breaking news
Mendes
-
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
కొలంబో: ఆఖరి టెస్టులోనూ ఆతిథ్య శ్రీలంకపై ఇంగ్లండ్ జయభేరి మోగించి మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం చివరి టెస్టులో ఇంగ్లండ్ 42 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు నాలుగో రోజు 53/4 స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు జాక్ లీచ్ (4/72), మొయిన్ అలీ (4/92)లు లంక బ్యాట్స్‌మెన్‌ను చుట్టేశారు. కుశాల్ మెండిస్ (86; 8 ఫోర్లు, 1 సిక్స్), రోషన్ సిల్వా (65; 4 ఫోర్లు), పుష్పకుమార (40 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 55 ఏళ్ల తర్వాత విదేశాల్లో 3 అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనతను జో రూట్ సేన సొంతం చేసుకుంది. గతంలో 1963లో డెక్స్టర్ సారథ్యంలో ఇంగ్లండ్ 3–0తో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసింది. -
లంక పోరాటం
►ఫాలోఆన్ రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 209/2 ►కుశాల్ మెండిస్ శతకం ►సెంచరీకి చేరువలో కరుణరత్నే ►తొలి ఇన్నింగ్స్‌లో లంక 183 ఆలౌట్ ►అశ్విన్‌కు ఐదు వికెట్లు ఊహించినట్టుగానే భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను చుట్టేశారు. అశ్విన్ ధాటికి ఆ జట్టు కేవలం 183 పరుగులకే కుప్పకూలింది. అయితే 439 పరుగులు వెనకబడిన దశలో ఫాలోఆన్‌కు దిగాక లంక ఆటతీరులో మార్పు కనిపించింది. టెస్టు సిరీస్‌లో తొలిసారిగా ఆతిథ్య జట్టు పోరాడుతోంది. కుశాల్ మెండిస్, కరుణరత్నే భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి క్రీజులో నిలిచారు. దీంతో తొలి సెషన్లో ఎనిమిది వికెట్లు తీయగలిగిన భారత్.. ఆ తర్వాత రెండు సెషన్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టింది. మెండిస్, కరుణరత్నే మధ్య రెండో వికెట్‌కు ఏకంగా 191 పరుగులు జత చేరాయి. అయితే ఇంకా 230 పరుగులు వెనకబడి ఉన్న శ్రీలంక నాలుగోరోజు భారత బౌలర్ల ముందు ఏమేరకు నిలుస్తుందో వేచి చూడాలి. కొలంబో: తొలి టెస్టులో నాలుగు రోజుల్లోనే ఓటమిని అంగీకరించిన శ్రీలంక రెండో టెస్టులో మాత్రం అనూహ్య పోరాటాన్ని ప్రదర్శిస్తోంది. ఫాలోఆన్ ఆడుతున్న లంకను కుశాల్ మెండిస్ (135 బంతుల్లో 110; 17 ఫోర్లు), ఓపెనర్ కరుణరత్నే (200 బంతుల్లో 92 బ్యాటింగ్; 12 ఫోర్లు) వీరోచిత ఆటతీరుతో ఆదుకున్నారు. ఫలితంగా మూడో రోజు శనివారం ఆట ముగిసేసమయానికి ఆతిథ్య జట్టు 60 ఓవర్లలో 2 వికెట్లకు 209 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నేతో పాటు పుష్పకుమార (2 బ్యాటింగ్) ఉన్నాడు. అయితే ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడానికి లంక ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు స్పిన్నర్ ఆర్.అశ్విన్ (5/69) మాయాజాలానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. డిక్వెల్లా (48 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్‌కు 439 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జడేజా, షమీలకు రెండేసి వికెట్లుదక్కాయి. సెషన్–1 వికెట్లు టపటపా మూడో రోజు బరిలోకి దిగిన లంకను స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఆటాడుకున్నారు. తమ వైవిధ్యమైన బంతులతో కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 14 పరుగులు జోడించగానే లంక రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత డిక్వెల్లా, మాథ్యూస్ (26) జోడి కొద్దిసేపు పోరాడింది. అయితే అశ్విన్... మాథ్యూస్‌ను అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వేగంగా ఆడిన డిక్వెల్లా 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 42వ ఓవర్లో షమీ అతడిని బౌల్డ్ చేయడంతో లంక పోరాటం ముగిసినట్టయ్యింది. అశ్విన్‌కు తోడు జడేజా కూడా విరుచుకుపడటంతో వారి ఇన్నింగ్స్ స్వల్ప స్కోరుకే ముగిసింది. ఓవర్లు: 20.3, పరుగులు: 133, వికెట్లు: 8 సెషన్–2 మెండిస్, కరుణరత్నే జోరు లంచ్ విరామం అనంతరం కెప్టెన్ కోహ్లి లంకను ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. అయితే మూడో ఓవర్లోనే ఉమేశ్ యాదవ్.. తరంగ (2)వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. ఈ దశలో మెండిస్, కరుణరత్నే మాత్రం భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా మెండిస్ వన్డే తరహాలో దూకుడును ప్రదర్శిస్తూ స్వీప్‌షాట్లతో చెలరేగాడు. ఎనిమిదో ఓవర్లో మెండిస్ క్యాచ్‌ను ధావన్ అందుకోలేకపోయాడు. ఇక జడేజా వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో మెండిస్ ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది ఒత్తిడి పెంచాడు. దీంతో 53 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయ్యింది. అటు కరుణరత్నే 83 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున రాబట్టిన ఈ జోడి మరో వికెట్ పడకుండా టీ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 29, పరుగులు: 118, వికెట్లు: 1 సెషన్–3 మెండిస్ శతకం టీ బ్రేక్ అనంతరం కూడా భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా జాగ్రత్తగా ఆడుతూ మెండిస్, కరుణరత్నే జోడి ముందుకుసాగింది. అయితే పరుగుల వేగం తగ్గింది. 120 బంతుల్లో మెండిస్ సెంచరీ సాధించాడు. ఈ దశలో పాండ్యాను బరిలోకి దించిన కోహ్లి వ్యూహం ఫలితాన్నిచ్చింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అతను 55వ ఓవర్లో విడదీశాడు. వికెట్ కీపర్ సాహా పట్టిన క్యాచ్‌తో మెండిస్ సూపర్ ఇన్నింగ్స్ ముగిసింది. అలాగే రెండో వికెట్‌కు 191 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరో ఐదు ఓవర్ల అనంతరం లంక మూడో రోజు ఆటను ముగించింది. ఓవర్లు: 31, పరుగులు: 91, వికెట్లు: 1 ► 2 భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన రెండో బౌలర్.. తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జడేజా గుర్తింపు. -
శ్రీలంక చేతిలో భారత్ చిత్తు
-
దిమ్మ తిరిగింది!
►శ్రీలంక చేతిలో భారత్ చిత్తు ►ఏడు వికెట్లతో ఓడిన కోహ్లి సేన ►చెలరేగిన మెండిస్, గుణతిలక ►ధావన్ సెంచరీ వృథా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి అమితోత్సాహంతో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్... ఇప్పటి వరకు టోర్నీలో ఏ మాత్రం అవకాశాలు లేని జట్ల జాబితాలో నిలిచిన శ్రీలంక అద్భుత ఆటతో భారత్‌ను పడగొట్టేసింది. 300కు పైగా పరుగులు చేశామని, పేస్ బలగం బాగుందని ధీమాగా ఉన్న టీమిండియాను లంక యువ క్రికెటర్లు ఒక ఆటాడుకున్నారు. అలవోకగా పరుగులు సాధించి తమ జట్టుకు అనూహ్య విజయాన్ని అందించారు. ముందుగా శిఖర్ ధావన్ సూపర్ సెంచరీకి తోడు రోహిత్, ధోని మెరుపులతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. తర్వాత ఐదు ఓవర్లలోపే తొలి వికెట్ కూడా పడగొట్టారు. కానీ కుషాల్ మెండిస్, గుణతిలక భారీ భాగస్వామ్యంతో చెలరేగగా, కుషాల్ పెరీరా అండతో కెప్టెన్ మ్యాథ్యూస్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. లంక బ్యాట్స్‌మెన్‌లో ఇద్దరు రనౌట్, ఒకరు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగ్గా, వారి బ్యాటింగ్ జోరు ముందు మన బౌలర్ల ప్రదర్శన తేలిపోయింది. లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. టోర్నీలో బలహీనంగా కనిపించిన శ్రీలంక దూకుడైన బ్యాటింగ్‌తో కోహ్లి బృందాన్ని చిత్తు చేసింది. గురువారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (128 బంతుల్లో 125; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... రోహిత్ శర్మ (79 బంతుల్లో 78; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎమ్మెస్ ధోని (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. అనంతరం శ్రీలంక 48.4 ఓవర్లలో 3 వికెట్లకు 322 పరుగులు చేసింది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుషాల్ మెండిస్ (93 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్), ధనుష్క గుణతిలక (72 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మ్యాథ్యూస్ (45 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) లంక విజయంలో ప్రధాన పాత్ర పోషించగా, కుషాల్ పెరీరా (44 బంతుల్లో 47 రిటైర్డ్‌హర్ట్; 5 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శుభారంభం... గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా రోహిత్, ధావన్ జాగ్రత్తగా, చక్కటి సమన్వయంతో భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 48 పరుగులు చేసింది. పెరీరా వేసిన 20వ ఓవర్లో రోహిత్ ఒక్కసారిగా దూకుడు పెంచాడు. పెరీరా బౌలింగ్‌లో సిక్స్‌తో 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, అదే ఓవర్లో మరో భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మలింగ బౌలింగ్‌లోనూ మరో సిక్స్ కొట్టిన రోహిత్, తర్వాతి బంతికే వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడగా, కోహ్లి (0), యువరాజ్ (7) విఫలమయ్యారు. ధావన్ స్పెషల్... ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై గత నాలుగు మ్యాచ్‌లలో కలిపి 377 పరుగులు సాధించిన ధావన్, అదే జోరును కొనసాగించాడు. అద్భుతమైన టైమింగ్‌తో షాట్లు ఆడాడు. ఈ క్రమంలో 69 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత చెలరేగిపోయిన శిఖర్... మలింగ, ప్రదీప్ వేసిన వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదాడు. అనంతరం ప్రదీప్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా ఫోర్ కొట్టి 112 బంతుల్లో ధావన్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరకు మలింగ అతని ఆటను ముగించాడు. ధోని దూకుడు... ఇన్నింగ్స్ 34వ ఓవర్లో క్రీజ్‌లోకి వచ్చిన ధోని భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. మలింగ బౌలింగ్‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన ధోని, 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 40–45 ఓవర్ల మధ్య తాను ఎదుర్కొన్న 14 బంతుల వ్యవధిలో ధోని ఆరు ఫోర్లు కొట్టడం విశేషం. పెరీరా బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టిన మాజీ కెప్టెన్, అతని బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. పాండ్యా (9) ప్రభావం చూపలేకపోయినా, పెరీరా వేసిన ఇన్నింగ్స్ చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి కేదార్ జాదవ్ (13 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో తానూ కీలక పాత్ర పోషించాడు. చివరి పది ఓవర్లలో భారత్ 103 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... తొలి 7 ఓవర్లలో 22 పరుగులు... ఒకే ఒక్క బౌండరీ. ఓపెనర్ డిక్వెలా (7) అవుట్... శ్రీలంక పరిస్థితి ఇది. అయితే గుణతిలక, మెండిస్ భాగస్వామ్యం ఒక్కసారిగా ఆ జట్టు ఇన్నింగ్స్‌ను పరుగెత్తించింది. వీరిద్దరి చక్కటి బ్యాటింగ్, సమన్వయానికి తోడు భారత బౌలర్లు పట్టు తప్పడం కూడా లంకకు కలిసొచ్చింది. ఉమేశ్ బౌలింగ్‌లో గుణతిలకే భారీ సిక్సర్‌తో మొదలైన ఈ జోరు మరో ఇరవై ఓవర్లకు పైగా సాగింది. 24 పరుగుల వద్ద మెండిస్ ఇచ్చిన కష్టసాధ్యమైన రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడంలో పాండ్యా విఫలమయ్యాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే గుణతిలక హాఫ్ సెంచరీ పూర్తయింది. జడేజా వేసిన ఓవర్లో వీరిద్దరు చెలరేగి 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాబట్టారు. 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మెండిస్, పాండ్యా బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలతో మరింత దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరి ధాటిని అడ్డుకునేందుకు చివరకు కేదార్‌కు బౌలింగ్ ఇచ్చిన కోహ్లి, తర్వాతి ఓవర్లో తనే స్వయంగా బౌలింగ్‌కు దిగాడు. ఈ ఓవర్లో భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది. లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి గుణతిలక రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. కొద్ది సేపటికి భువీ త్రోకు మెండిస్ కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్‌కు మళ్లీ పట్టు చిక్కింది. అయితే మ్యాథ్యూస్, కుషాల్ పెరీరా ఆ అవకాశం ఇవ్వలేదు. ఏ మాత్రం తడబడకుండా దూకుడు ప్రదర్శించిన వీరిద్దరు వేగంగా జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. 10.2 ఓవర్లలోనే 75 పరుగులు జోడించిన అనంతరం పెరీరా కండరాల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే గుణరత్నే (21 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాథ్యూస్ శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లే! గ్రూప్ ‘బి’లో పరిస్థితి చాలా స్పష్టం. గెలిచిన జట్టు సెమీస్‌కు, ఓడితే ఇంటికి. భారత్‌పై శ్రీలంక విజయంతో ఎలాంటి లెక్కల అవసరం లేకుండా రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లకు వేదిక సిద్ధమైంది. ప్రస్తుతం భారత్, పాక్, లంక, దక్షిణాఫ్రికా ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. తర్వాతి మ్యాచ్‌లో గెలిచే జట్లకు అది రెండో విజయం అవుతుంది కాబట్టి సెమీస్‌లో చోటు ఖాయం. ఆదివారం భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుండగా, సోమవారం పాక్, శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. అయితే వర్షంతో మ్యాచ్‌లు రద్దయ్యే పరిస్థితి వస్తే మాత్రం క్యాలిక్యులేటర్ చేత పట్టక తప్పదు! చాంపియన్స్ ట్రోఫీలో నేడు న్యూజిలాండ్& బంగ్లాదేశ్ వేదిక: కార్డిఫ్, గ్రూప్: ‘ఎ’ మ.గం. 2.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం