breaking news
Nagina
-
యువతి బలవన్మరణం
కదిరి టౌన్ / అమడగూరు : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న అబ్దుల్ మునాఫ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మునాఫ్ భార్య బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లి ఇటీవల తిరిగొచ్చింది. తరచూ కుటుంబ కలహాలతో గొడవపడేవారు. కొన్నాâýæ్ల కిందట స్వగ్రామం అమడగూరు మండలం కస్సముద్రంలో వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రెండో కుమార్తె నగీనా (20) ఇంట్లోనే విషపుద్రావకం తాగింది. అపస్మారకస్థితిలో పడి వున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఓడీచెరువు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే నగీనా మృతి చెందింది. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న తల్లిదండ్రులు.. తనకు పెళ్లి చేస్తే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారని, ఇది ఇష్టం లేకే నగీనా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
కలిదిండిలో మహిళ ఆత్మహత్య
కలిదిండి, న్యూస్‌లైన్ : కలిదిండి శివారు ఇందిరా కాల నీలో ఓ మహిళ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కాలనీలో నివసిస్తున్న మహిళ కాసా బాజీకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. భర్త చనిపోవడంతో బాజీ కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్న కుమార్తె నగీనా(22) ఒక వ్యక్తితో కొన్నేళ్లుగా సహ జీవనం చేస్తోంది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. నగీనా బుధవారం రాత్రి తన తల్లి ఇంటి వద్ద నిద్రిం చింది. అర్ధరాత్రి సమయంలో లైటు వెలుగుతుండటం, టీవీ ఆన్ చేసి ఉండటంతో బాజీకి మెలకువ వచ్చి చూడగా పక్క గదిలో చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ బాలశౌరి సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. తహశీల్దార్ కె. ఆంజనేయులు, వీఆర్వో శ్రీనివాసరావు సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివాహిత అనుమానాస్పద మృతి వెల్లంకి(కంచికచర్ల రూరల్) : ఓ వివాహిత ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని మృతి చెందిన సంఘటన వీరులపాడు మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వీరులపాడు మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన యర్రంరెడ్డి సాంబశివరావుతో గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకకు చెందిన శిరీషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె ప్రియ ఉంది. సాంబశివరావు లారీ డ్రైవర్. వారి ఇంట్లోని ఓ గదిలో శిరీష అత్తమామలు సీతారావమ్మ, మోహనరావు, ఆడపడుచు లక్ష్మి ఉంటున్నారు. మరో గదిలో సాంబశివరావు, శిరీష ఉంటున్నారు. సాంబశివరావు లారీ డ్యూటీకి, మోహనరావు సమీపంలోని ఓ కర్మాగారంలో పనిచేసేం దుకు వెళ్లారు. సీతారావమ్మ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. శిరీష తన కుమార్తె ప్రియను అంగనవాడీ కేంద్రంలో దింపి, ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని ఫ్యానుకు తాడుతో ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన ప్రియ ఏడుస్తుండటంతో స్థాని కులు తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతున్న శిరీష కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికిచేరుకుని పరిశీలించారు. నాగశిరీష తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ ఎం.రాంకుమార్ తెలి పారు. ఎస్ఐ ఎం.నరసింహారావు, వీఆర్వో వెంకటేశ్వరరావు, కంచికచర్ల, వీరులపాడు పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
మహిళపై యాసిడ్‌తో దాడి
మధుర: ఆస్థి వివాదానికి సంబంధించి ఓ మహిళపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ ఇంటి కొనుగోలుకు సంబంధించి వివాదం కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నాగిన అనే మహిళ, ఆమె సోదరుడు గుద్దర్ కలసి వారి సమీప బంధువు అబ్రార్ అనే వ్యక్తి వద్ద గోవింద్ నగర్ సమీపంలోని దులియా గంజ్ లో ఓ ఇంటిని కొన్నారు. ఆ ఇంటికి సంబంధించి బకాయి ఉండటంతో అబ్రార్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మంగళవారం నాగిన మరియు ఆమె సోదరి సాగిన కలిసి అబ్రార్ ఇంటికి వెళ్లారు. తాము ఇవ్వాల్సిన మొత్తాన్ని త్వరలోనే ఇస్తామని చెప్పడంతో వివాదం మొదలైంది. అబ్రార్ అతని కుటుంబ సభ్యులు కలసి డబ్బులు వెంటనే చెల్లించాలని వారితో వాగ్వివాదానికి దిగారు. అక్కడి ఆగకుండా తమ వద్ద నున్న యాసిడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగిన ముఖంపై యాసిడ్ పడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన అబ్రార్‌ను అరెస్టు చేశామని, మిగతా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.