.27 కోట్ల మహిళలు, 13 వేల మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా, సార్వత్రిక ఎన్నికల్లో 42.81 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గంలో అత్యధికంగా 92.3% ఓట్లు పోల్ కాగా... అత్యల్పంగా శ్రీనగర్‌లో 38.7% పోలింగ్ నమోదైంది. అయితే 2019లో శ్రీనగర్‌లో ఇది 14.4% మాత్రమేనని ఈసీ గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా 2024లో నోటాకు 63.71 లక్షల ఓట్లు పడ్డాయని కూడా వివరించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ విస్తృత గణాంకాలను సీఈసీ గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 2024లో 10.52 లక్షల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2019 కంటే ఇది 14,816 ఎక్కువ. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరగ్గా ఈ ఏడాది కేవలం 40 పోలింగ్ స్టేషన్లలోనే రీపోలింగ్ అయ్యింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1.62 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా...2019తో పోలిస్తే 2024లో బిహార్‌లో అత్యధికంగా 4,739 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. -
నవ భారతానికి మీరే పునాది
న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న దేశ యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారి ఓట్లు నవ భారతానికి పునాది కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ ఏడాది ‘మన్ కీ బాత్’ చివరి కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ... ఆగస్టు 15 సమయంలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన యువ ప్రతినిధులతో ఢిల్లీలో మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేసి.. నవ భారత నిర్మాణంపై మేధోమథనం చేయాలని మోదీ సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ప్రగతి శీల భారతదేశం కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు పరీక్షలో ప్రథముడిగా నిలిచిన అజుమ్ బషీర్ ఖాన్ ఖట్టక్ స్ఫూర్తి కథనాన్ని అందరూ స్మరించుకోవాలని ప్రధాని అభిలషించారు. మన్ కీ బాత్‌లోని ముఖ్యాంశాలు 2000వ సంవత్సరంలో పుట్టిన వారు జనవరి 1 , 2018 నుంచి కొత్త ఓటర్లుగా నమోదుకు అర్హులవుతారు. 21వ శతాబ్దం ఓటర్లకు భారత ప్రజాస్వామ్యం స్వాగతం పలుకుతోంది. వారిని నేను అభినందించడంతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఓట్లు నవ భారతానికి ఆధారం. కులతత్వం, మతతత్వం, ఉగ్రవాదం, అవినీతి నుంచి మీరు నిర్మించే నవ భారతం విముక్తి పొందాలి. నవ భారతంలో అందరికీ సమానమైన అవకాశాలు దక్కడంతో పాటు వారి ఆశలు, ఆకాంక్షలు తీరాలి. దేశంలోని ప్రతి జిల్లాలో మాక్ పార్లమెంటును ప్రారంభిద్దామా? 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత నవ భారతంపై అందులో మేథోమధనం చేయాలి. ఆగస్టు 15 సమయంలో .. ఢిల్లీలో నిర్వహించే మాక్ పార్లమెంటులో ప్రతి జిల్లా నుంచి ఎంపికైన యువత పాల్గొని, రాబోయే ఐదేళ్లలో మన సంకల్పాల్ని సాకారం చేసుకునేందుకు ఏం చేయాలన్న అంశాలపై చర్చించాలని ఆకాంక్షిస్తున్నాను. అంజుమ్ గాథ అందరికీ స్ఫూర్తి కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన అంజుమ్ బశీర్ ఖాన్ ఖట్టక్ స్ఫూర్తి గాథ ఇటీవలే తెలిసింది. అతను కశ్మీర్‌లోని ఉగ్రవాదం, విద్వేష కోరల నుంచి బయటపడి తన లక్ష్యాన్ని సాధించాడు. 1990లో అతని పూర్వీకుల ఇంటిని ఉగ్రవాదులు తగులబెట్టారు. ఉగ్రవాదం, హింస వల్ల అంజుమ్ కుటుంబం స్వగ్రామం వదిలి వెళ్లిపోయింది. అతను మాత్రం ప్రజలకు సేవ చేయాలన్న మార్గంలో ముందుకు సాగాడు. ముస్లిం మహిళల పోరాటం ఫలించింది ఈ ఏడాది జనవరి 4 నుంచి మార్చి 10 వరకు ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛతా సర్వేను నిర్వహించబోతున్నాం. 4 వేల నగరాల్లో 40 కోట్ల మందిని సర్వే చేయనున్నాం. 2018 గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలకు చెందిన పది మంది అధినేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారని మన్ కీ బాత్‌లో ప్రధాని తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం అనంతరం ప్రధాని తొలిసారి స్పందించారు. కేరళలోని శివగిరి మఠం యాత్రికుల ఉత్సవాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. ‘ముస్లిం తల్లులు, సోదరీమణుల ఎన్నో ఏళ్ల పోరాటం అనంతరం.. అప్పటికప్పుడు ఇచ్చే ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి మార్గం దొరికింది’ అని చెప్పారు. 70 ఏళ్ల సంప్రదాయాన్ని మార్చాం.. ముస్లిం మహిళలు హజ్ యాత్రకు వెళ్లాలంటే.. తప్పకుండా మగవారి తోడు ఉండాల్సిందేనన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. 70 ఏళ్ల నుంచి వస్తున్న ఆ సంప్రదాయాన్ని మారుస్తూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఇక ముస్లిం మహిళలు ఏ సంరక్షకుడి తోడూ లేకుండా హజ్ యాత్ర చేయవచ్చు. ఈ ఏడాది ఒంటరిగా హజ్ యాత్ర చేసేందుకు 1300 మంది ముస్లిం మహిళలు నమోదు చేసుకున్నారు. వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా మైనార్టీ వ్యవహారాల శాఖను నేను ఆదేశించాను. -
ఓటు బంధం..
జన చైతన్యం పెరిగిన ఓటర్ల సంఖ్య 1,26,439 జిల్లాలో మొత్తం ఓటర్లు 28,12,636 మంది ముగింపు దశకు జాబితాల రూపకల్పన ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలాఖరున తుది ఓటర్లు జాబితాను విడుదల చేయనున్నారు. ముందెన్నడూ లేనివిధంగా జిల్లా మొత్తం మీద 1లక్షా 26వేల 439 మంది ఓటర్లు పెరిగారు. ఇందులో 60 వేలకు పైగా యువ ఓటర్లు ఉన్నట్లు అంచనా. మార్పులు, చేర్పుల అనంతరం జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్య శుక్రవారం నాటికి 28లక్షల 12 వేల 636కు చేరుకుంది. ఈ సంఖ్యలో కొంతమేర మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. నవంబర్ 18న ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ప్రక టించింది. అప్పటికి జిల్లాలో 27లక్షల 7వేల 467 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 13లక్షల 35వేల 797 మంది కాగా, మహిళలు 13,71,670 మంది. వాస్తవానికి ఈనెల 15 నాటికే తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. డూప్లికేట్ ఓట్ల తొలగింపు, ఇతర కార్యక్రమాల వవల్ల రానున్న సాధారణ ఎన్నికలకు తప్పుల్లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంతో పక్కా జాబితాను రూపొందించేందుకు అధికారులు నడుం బిగించారు. తుది జాబితాను ఈ నెలాఖరున జిల్లాలోని 3,308 పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో ఓటర్లు 26లక్షల 86వేల 197 మందిగా లెక్కతేలారు. కొత్త ఓటర్ల చేర్పులు, నియోజకవర్గాల మార్పుల రూపేణా 2లక్షల 67వేల 825 మంది అదనంగా చేరారు. మొత్తం ఓటర్లలో మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లు 1లక్షా 41వేల 386 మంది ఉన్నట్టు లెక్క తేల్చారు. వీరిని తొలగించి, కొత్త ఓటర్లను చేర్చడంతో జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 28లక్షల 12వేల 636కు చేరినట్టు ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి తేల్చింది.


