
న్యూఢిల్లీ/లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌పై ముస్లిం మత బోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అధికార ఎన్‌డీయే ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద సోమవారం దీనిపై నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీతోపాటు ప్రతిపక్షం మౌనంగా ఉండటమేంటని ప్రశ్నించారు.
ఓ మసీదులో ఇటీవల జరిగిన సమావేశానికి ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav) చీర ధరించి వెళ్లడంపై మౌలానా సాజిద్ రషీద్ అనే బోధకుడు ఎస్‌పీకి చెందిన ఇక్రా హసన్ అనే ఎంపీతో పోల్చుతూ టీవీలో చర్చా కార్యక్రమం సమయంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది.
ఎంపీలు బీజేపీకి చెందిన బాన్సురీ స్వరాజ్, కాంగ్రెస్‌కు చెందిన రేణుకా చౌదరి సైతం ఖండించారు. పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన నిరసనలో పలువురు ఎన్‌డీఏ మహిళా ఎంపీలు కూడా పాల్గొన్నారు.
