breaking news
MTAR company
-
ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన సుమారు రూ. 11 కోట్లతో పోలిస్తే 365 శాతం మేర వృద్ధి చెందింది. ఆదాయం రూ. 157 కోట్ల నుంచి 130 శాతం వృద్ధి చెంది రూ. 361 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన గైడెన్స్‌కి అనుగుణంగా క్యూ1లో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు కంపెనీ ఎండీ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.బీఎస్ఈలో ఎంటార్ టెక్నాలజీస్ షేరు 5% క్షీణించి రూ. 5,183 వద్ద ముగిసింది. -
హైదరాబాద్ కంపెనీ ఎంటీఏఆర్ ఐపీవో బాట
ముంబై, సాక్షి: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 600-650 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ 7 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. వీటిలో తెలంగాణలోని హైదరాబాద్‌లో కంపెనీకి ఎగుమతుల కోసం ప్రత్యేకించిన యూనిట్ ఉంది. తద్వారా రక్షణ, వైమానిక, ఇంధన రంగాలకు అవసరమైన కీలక పరికరాలను సరఫరా చేస్తోంది. (ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ) నాలుగు దశాబ్దాలుగా ఇంజినీరింగ్ విభాగంలో ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కార్యకలాపాలు విస్తరిస్తూ వస్తోంది. ప్రధానంగా ప్రెసిషన్ ఇంజినీరింగ్ విభాగంలో కంపెనీకి పట్టుంది. న్యూక్లియర్, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్లు, ఏరోస్పేస్ ఇంజిన్లు, మిసైల్ సిస్టమ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ తదితరాలకు పలు కీలక విడిభాగాలను రూపొందిస్తోంది. న్యూక్లియర్ రంగంలో 14, అంతరిక్ష విభాగంలో 6, శుద్ధ ఇంధన రంగంలో 3 చొప్పున కీలక ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2020 నవంబర్‌కల్లా రూ. 356 కోట్లకుపైగా విలువైన ఆర్డర్లను కలిగి ఉంది. (2020: ఐపీవో నామ సంవత్సరం) -
ఎంటీఆర్ కంపెనీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంటీఆర్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంపెనీ పూర్తిగా దగ్ధం అయ్యింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.


