MPs protest
-
వాయిదా పర్వం
న్యూఢిల్లీ: లోక్‌సభలో వి పక్షాల ఆందోళనలు శుక్రవారం కూడా నిర్నిరోధంగా కొనసాగాయి. దాంతో కార్యకలాపాలేవీ సాగించకుండానే సభ మరోసారి వాయిదాపడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ ఓం బిర్లా వారించినా లాభం లేకపోయింది. దాంతో, ఇలాంటి అంతరాయాలతో ఈ సమావేశాల్లో ఇప్పటికే ఏకంగా 19 గంటల విలువైన సభా సమయం వృథా అయిందంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంకగాంధీ అడగాల్సిన ప్రశ్న కూడా జాబితాలో ఉందని తెలిపారు. అయినా లాభం లేకపోవడంతో, ఇటువంటి సభను తాను నడపలేనంటూ స్పీకర్ ఆగ్రహం వెలిబుచ్చారు. నాలుగు నిమిషాలకే సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమయ్యాక కూడా అవే దృశ్యాలు కన్పించాయి. సభ్యులు నినాదాల నడుమ తిరిగి వెల్‌లోకి దూసుకెళ్లారు. తమ స్థానాల్లోకి తిరిగి వెళ్లాల్సిందిగా ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ తెన్నేటి పదేపదే విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వారం రోజులుగా... లోక్‌సభ గత సోమ వా రం నుంచీ విపక్షాల నిరసనలలో అట్టుడు కుతోంది. పలు అంశాలపై అధికార, విపక్షాలు నడుమ నువ్వా, నేనా అన్నట్టు తలపడుతున్నాయి. 2020 భారత్–చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణె రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు రాహుల్ చేసిన ప్రయత్నం వివాదానికి దారి తీయడం తెలిసిందే. దానిపై మొదలైన రగడ కొనసాగుతూనే ఉంది. దాంతో రాష్ట్రప తి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని గత 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని సమాధానం లేకుండానే సభ ఆమోదించింది.కాంగ్రెస్ నిరసన లోక్‌సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో మకరద్వారం వద్ద కాంగ్రెస్‌తో పాటు పలు ఇతర పారీ్టల ఎంపీలు నిరసనకు దిగారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, నరవణె పుస్తకం, 8 మంది ఎంపీల సస్పెన్షన్ తదితరాలపై నినాదాలతో హోరెత్తించారు. ‘వాణిజ్య వల’అంటూ అమెరికా ఒప్పందంపై బ్యానర్ ప్రదర్శించారు. ప్రియాంక, సస్పెండైన ఎంపీలతో పాటు పలువురు వీటిలో పాల్గొన్నారు. -
ఇక నియంతృత్వం నడవదు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరి ఇక నడవదంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నినదించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రిజర్వేషన్ల పెంపు అమలు కావాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును అనుసరించి 9వ షెడ్యూలులో రిజర్వేషన్లను చేర్చాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బుధవారం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. వెల్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ వాయిదా పడిన తర్వాత అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బీబీ పాటిల్, నగేశ్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సి.హెచ్.మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పసునూరి దయాకర్ ధర్నాలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టినపుడు టీఆర్ఎస్ ఎంపీలు సభలో లేరు. అన్యాయం చేయాలని చూస్తున్నరు: సీతారాం ధర్నా సందర్భంగా ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ‘జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని మేం ధర్నా చేస్తున్నాం. కాంగ్రెస్ గానీ, అధికార బీజేపీ గానీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు. రిజర్వేషన్లను సుప్రీంకోర్టు 50 శాతానికి పరిమితం చేసిందంటూ ఎస్సీ, ఎస్టీలకు అన్యా యం చేయాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదని హితబోధ చేస్తున్నాం’అన్నారు. ‘మిజో రంలో 94.8%, లక్షద్వీప్‌లో 94, నాగాలాండ్‌లో 86.8, మేఘాలయలో 86 %రిజర్వేషన్ ఉంది. ఆ రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా గిరిజన జనాభా ఉంది. అక్కడ మీరనుకుంటున్నట్లు ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఏడున్నర శాతమే ఉండాలిగా, ఎందుకు లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎందుకు హరిస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అడిగితే కేంద్రం స్పందించలేదు. వారు మా నాయకులతో మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఇది బీజేపీ ఆడుతున్న నాటకం’అని అన్నారు. ఏం మాట్లాడుతున్నరు..? రిజర్వేషన్లపై మంగళవారం ఓ నాయకుడిని కలిస్తే రాబోయే తరాలకు అన్యాయం చేస్తారా అన్నారని ఎంపీ సీతారాం చెప్పారు. ‘ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తే రాబోయే తరాలకు అన్యాయం చేసినట్టా? ఏం మాట్లాడుతున్నరు ? మీ ఒళ్లు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నరా? దేశంలోని 18% ఎస్సీలు, 10%ఎస్టీలు, బీసీలు మిమ్మల్ని క్షమించరు. గుణపాఠం చెబుతారు’అని హెచ్చరించారు. టీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి కేంద్రం స్పందించి రిజర్వేషన్ల పెంపును ఆమోదించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మీలా చిల్లర వేషాలు వేయం: బాల్క సుమన్ పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్నట్లే అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నామని, తమను ఎందుకు సస్పెండ్ చేశారని టీపీ సీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించడంపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ ఎంపీలం నిరసన తెలుపుతున్నామని.. అంతేగానీ చి ల్లర వేషాలు వేయ మన్నారు. ‘పోలవరం ముంపు మండలాలు, హైకోర్టు విభజన, విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కుల విషయాల్లోగానీ, ఇప్పుడు చేస్తున్న రిజర్వేషన్ల పోరాటంలో గానీ మూడే ళ్లలో పార్లమెంటులో ఎప్పుడూ మీలా మైకులు విరగ్గొట్టి, పేపర్లు చించి స్పీకర్‌పై విసిరేయ లే దు. మీరు చేసిందంతా అరాచకం, ఉన్మా దం. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని స్పీక ర్, గవర్నర్‌కు క్షమాపణ చెప్పండి’అన్నారు. -
'ప్రతిరోజు పార్లమెంట్‌ను స్తంభింపచేస్తాం'
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణ అభివృద్ధిలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని హైకోర్టు విభజన జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పార్లమెంట్ ను స్తంభింపజేస్తామని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ 'మా హైకోర్టును మాకు ఏర్పాటు చేయాలి. ఈ సమావేశాల్లో కూడా ఇదే అంశంపై పోరాడుతున్నాం. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలి. లేకుంటే ప్రతిరోజు పార్లమెంట్‌ను స్తంభింప చేస్తాం. ప్రధానమంత్రి ఇప్పటికైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మా హైకోర్టును మాకు ఏర్పాటు చేయాలి' అని అన్నారు. -
లోక్‌సభ రెండు గంటల వరకూ వాయిదా
న్యూఢిల్లీ : తెలంగాణ ఎంపీలు నిరసనలు, నినాదాల మధ్య లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం లోక్ సభలో ఆందోళనకు దిగారు. దాంతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తొలుత ఓసారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా టీఆర్ఎస్ ఎంపీలు తమ పట్టు వీడలేదు. ఈ అంశంపై చర్చించాల్సిందేనంటూ సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చర్చకు మళ్లీ అవకాశం ఇస్తామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. -
లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
-
లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ : లోక్‌సభ సోమవారం జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. గవర్నర్ గిరి వద్దంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. కాగా సోమవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందు గవర్నర్‌కు అధికారాలపై టీఆర్ఎస్ ఎంపీలు సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే ఎంపీల నిరసనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీల నిరసనల మధ్య రాజ్యసభ కూడా పది నిమిషాలు వాయిదా పడింది. డబ్ల్యూటీవోపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఎంపీలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో రాజ్యసభను ఛైర్మన్ వాయిదా వేశారు. -
జంతర్ మంతర్ వద్ద టీడీపీ ఎంపీల ధర్నా
రాష్ట్ర విభజనపై న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఆదివారం ఆ పార్టీ ఎంపీలు పాల్గొని నిరసన తెలిపారు. కాగా విభజనపై స్పష్టమైన వైఖరేంటో చెప్పకుండానే ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మధ్యాహ్నం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. అనంతరం హైదరాబాద్ బయల్దేరుతారు.


