పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం ఎదుట టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం ఎదుట టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణ అభివృద్ధిలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని హైకోర్టు విభజన జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పార్లమెంట్ ను స్తంభింపజేస్తామని తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ 'మా హైకోర్టును మాకు ఏర్పాటు చేయాలి. ఈ సమావేశాల్లో కూడా ఇదే అంశంపై పోరాడుతున్నాం. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలి. లేకుంటే ప్రతిరోజు పార్లమెంట్ను స్తంభింప చేస్తాం. ప్రధానమంత్రి ఇప్పటికైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మా హైకోర్టును మాకు ఏర్పాటు చేయాలి' అని అన్నారు.