Massive Earth Quake
-
మయన్మార్‌లో భారీ భూకంపం.. 200 చేరిన మృతుల సంఖ్య
Myanmar, Thailand Earthquake Live Updates: మయన్మార్: మయన్మార్‌లో 200 దాటిన భూకంప మృతుల సంఖ్యమృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశంభారీగా కుప్పకూలిన 40 అపార్ట్మెంట్లు శిధిలాల కింద వెయ్యిమందికి పైగా ఉన్నారని అంచనాకొనసాగుతున్న సహాయక చర్యలు రోడ్లపైనే క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్సమయన్మార్శిధిలాల కింద వందల మంది ప్రజలు మయన్మార్‌లో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యఇప్పటి వరకు భూకంపం ధాటికి 103 మరణించినట్లు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంమృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశంభూకంపంతో కూలిన భారీగా సముదాయాలుశిధిలాల కింద వందల మంది ప్రజలు అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ ప్రభుత్వం థాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థం హెల్ప్లైన్భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ప్‌లైన్ నంబర్+66618819218థాయ్‌లాండ్‌లో ఎయిర్పోర్ట్ లాక్డౌన్అన్ని విమానసర్వీలు రద్దుథాయ్లాండ్కు వచ్చే విమానాలు దారి మళ్లింపుథాయ్లాండ్ లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రకటించిన షినవ్రతమయన్మార్, బ్యాంకాక్‌ో కుప్పకూలిన వందల భవనాలుభయంతో రోడ్డపైకి వచ్చిన వేలాది మంది జనంశిథిలాల కింద వేలమంది ఉన్నట్లు అధికారులు ప్రకటనమృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశంబ్యాంకాక్ో మెట్రో రైలు ేసేవలు నిలిపివేతబ్యాంకాక్లో శిథిలాల్లో చిక్కుకున్న పలువురుఓ భవనంలో 50 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడిబ్యాంకాక్లో భవనాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు Over 40 construction workers are reported missing, following the collapse of an under construction high-rise building in the Thai capital of Bangkok, as a result of today’s 7.7 magnitude earthquake in Myanmar. pic.twitter.com/ydkbxExorf— OSINTdefender (@sentdefender) March 28, 2025 భారీ భూకంపంతో మయన్మార్ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి బహుళ అంతస్తుల భవనాలు ఊగిపోయి కుప్పకూలిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి భారీగా కంపించింది. చైనా, భారత్, లావోస్, బంగ్లాదేశ్‌లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నాం 12గం.50ని. ప్రాంతంలో తొలుత భూమి భారీగా కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో రెండుసార్లు కంపించింది. మొదటిసారి రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో.. రెండోసారి 6.4 తీవ్రత.. మూడోసారి 4.9 తీవ్రత నమోదైంది. సెంట్రల్ మయన్మార్‌లోని సగైంగ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో.. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర నమోదైంది. మరోసారి భూకంపం వస్తాయన్న హెచ్చరికలు అక్కడి అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయిస్తున్నారు.భూకంపం ధాటికి జనం రోడ్ల మీదకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలిపోవడం, ప్రకంపనల ధాటికి పైఅంతస్తుల్లోని స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు కిందకు పడడం, నేల మీద ఉన్న పూల్స్లోని నీరు కూడా బయటకు ఉబికిరావడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న చారిత్రక వంతెన అవా బ్రిడ్జి కుప్పకూలిపోయింది.#BREAKING A 7.9-magnitude earthquake struck Myanmar, according to the China Earthquake Networks Center. Neighboring regions, including Thailand and China's Yunnan Province, felt significant tremors. #Myanmar #earthquake pic.twitter.com/qgRHQ7ltjl— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) March 28, 2025మరోవైపు థాయ్‌లాండ్ ఉత్తర భాగం మొత్తం భూకంపంతో వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. ప్రాణభయంతో జనాలు పరుగులు తీసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అక్కడి నష్టం వివరాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకోవైపు చైనా సరిహద్దు ప్రావిన్స్‌తో పాటు బంగ్లాదేశ్, లావోస్, భారత్‌లోనూ భూమి కంపించింది. భారత్‌లో మణిపూర్, కోల్‌కతా, మేఘాలయా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఇటు మయన్మార్, అటు థాయ్‌లాండ్‌లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 🚨 7.7 Magnitude Earthquake Hits Mandalay, MyanmarMultiple buildings destroyed in devastating quake.#Myanmar #Earthquake #แผ่นดินไหว pic.twitter.com/fgQTBlUqjw— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025 Under construction building collapses in Myanmar following 7.7 scale #earthquake pic.twitter.com/8yzH8UFvjk— The Raisina Hills (@theraisinahills) March 28, 2025 1930 నుంచి 1956 మధ్య 7 తీవ్రతతో మయన్మార్‌లో భారీ భూకంపాలే సంభవించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇంత శక్తివంతమైన ప్రకంపనలు సంభవించడం ఇదే. చివరిసారిగా.. 206లో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పాత రాజధాని బాగన్‌లో ముగ్గురు మరణించారు. A massive 7.6m earthquake that just hit Thailand minutes ago. This caused a new skyscraper under construction to collapse in downtown Bangkok. https://t.co/0TF79rqqIq pic.twitter.com/RpzLKwQPvW— RyanMatta 🇺🇸 🦅 (@RyanMattaMedia) March 28, 2025 🚨 Strong 7.7 Earthquake shakes Bangkok: People run out onto the streets, water splashes out of swimming pools.pic.twitter.com/U4nlcRGaT0— Gems (@gemsofbabus_) March 28, 2025 -
చైనాలో భారీ భూకంపం.. వందకు పైగా మృతులు?
China Earthquake News: భారీ భూకంపం(Earthquake Today) మన పొరుగు దేశం చైనాను కుదిపేసింది. గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటిదాకా 110కిపైగా మృతదేహాల్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాయువ్య గన్స్, కింగ్హై ప్రావిన్స్‌ల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం 5.9గా పేర్కొంది. భూకంపం వల్ల వందల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లను బయటకు తీసే క్రమంలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మొబైల్ టార్చ్ల వెలుతురులో రెస్క్యూ.. చైనాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విపరీతంగా మంచు కురవడం, వాన కురుస్తుండడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అర్ధరాత్రి భూకంపం నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని తెలుస్తోంది. రెస్క్యూ టీం వాహనాలను రోడ్లపై పేరుకుపోయిన మంచు ముందుకు వెళ్లనివ్వడం లేదు. దీంతో సిబ్బందికి స్ట్రెచర్లను మోసుకుంటూ కొంతదూరం వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు అంధకారం నెలకొనడంతో.. సెల్‌ఫోన్ టార్చ్ల వెలుతురులోనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి బృందాలు. రెస్క్యూ బృందాలు తమ శక్తిమేర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు. మరోవైపు సోషల్‌మీడియాలో భూకంప తాలుకా దృశ్యాలు కనిపిస్తున్నాయి. Un terremoto de magnitud 6,2 se produjo en la provincia china de Gansu, informaron medios locales. pic.twitter.com/ZqmF31JB5e — Sarah Ilych♦️♥️🧸RIA Novosti (@Sarah83336937) December 18, 2023 #BreakingNews :--Death toll from earthquake in central China rises to 111, hundreds injured... #ChinaEarthquake #china #Earthquake #ChinaNews #Death #ChinaSuarez pic.twitter.com/nTy0YmePzX — Vikas Bailwal (@VikasBailwal4) December 19, 2023 SISMO DE MAGNITUD 6 EN #CHINA DEJA AL MENOS 86 MUERTOS Este lunes, un sismo de magnitud 6 se registró en la provincia china de #Linxa- #Gansu, según informó el Servicio Geológico de Estados Unidos (USGS). Este movimiento telúrico dejó al menos 86 muertos y varios… pic.twitter.com/5JeTjZpApn — El Dato Noticias Morelos (@eldatomx) December 19, 2023 గతంలో.. భూకంపాలు చైనాలోనూ సర్వసాధారణమే. ఈ ఏడాది ఆగష్టులో 5.4 తీవ్రతతో తూర్పు చైనాలోభూకంపం సంభవించి 23 మంది గాయపడ్డారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 100 మంది చనిపోయారు. అయితే.. 2008లో రిక్టర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం మాత్రం 87 వేల మందిని కబళించింది. అందులో దాదాపు ఆరు వేల మంది చిన్నారులే ఉన్నారు. ఇదీ చదవండి: అక్కడ తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే.. -
పసిఫిక్ ద్వీపదేశంలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బీ: తరచూ భూకంపాల బారిన పడే ఫసిఫిక్ ద్వీపదేశం.. పపువా న్యూ గినియా Papua New Guinea మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు స్థానిక విపత్తుల విభాగం. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో చంబ్రీ లేక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దాదాపు 62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ ప్రాంతం.. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భారీగా భూమి కంపించిందని స్థానికుడొకరు చెప్తున్నాడు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అలాగే అక్కడ కొండ ప్రాంతాలు అధికం. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం చేస్తుంటుంది. తద్వారా పేదరికంలో ఉన్న దేశం పరిస్థితి.. నానాటికీ మరింతగా దిగజారిపోతోంది. కిందటి ఏడాది సెప్లెంబర్‌లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. ఇక 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం. -
మెక్సికోను కుదిపేసిన భూకంపం
32 మంది మృతి; రిక్టర్ స్కేల్‌పై 8.1గా తీవ్రత ► పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రం ► సునామీ హెచ్చరికలు జారీ మెక్సికో సిటీ: మెక్సికో దేశాన్ని శుక్రవారం ఉదయం అత్యంత శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి మెక్సికో తీర ప్రాంత రాష్ట్రాల్లో 32 మంది మరణించారు. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. పసిఫిక్ మహాసముద్రంలో 69.7 కి.మీ లోతున భూకంపం సంభవించగా.. ముందు జాగ్రత్తగా ఉత్తర అమెరికా ఖండంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మెక్సికో చియాపాస్ రాష్ట్రంలోని తపాచులాకు 165 కి.మీ. దూరంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో(భారత కాలమానం ప్రకారం) పసిఫిక్ సముద్రంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ. దూరంలో ఉన్న మెక్సికో నగరంలో కూడా భవనాలు కంపించాయి. భూకంప తీవ్రతను 8.2 గా మెక్సికో ప్రభుత్వం పేర్కొనగా.. అమెరికా భూభౌతిక విభాగం మాత్రం తీవ్రత 8.1గా నమోదైందని వెల్లడించింది. ఒయక్సకా రాష్ట్రంలో మొత్తం 23 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్ అలెజాండ్రో మురాత్ చెప్పారు. ఒక్క జుచితాన్ పట్టణంలోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రతకు జుచితాన్ పట్టణం ఎక్కువగా నష్టపోయింది. చియాపాస్ రాష్ట్రంలో ముగ్గురు, టబాస్కో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. మెక్సికో నగరం సహా 11 రాష్ట్రాల్లోని స్కూళ్లను మూసివేయాలని, నిర్మాణాల్ని తనిఖీ చేశాకే తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మీటరు ఎత్తుతో అలలు మెక్సికో తీరంలో ఒక మీటరు ఎత్తుతో అలలు ఎగసిపడ్డాయని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈక్వెడార్, ఎల్‌సాల్వడార్, గ్వాటెమాలా తీర ప్రాంతాల్లోను మీటరు, అంతకంటే తక్కువ ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని వెల్లడించింది. హవాయి దీవులకు, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతాలకు ఎలాంటి ముప్పులేదని పేర్కొంది. 5 కోట్ల మందిపై ప్రభావం ‘గత వందేళ్లలో ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇదే’ అని మెక్సికో అధ్యక్షుడు నియోటో అన్నారు. భూకంపం అనంతరం జాతీయ విపత్తు నివారణ కేంద్రంలో స్వయంగా ఆయన సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. మెక్సికోలో 5 కోట్ల మంది పై ప్రభావం ఉంది. భూకంపం అనంతరం 4 అంతకుమించిన తీవ్రతతో 20 సార్లు ప్రకంపనలు వచ్చాయని అమెరికా భూభౌతిక విభాగం తెలిపింది. మెక్సికో సరిహద్దు దేశం గ్వాటెమాలా దేశంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 1985లో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికోలో 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. -
మెక్సికో తీరంలో భారీ భూకంపం... సునామీ వార్నింగ్
-
మెక్సికో తీరంలో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్