breaking news
Nachiket Bhute
-
IND vs AUS: భారత్‌తో రెండో టెస్టు.. ఆసీస్ ఆలౌట్
భారత్- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా- ‘ఎ’ టీమ్ మిడిలార్డర్ మెరుగ్గా రాణించింది. ఫలితంగా కంగారూలు తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరుకు ఆలౌట్ అయ్యారు. పుదుచ్చేరి వేదికగా రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య మంగళవారం రెండో మ్యాచ్ మొదలైంది.టాపార్డర్ విఫలంటాస్ గెలిచిన ఆసీస్ జట్టు కెప్టెన్ పీటర్ హ్యాండ్స్కోంబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు కావడంతో కంగారూ జట్టు కష్టాల్లో పడింది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్ (2), జోష్ ఫిలిప్ (5) పూర్తిగా విఫలం కాగా.. నాథన్ మెక్‌స్వీనీ (34) కూడా నిరాశపరిచాడు.ఇక హ్యాండ్స్కోంబ్ డకౌట్ కాగా.. జేసన్ సంఘా (46), లియామ్ స్కాట్ (34) మెరుగైన ఆట తీరుతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ సామ్ హార్పర్ ఆసీస్ ఇన్నింగ్స్ గతినే మార్చివేశాడు. తొలి రోజు ఆటలో అజేయ శతకంతో క్రీజులో నిలిచాడు హార్పర్.ఆదుకున్న హార్పర్ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో కుమార్ కుశాగ్రాకు క్యాచ్ ఇవ్వడంతో హార్పర్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 223 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 128 పరుగులు సాధించాడు.ఆసీస్ ఆలౌట్మిగిలిన వారిలో టాడ్ మర్ఫీ (33), జై రిచర్డ్సన్ (31) అతడికి సహకారం అందించారు. కోరే రొచిసియోలి 16 పరుగులతో అజేయంగా నిలవగా.. లియామ్ హాచర్ (0) పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 116.3 ఓవర్లు ఆడి 358 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో స్పిన్నర్లలో షమ్స్ ములాని మూడు, ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ ఒక వికెట్ తీయగా.. పేసర్లు అన్షుల్ కాంబోజ్, నచికేత్ భూటే చెరో మూడు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆసీస్‌ను 162 పరుగుల తేడాతో చిత్తుగా చేసింది. చదవండి: కోహ్లి కచ్చితంగా పశ్చాత్తాప పడతాడు: టీమిండియా దిగ్గజ కెప్టెన్ -
IND vs AUS: టాపార్డర్ కుదేలు.. ఏడో స్థానంలో వచ్చి శతక్కొట్టాడు!
ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ బౌలర్లు ఆరంభంలో అదరగొట్టారు. కంగారూ టాపార్డర్‌ను కకావికలం చేసి శుభారంభం అందించారు. అయితే, మిడిలార్డర్ కుదురుగా ఆడటంతో తొలి రోజే ఆసీస్‌ను ఆలౌట్ చేసే అవకాశం భారత్ చేజారింది.రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ ‘ఎ’ జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా పుదుచ్చేరి వేదికగా సిరీస్ జరగుతుండగా.. తొలి టెస్టులో భారత్ ఆసీస్‌ను 162 పరుగుల తేడాతో చిత్తు చేసింది.టాపార్డర్ కుదేలుఇరుజట్ల మధ్య మంగళవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్ (2), జోష్ ఫిలిప్ (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. కొన్‌స్టాస్‌ను షమ్స్ ములానీ, జోష్‌ను నచికేత్ భూటే త్వరత్వరగా పెవిలియన్‌కు పంపారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన నాథన్ మెక్‌స్వీనీ (76 బంతుల్లో 34) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ములాని అతడి ఆశలపై నీళ్లు చల్లాడు. మరోవైపు.. కెప్టెన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను నచికేత్ డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 96 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఏడో స్థానంలో వచ్చి శతక్కొట్టాడుఇలాంటి దశలో జేసన్ సంఘా (46), లియామ్ స్కాట్ (34) ఇన్నింగ్స్ గాడిన పెట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్, ఏడో స్థానంలో వచ్చిన సామ్ హార్పర్ అజేయ శతకం సాధించాడు. అతడికి టాడ్ మర్ఫీ (91 బంతుల్లో 33) సహకారం అందించాడు.101 పరుగులతో అజేయంగాఫలితంగా మంగళవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఆసీస్ ‘ఎ’ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగలిగింది. సామ్ హార్పర్ 153 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా జై రిచర్డ్సన్ సున్నా పరుగులతో ఉన్నాడు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములాని, రైటార్మ్ పేసర్ నచికేత్ భూటే చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మరో పేసర్ అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. భారత అండర్-19 జట్టు ఆసీస్ అండర్-19 జట్టును తొలి యూత్ టెస్టులో మంగళవారం ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో చిత్తు చేసింది.చదవండి: ఆసీస్‌తో మ్యాచ్.. భారత ఓపెనర్ ప్రపంచ రికార్డు


