breaking news
marriage promise
-
పెళ్లి పేరుతో ఎర... రూ.3.5 కోట్ల టోకరా
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి టి.క్రాంతి సింగ్ 2019లో కుటుంబ వేడుకలో పరిచయమైన హర్షితా సింగ్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ.3.5 కోట్లు కాజేసిందని సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెకు అప్పటికే వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం దాచింది. అత్యవసరం, వైద్య ఖర్చులు అంటూ ఆమె, కుటుంబ సభ్యులు డాక్టర్ శైలేందర్ సింగ్, లాజ్వంతి సింగ్ భారీ మొత్తాలు కోరారు. బాధితుడు రుణాలు, తాకట్టు, బంగారం విక్రయం ద్వారా చెల్లించాడు. చికిత్సలపై అనుమానం రావడంతో ఆసుపత్రుల్లో విచారించి అబద్ధమని తేల్చాడు. డబ్బు తీసుకున్నట్లు అంగీకరించినప్పటికీ బెదిరించారని ఆరోపించాడు. 2024 ఆగస్టులో ఆత్మహత్యకుప్రయత్నించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూమి అభివృద్ధి పేరిట రూ.2 కోట్ల మోసం మొహమ్మద్ అమీర్ హుస్సేన్ (మెరిడియన్ హోమ్స్ భాగస్వామి)ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు విశ్వనాథుల శశిధర్, చికోటి కృష్ణ, జి. వెంకటేశ్వర్రావు, వి. రాజ్యలక్ష్మి రూ.2 కోట్లకు మోసం చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది. నిందితులు నందిగామలో 80 ఎకరాల భూమిపై అభివృద్ధి హక్కులు ఉన్నాయని చెప్పి, 2021–2022 మధ్య మూడు విడతల్లో రూ.2 కోట్లు తీసుకున్నారు. ఎంఓయూ రాసుకున్నప్పటికీ, అసలు భూ యజమానులు హక్కులు లేవని వెల్లడించారు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా, మరో ఎంఓయూ చేసి రూ.3 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ డబ్బును వేరే అవసరాలకు మళ్లించారని తెలిసి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
డిప్యూటీ మేయర్‌పై రేప్ కేసు
ఢిల్లీ: గుర్గావ్ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత పర్మిందర్ కటారియాపై అత్యాచార కేసు నమోదైంది. ఆర్థికంగా, మానసికంగా బలహీనంగా ఉన్న మహిళను బెదిరించి లోబర్చుకుని, చివరకు మొఖం చాటేసిన కటారియాపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఆశ చూపించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆరోపిస్తూ ఆ మహిళ కటారియాపై ఫిర్యాదు చేయడంతో అతగాడి బండారం బయటపడింది. పోలీసులు సమాచారం ప్రకారం భర్తనుంచి విడిపోయిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో అశోక్ విహార్ లో నివసిస్తోంది. మున్సిపల్ ఆఫీసులో పనిమీద వెళ్లిన ఆమెను కటారియా టార్గెట్ చేశాడు. ఉద్యోగం ఆశ చూపి, ఆమెతో ప్రేమ నటించి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరు నెలలపాటు సహజీవనం చేశాడు. కానీ పెళ్లి ఊసు లేకపోవడంతో ఆమె కటారియాను నిలదీసింది. దీంతో అయ్యగారి అసలు రూపం బయటపడింది. ఆగ్రహానికి గురైన కటారియా, ఆయన స్నేహితులు ఆమెను బెదిరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే , పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. దీంతో అతని మోసాన్ని పసిగట్టిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి, నమ్మించి, తనపై లైంగిక దాడికి పూనుకున్నాడని ఆరోపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ మేయర్ కటారియా పరారీలో ఉన్నాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసు ఉన్నతాధికారి దీపక్ సహరాన్ తెలిపారు. తనకున్న పలుకబడినీ, పరిచయాలను ఉపయోగించి గుర్గావ్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలిని వశపర్చుకుని, నమ్మించినట్టుగా తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై హరియాణా కాంగ్రెస్ స్పందించింది. కటారియా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. అటు బీజేపీ ప్రతినిధి సూరజ్ పాల్ ఈ ఘటనపై వ్యాఖ్యానించారు. విచారణలో అన్ని విషయాలు తేలతాయన్నారు.


