breaking news
Mi5
-
జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం: ‘ఫైవ్ ఐస్’ హెచ్చరిక!
లండన్: బ్రిటన్ ప్రభుత్వ, సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకుని చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ ద్వారా ప్రమాదకరమైన గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు యూకే భద్రతా సంస్థ ‘ఎంఐ5’ హెచ్చరికలు జారీ చేసింది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లతో కూడిన ‘ఫైవ్ ఐస్’ ఇంటెలిజెన్స్ కూటమి సంయుక్తంగా ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. బీజింగ్ సైనిక ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ‘ఆగ్రెసివ్’గా ఆన్లైన్ రిక్రూట్మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తూ, అత్యంత సున్నితమైన, రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది.నకిలీ ఆఫర్ల మాయాజాలంచైనా గూఢచారులు లింక్డ్ఇన్, ఇండీడ్, అప్‌వర్క్ వంటి ప్రముఖ ప్రొఫైల్, ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ ఉద్యోగ ప్రకటనలను సృష్టిస్తున్నారు. ఫారిన్ పాలసీ అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు వంటి ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరుతో ప్రభుత్వ, సైనిక వ్యూహాత్మక సమాచారం ఉన్న అభ్యర్థులను ఆకర్షిస్తున్నారు. నిందితులు ప్రైవేట్ కన్సల్టెన్సీలు, థింక్-ట్యాంకులు లేదా హెచ్ఆర్ కంపెనీల ఉద్యోగులుగా నటిస్తూ, అభ్యర్థుల సీవీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.విచారణా విధానం - చెల్లింపులుఎంపిక చేసిన అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ, ప్రభుత్వ కాంటాక్ట్‌లు, సైనిక కార్యకలాపాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అనంతరం, చైనా అంతర్జాతీయ సంబంధాలపై నివేదికలు రాయాలంటూ ట్రయల్ టాస్క్‌లు ఇస్తున్నారు. నమ్మకం కుదిరిన తర్వాత, సీక్రెట్ సమాచారం కోసం ఒత్తిడి తెస్తూ, కమ్యూనికేషన్‌ను ఎన్క్రిప్టెడ్ యాప్స్‌లోకి మారుస్తున్నారు. ఈ నివేదికల కోసం పేపాల్, పేయనీర్, స్క్రిల్, వెస్ట్రన్ యూనియన్, క్రిప్టోకరెన్సీల ద్వారా వందల నుండి వేల డాలర్లను చేరవేస్తున్నారు.టార్గెట్‌లో ఎవరున్నారు?డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ రంగాల్లో భద్రతా క్లియరెన్స్ ఉన్నవారే ప్రధాన టార్గెట్‌గా ఉన్నారు. అలాగే ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఉన్న సైనిక సిబ్బంది, ప్రభుత్వ విధానాలపై అవగాహన ఉన్న అకడమిషియన్లు, జర్నలిస్టులు, థింక్-ట్యాంక్ ఉద్యోగులను కూడా చైనా ట్రాప్ చేస్తోంది. ఇలా అనధికారికంగా సమాచారాన్ని చేరవేసే వారు గూఢచర్య చట్టాల కింద కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. గతంలో ఇలాగే దాదాపు 20,000 మంది బ్రిటన్ పౌరులను చైనా ఏజెంట్లు సంప్రదించినట్లు ఎంఐ5 గుర్తించింది.ఇది కూడా చదవండి: శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా? -
షావోమి నుంచి ‘ఎంఐ 5’
న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమి తాజాగా ‘ఎంఐ 5’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.24,999. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.15 అంగుళాల స్క్రీన్ (1080ఁ1920 పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 4 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, ఎన్ఎఫ్సీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. నలుపు, బంగారం, తెలుపు రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్‌పోన్స్ ఏప్రిల్ 6 నుంచి ఎంఐ.కామ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో ఎంఐ-5!!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ షియామి త్వరలో తీసుకురానున్న ఎంఐ-5 మోడల్ గురించి ఇప్పుడో ఆసక్తికరమైన వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఎంఐ-5 మోడల్‌ను షియామి ఫింగర్‌ప్రింట్స్ స్కానర్ ఫీచర్‌తో ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ మొబైల్ ఫ్రంట్ విభాగంలో ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను తోసిపుచ్చుతూ చైనా ట్విట్టర్ వీబోలో వెలుగుచూసిన కొన్ని ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల ప్రకారం ఎంఐ-5లో ముందు విభాగంలో కాకుండా వెనుకవిభాగం ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను అమర్చనున్నారని తెలుస్తోంది. తాజాగా వచ్చిన గూగుల్ నెక్సెస్ తరహాలో ఎంఐ-5లో బ్యాక్సైడ్లోనే ఈ ఫీచర్ ఉంటుందని ఈ ఫొటోలు కన్ఫర్మ్ చేస్తున్నాయని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఎంఐ-5 ఫస్ట్‌లుక్‌గా చెప్తున్న ఈ ఫొటోలను బట్టి ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు పూర్తిగా మెటల్ రూపొందించి ఉంటుంది. అయితే ముందువిభాగంలోనే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఎంఐ-5 వస్తుందని కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందువిభాగంలో కాకుండా కేవలం వెనుకవైపు ఈ ఫీచర్ ఉంటుందని తాజా ఫొటోలను బట్టి తెలుస్తుండటం.. ఈ ఫీచర్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ప్రియులకు చేదువార్తే అంటున్నారు నిపుణులు.


